బి.సి.జనార్దన్ రెడ్డి

బి.చిన్నోల జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014లో బనగానపల్లె నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

బి.సి.జనార్దన్ రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 - 2019
నియోజకవర్గం బనగానపల్లె నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 5 జులై 1959
ఎనకండ్ల, బనగానపల్లె మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు మనోహర్ రెడ్డి, మనోరమ, శ్రీలక్ష్మి
జీవిత భాగస్వామి ఇందిరమ్మ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

బి.సి.జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో చేరాడు.అతను 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి పై గెలిచి, తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అతను 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓడిపోయాడు.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. The New Indian Express (8 January 2022). "TDP names new in-charges for 3 nagara panchayats ahead of polls". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.