బి.కె. పార్థసారథి

బీ.కే. పార్థసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

బీ.కే. పార్థసారథి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2019
ముందు పరిటాల సునీత
తరువాత మాలగుండ్ల శంకర నారాయణ
నియోజకవర్గం పెనుకొండ నియోజకవర్గం

ఎంపీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
ముందు సానిపల్లి గంగాధర్‌
తరువాత జి.నిజాముద్దీన్
నియోజకవర్గం హిందూపురం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు నంజయ్య, సంజీవమ్మ
జీవిత భాగస్వామి కమలమ్మ
సంతానం జ్యోతి, సంధ్య, సౌమ్య & సాయి కళ్యాణ్

రాజకీయ జీవితం

మార్చు

బీ.కే. పార్థసారథి 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి 1996 నుండి 1999 వరకు అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, 1999 నుండి 2004 వరకు హిందూపురం ఎంపీగా పని చేసి[2] 2009లో పెనుకొండ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో తిరిగి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై. 2018లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఎన్నికై[3] 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పదవికి రాజీనామా చేసి,[4] 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (25 May 2018). "పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రోగ్రెస్ రిపోర్ట్". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
  2. Sakshi (3 May 2014). "పురం.. ఎవరి పరం ?". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
  3. Sakshi (20 April 2018). "తితిదే బోర్డు మెంబర్ల నియామకం." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  4. Sakshi (19 March 2019). "బొండా ఉమా, పార్థసారధి రాజీనామా". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.