బిమన్ బెనర్జీ
బిమన్ బెనర్జీ (జననం 1948, డిసెంబరు 28) పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు. 2011, మే 30 నుండి పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్‌గా పనిచేశాడు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడిగా బరుయ్పూర్ పశ్చిమ్ నుండి పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యాడు.
బిమన్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్ | |
---|---|
పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్ | |
Assumed office 2011, మే 30 | |
గవర్నర్ |
|
Deputy |
|
ముఖ్యమంత్రి | మమతా బెనర్జీ |
అంతకు ముందు వారు | హషీమ్ అబ్దుల్ హలీమ్ |
శాసనసభ సభ్యులు | |
Assumed office 13 May 2011 | |
అంతకు ముందు వారు | రాహుల్ ఘోష్ |
నియోజకవర్గం | బరుయిపూర్ పశ్చిమ్ |
కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ | |
In office 1985–1990 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కోల్‌కతా, పశ్చిమ బెంగాల్[1] | 1948 డిసెంబరు 28
రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్(1998 నుండి) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(1998 వరకు) |
జననం, విద్య
మార్చుగార్డెన్ రీచ్‌లో పుట్టి పెరిగిన బిమన్ బెనర్జీ గోయెంకా కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి కామర్స్, న్యాయశాస్త్రంలో ఏకకాలంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేశాడు. ఇతని తాత సతీష్ చంద్ర బెనర్జీ, ఇతని తండ్రి ప్రణోతోష్ బెనర్జీ ప్రసిద్ధ న్యాయవాదులు. ఇతను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి, తరువాత ఉద్యోగం వదిలి న్యాయవాద వృత్తిలో చేరాడు. హరి మోహన్ ఘోష్ కళాశాలలో వాణిజ్య & పారిశ్రామిక చట్టంలో పార్ట్ టైమ్ లెక్చరర్‌గా కూడా పనిచేశాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎగ్జామినర్‌గా కూడా పనిచేశాడు. 1985లో వార్డ్ నెం.136 నుండి కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
మార్చు2011 మే లో, బరుయ్‌పూర్ పశ్చిమ్ నుండి తృణమూల్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ప్రతిపక్షాలు ఆ పదవికి అభ్యర్థిని ప్రతిపాదించకపోవడంతో, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[3] ఎన్నికల తర్వాత, ప్రతిపక్షాల సున్నితత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సలహా మేరకు, మాట్లాడటానికి మరింత సమయం ఇస్తానని హామీ ఇచ్చారు, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకుడు సూర్యకాంత మిశ్రా స్వాగతించాడు. బిమన్ బెనర్జీ ఎన్నికైన తర్వాత, మిశ్రా, ప్రబోధ్ చంద్ర సిన్హా, సుభాస్ నస్కర్ చేత స్పీకర్ కుర్చీకి తీసుకువెళ్లారు, అక్కడ అతను అవుట్‌గోయింగ్ స్పీకర్ హషీమ్ అబ్దుల్ హలీమ్‌తో మర్యాదలు మార్పిడి చేసే ప్రోటోకాల్‌లో నిమగ్నమయ్యాడు.[4][5]
మూలాలు
మార్చు- ↑ "Shri Biman Banerjee". Lok Sabha TV.
Date & Place of Birth: 28 Dec 1948, Metiaburuj, Kolkata, South 24 Parganas
- ↑ Biman Banerjee. "Biman Banerjee — Home Page". Archived from the original on 8 May 2013. Retrieved 31 August 2011.
- ↑ PTI (21 May 2011). "West Bengal: Biman Banerjee nominated for Speaker, Sonali Guha for Dy Speaker". Dainik Bhaskar. Retrieved 31 August 2011.
- ↑ HT Correspondent (30 May 2011). "Biman Banerjee elected West Bengal assembly speaker". Hindustan Times. Archived from the original on 25 January 2013. Retrieved 31 August 2011.
- ↑ Pallab Ghosh (30 May 2011). "Biman Bandopadhyay become new speaker in West Bengal Assembly". InstaBlogs. Archived from the original on 30 March 2012. Retrieved 31 August 2011.