బి.వి.పరమేశ్వరరావు
బి.వి.పరమేశ్వరరావు మహిళల ఆర్థిక స్వేచ్ఛకోసం "మహిళా సంఘాల"కు బీజం వేసినవాడు. అతను భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ (బీసీటీ) వ్యవస్థాపకుడు. మహిళల ఆర్థిక స్వేచ్ఛ ద్వారానే గ్రామస్వరాజ్యం సాధ్యమని భావించిన అతను నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఆర్థికమంత్రి పీవీ నరసింహారావు తోడ్పాటుతో అప్పట్లోనే మహిళా సంఘాలకు బీజం వేశాడు[1].
భాగవతుల వెంకట పరమేశ్వరరావు | |
---|---|
జననం | బి.వి.పరమేశ్వరరావు 1933 జనవరి 17 |
విద్య | ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఎమ్మెస్సీ న్యూక్లియర్ సైన్స్ లో పీహెచ్‌డీ |
విద్యాసంస్థ | ఆంధ్ర విశ్వవిద్యాలయం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సమాజ సేవకుడు, రచయిత |
తల్లిదండ్రులు | కీ.శే. సోమన్న కీ.శే. సీతారావమ్మ |
జీవిత విశేషాలు
మార్చుబి.వి.సోమేశ్వరరావు విశాఖ పట్నం జిల్లా, రాంబిల్లి మండలం, దిమిలి గ్రామంలో 1933 జనవరి 17 న భాగవతుల సోమన్న, సీతారావమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం విశాఖపట్నంలో పూర్తి చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, అమెరికా లోని పెన్ స్టేట్ యూనివర్సిటీలో న్యూక్లియర్ సైన్స్ లో పీహెచ్‌డీ చేశాడు. గ్రామీణ ప్రాంతం అంటే ఆయనకు ఎంతో మక్కువ. ఉన్నత విద్యను పూర్తిచేసిన తర్వాత తిరిగి స్వగ్రామం దిమిలి వచ్చాడు. ఉన్నత పాఠశాల నిర్మాణానికి గ్రామస్థులతో కలిసి నడుం బిగించాడు. పాఠశాలకు అవసరమైన భూమిని తన తండ్రిపేరుతో విరాళంగా ఇచ్చాడు[2]. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో రీసెర్చ్ అసోసియేట్‌గా కొన్నాళ్లు పనిచేశాడు[3].
భాగవతుల చారిటబుల్ ట్రస్ట్
మార్చుగ్రామీణ ప్రజలకు, వ్యవసాయ రంగంలోని రైతులకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో 1976లో భాగవతుల చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాడు.[4] ఆ సంస్థ ద్వారా అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వయోజనవిద్య కోసం పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి జిల్లాలోని 27 మండలాల్లో నాన్‌ఫార్మల్ స్కూళ్లను ఏర్పాటు చేశాడు. రెసిడెన్షియల్ స్కూల్, ఐటీఐ, యువతకు ఉపాధి శిక్షణ, రైతుల కోసం కృషివిజ్ఞాన కేంద్రం ద్వారా వ్యవసాయ మండలి ఏర్పాటు చేశాడు.[2][5] విద్యతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ, ఆరోగ్య సేవలు, వ్యవసాయ పరిశోధన, బీడు భూములను సాగులోకి తేవడం లాంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించాడు. గ్రామీణ కళలు, సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాడు[6].
రచయితగా
మార్చుఅతను ‘నమ్మలేని నిజాలు, నా గ్రామానుభవాలు’ పేరుతో పుస్తకాన్ని రచించాడు.[7]
వ్యక్తిగత జీవితం
మార్చుఅతను 2019 జూన్ 9 న మరణించాడు.[8] అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మూలాలు
మార్చు- ↑ "Dr. Bhagavatula Venkata Parameswara Rao – ICA". Archived from the original on 2019-07-07. Retrieved 2019-07-07.
- ↑ 2.0 2.1 "'భాగవతుల' ఇక లేరు".[permanent dead link]
- ↑ "సంఘ సేవకుడు భాగవతుల కన్నుమూత". www.sakshieducation.com. Retrieved 2019-07-07.
- ↑ "BCT" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-07-07.
- ↑ Sarma, Ch RS. "The nuke scientist who found his true calling". @businessline. Retrieved 2019-07-07.
- ↑ "గ్రామీణ భారత దిశా నిర్దేశకుడు బి.వి.పరమేశ్వరరావు కన్నుమూత". www.andhrajyothy.com. 2019-06-10. Retrieved 2019-07-07.[permanent dead link]
- ↑ "BCT Archives". Yellamanchili - Mana Ooru Mana Vaartha. Archived from the original on 2019-07-07. Retrieved 2019-07-07.
- ↑ "భాగవతుల వెంకట పరమేశ్వరరావు కన్నుమూత".
బాహ్య లింకులు
మార్చు- virijallu (2015-02-01), Virijallu Radio Interview with BV Parameswara Rao, Founder - Bhagavatula Charitable Trust, retrieved 2019-07-07
- "ఆఖరి గాంధేయవాది". www.andhrajyothy.com. 2019-06-15. Retrieved 2019-07-07.[permanent dead link]
- "THE WEEK ARCHIVES: Dr Parameswara Rao: A trust that has transformed life in Andhra villages". The Week. Retrieved 2019-07-07.