బిర్సా ముండా విమానాశ్రయం

బిర్సా ముండా అంతర్జాతీయ విమానాశ్రయం

బిర్సా ముండా విమానాశ్రయం (Birsa Munda Airport) జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉన్న విమానాశ్రయం.[2] ముండా జాతికి చెందిన వ్యక్తి, భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడైన బిర్సా ముండా పేరు దీనికి పెట్టడం జరిగింది. ఇది ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న ఈ విమానాశ్రయం రాంచీ నగర కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల (3.1 మైళ్ళ) దూరంలో ఉంది. ఈ విమానాశ్రయ విస్తీర్ణం 1568 ఎకరాలలు, అయితే ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నియంత్రణలో 546 ఎకరాల (221 హెక్టార్ల) విస్తీర్ణం మాత్రమే ఉంది. ఏటా 1.5 మిలియన్ ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్న ఈ విమానాశ్రయం ప్రతి భారతదేశంలో 28వ రద్దీగా ఉండే విమానాశ్రయం.

బిర్సా ముండా విమానాశ్రయం
రాంచీ విమానాశ్రయం
రాంచీ బిర్సా ముండా విమానాశ్రయం
 • IATA: ఐ.ఎక్స్.ఆర్
 • ICAO: వి.ఈ.ఆర్.సి.
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రజా
కార్యనిర్వాహకత్వంఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా
సేవలురాంచీ
ప్రదేశంహినూ, రాంచీ (హటియా)
ఎత్తు AMSL646 m / 2,120 ft
అక్షాంశరేఖాంశాలు23°18′51″N 085°19′18″E / 23.31417°N 85.32167°E / 23.31417; 85.32167
వెబ్‌సైటుAAI page
పటం
బిర్సా ముండా విమానాశ్రయం is located in Jharkhand
బిర్సా ముండా విమానాశ్రయం
Location of airport in India
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
మీటర్లు అడుగులు
13/31 2,713 8,901 తారు
హెలీపాడ్స్
సంఖ్య పొడవు ఉపరితలం
మీటర్లు అడుగులు
H1 19 63 తారు
గణాంకాలు (ఏప్రిల్ (2017) - మార్చి (2018))
Passenger movements1,778,349 Increase71.7
Aircraft movements1,500,9
Cargo tonnage4,743
Source: ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా[1]

టెర్మినళ్లు

మార్చు

ఇంటిగ్రేటెడ్ టెర్మినల్

మార్చు

బిర్సా ముండా విమానాశ్రయంలోని ఇంటిగ్రేటెడ్ ప్రయాణీకుల టెర్మినల్ భవనాన్ని 2013, మార్చి 24న అప్పటి పౌర విమానయాన మంత్రి అజిత్ సింగ్ ప్రారంభించారు.

19,600 చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ. 138 కోట్ల వ్యయంతో నిర్మించింన ఈ టెర్మినల్ భవనంలో రెండు ఏరో-వంతెనలు, ఆరు ఎస్కలేటర్లు ఉన్నాయి. ఇక్కడ ఉపయోగించే పరికరాలన్ని చైనా, జర్మనీ, సింగపూర్ నుండి దిగుమతి చేయబడ్డాయి. ఒకే సమయంలో 500 దేశీయ, 200 అంతర్జాతీయ ప్రయాణీకులు ఈ విమానాశ్రయంలో ఉండవచ్చు.[3]

2013, మార్చిలో ఇక్కడ విమానయాన టర్బైన్ ఇంధన పన్ను 20% నుండి 4% వరకు తగ్గించబడడంతో ఇక్కడికి ఎక్కువ విమానాలు రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. రెండు కొత్త ఏరోబ్రిడ్జిలను నిర్మించడానికి,[4] రన్ వేను విస్తరించబడానికి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు చేస్తుంది.

కార్గో టెర్మినల్

మార్చు

2017, ఫిబ్రవరిలో జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ కార్గో టెర్మినల్ ను ప్రారంభించారు. ఈ టెర్మినల్ రోజువారీ 50 MTల కార్గోను నిర్వహించగలుతుంది. ఇందులో పేలుడు ప్రదార్థాల గుర్తింపు పరికరాలు, సరుకు ఎక్స్-రే యంత్రాలు, హార్డువేరు భద్రతా యంత్రాలు, సిసిటీవి కెమెరాలు ఉన్నాయి.[5]

వాయుమార్గాలు, గమ్యస్థానాలు

మార్చు
విమానయాన సంస్థలు గమ్యస్థానాలు
ఎయిర్ ఏషియా ఇండియా బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా[6]
ఎయిర్ ఇండియా ఢిల్లీ[7]
అలియన్స్ ఎయిర్ భువనేశ్వర్, కలకత్తా, రాయ్ పూర్[8]
ఎయిర్ ఒరిస్సా ఝార్సుగుడా (జూలై 9న ప్రారంభం)[9]
గో ఎయిర్ బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పాట్నా[10]
ఇండిగో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ఇండోర్ [11][12], కలకత్తా, ముంబై, పాట్నా[13]
విస్తారా ఢిల్లీ[14]

మూలాలు

మార్చు
 1. "TRAFFIC STATISTICS - DOMESTIC & INTERNATIONAL PASSENGERS". Aai.aero. Archived from the original (jsp) on 3 జనవరి 2015. Retrieved 2 జూలై 2018.
 2. నమస్తే తెలంగాణ, నిపుణ - విద్యా సమాచారం (27 January 2017). "జార్ఖండ్ సమాచారం". Archived from the original on 29 జూన్ 2018. Retrieved 2 July 2018.
 3. "New terminal at Ranchi airport to be inaugurated on Sunday". 19 March 2013. Retrieved 3 July 2018.
 4. The Pioneer (18 May 2018). "Infra-boost to cater for increasing passenger flow to airport". Dailypioneer.com. Retrieved 3 July 2018.
 5. "Cargo terminal for Ranchi airport ahead of business meet". 9 February 2013. Retrieved 3 July 2018.
 6. "Airport Movement Report" (PDF). Dgca.nic.in. 28 October 2018. Archived from the original (PDF) on 14 ఫిబ్రవరి 2019. Retrieved 2 May 2019.
 7. "Airport Movement Report" (PDF). Dgca.nic.in. 28 October 2018. Archived from the original (PDF) on 14 ఫిబ్రవరి 2019. Retrieved 2 May 2019.
 8. "Airport Movement Report" (PDF). Dgca.nic.in. 28 October 2018. Archived from the original (PDF) on 14 ఫిబ్రవరి 2019. Retrieved 2 May 2019.
 9. "Air Odisha - Flight Schedule". 2 May 2018. Archived from the original on 3 మే 2018. Retrieved 3 July 2018.
 10. "Airport Movement Report" (PDF). Dgca.nic.in. 28 October 2018. Archived from the original (PDF) on 14 ఫిబ్రవరి 2019. Retrieved 2 May 2019.
 11. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-06-24. Retrieved 2018-07-02.
 12. https://www.goindigo.in/booking/[permanent dead link]
 13. "Airport Movement Report" (PDF). Dgca.nic.in. 28 October 2018. Archived from the original (PDF) on 23 నవంబరు 2018. Retrieved 2 May 2019.
 14. "Airport Movement Report" (PDF). Dgca.nic.in. 28 October 2018. Archived from the original (PDF) on 4 జనవరి 2019. Retrieved 2 May 2019.

ఇతర లంకెలు

మార్చు