బిళ్ళగన్నేరు (ఆంగ్లం: The Madagascar Periwinkle; The Rose Periwinkle) అనేది భారతదేశంలో సర్వసాధారణంగా కనబడే ఒక చిన్న మొక్క. దీని నుండి ముఖ్యమైన కాన్సర్ మందులను తయారుచేస్తున్నారు.

బిళ్ళగన్నేరు
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
కథ. రొజేయుస్
Binomial name
కథరాంథుస్ రొజేయుస్
Synonyms

వింకా రోజియా

Catharanthus roseus
వృక్షశాస్త్రము
బిళ్ళగన్నేరు—గులాబీ రంగులో

చరిత్ర

మార్చు

బిళ్ళ గన్నేరు (కాథరాంథస్ రోజస్) కెన్యా, ఉగాండా, తాంజనియా (హెండర్సన్ 2002) దేశాలలో సహజసిద్ధమైనది. తాంజనియాలోని చాలా జిల్లాల్లో దీనిని అలంకారం కోసం సాగుబడి చేస్తారు. ఇది పొడి నెలలో, బహిరంగ ప్రదేశాలలో, రహదారుల ప్రక్కలా విరివిగా పెరుగుతుంది. ఈ మొక్క తీరప్రాంత ఆవాసాలతో, ఇసుక నేలలతో ఉన్నచోట్లలో బాగా కనబడతాయి. ఇది నిజానికి తూర్పు-ఆఫ్రికాకు చెందిన ఒక సాధారణ తోట మొక్క. బిళ్ళగన్నేరు దీర్ఘకాలికమైన పొదలు కలిగి ఉండి, 30-100 సెం.మీ ఎత్తు దాకా పెరుగుతుంది; అందమైన పువ్వులు ఆకులలో వస్తాయి. దీని పండు 2.0-4.7 సెం.మీ పొడవులో చిన్నచిన్న నల్లని విత్తనాలను కలిగియుంటాయి. బిళ్ళగన్నేరులో తెలుపు, గులాబీ, వంకాయ వంటి రంగుల పూలతో ఉన్న రకాలు కూడా ఉంటాయి.[1]

భారతదేశంలో బిళ్ళగన్నేరు

మార్చు

మన దేశములో అస్సాం, బీహార్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. వివిధ రాష్ట్రములలో క్రింది పేర్లతో దీనిని పిలుస్తారు: [2]

  • ఆంగ్లము—మాడగాస్కర్ పెరీవింకిల్; గ్రేవ్యార్డ్ ప్ల్యాంట్; కేప్ పెరీవింకిల్; రోజీ పెరీవింకిల్
  • అస్సాం—నయన్తారా, పిరాలి కున్వోరి
  • బెంగాలీ—నొయొంతారా
  • హిందీ—సదాబహార్, సదాఫులీ, సదాసుహాగీ
  • కొంకణి—సదాపుష్ప
  • కన్నడము—సదాపుష్ప
  • మలయాళం—నిత్యకల్యాణి
  • మరాఠీ—సదాఫులీ
  • తమిళము—నిత్తియ కల్యాణి

లక్షణాలు

మార్చు
  • బహువార్షిక చిన్న పొద.
  • దీర్ఘచతురస్రాకారం లేదా విపరీత అండాకారంలో ఉండి ప్రకాశవంతమైన చిక్కని ఆకుపచ్చ రంగుతో ఉన్న సరళ పత్రాలు.
  • పత్ర గ్రీవాల్లో సాధారణంగా రెండేసి చొప్పున ఏర్పడిన తెలుపు గులాబీ రంగు పుష్పాలు.
  • జంట ఏకవిదారక ఫలాలు, నల్లని విత్తనాలు.

ఉపయోగాలు

మార్చు

బిళ్ళగన్నేరు నుండి వింకా ఆల్కలాయిడ్స్ తయారుచేస్తారు. ఇవి విన్ బ్లాస్టిన్, విన్‌క్రిస్టీన్. ఇవి కాన్సర్ వైద్యంలో వాడతారు. బిళ్ళగన్నేరు ఆకులను, పూలను మధుమేహ నివారణకు, అధిక రక్తపోటును నియంత్రిచుటకే గాక, పలు చర్మవ్యాధుల చికిత్సలో కూడా వినియోగిస్తారు.[3]

మూలాలు

మార్చు
  1. "Factsheet - Catharanthus roseus (Madagascar Periwinkle)". keys.lucidcentral.org. Retrieved 2020-10-22.
  2. "Catharanthus roseus (L.) G. Don". India Biodiversity Portal. Retrieved 2020-10-22.
  3. Moudi, Maryam; Go, Rusea; Yien, Christina Yong Seok; Nazre, Mohd. (Nov 2013). "Vinca Alkaloids". International Journal of Preventive Medicine. 4 (11): 1231–1235. ISSN 2008-7802. PMC 3883245. PMID 24404355.