బి. జనార్దన్‌రెడ్డి

బి. జనార్దన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా 2021 మే 19న నియమితుడై, 2021 మే 21న బాధ్య‌త‌లు చేపట్టి[1], 2023 డిసెంబరు 11న తన పదవికి రాజీనామా చేశాడు.[2][3]

బి. జనార్దన్‌రెడ్డి
బి. జనార్దన్‌రెడ్డి


పదవీ కాలం
19 మే 2021 – 11 డిసెంబర్ 2023

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతదేశం
నివాసం హైదరాబాద్
పూర్వ విద్యార్థి ప్రొఫ్.జయశంకర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ
వృత్తి మాజీ ఐఏఎస్‌ అధికారి, మాజీ టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌

జననం, విద్యాభాస్యం

మార్చు

బి. జనార్దన్‌రెడ్డి మహబూబ్​నగర్​ జిల్లా బాలానగర్‌ మండలం పెద్దాయిపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు బాలానగర్‌ మండల కేంద్రంలోనిలో ప్రభుత్వ పాఠశాల చదివాడు. ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు.ఆయన హైదరాబాద్ రాజేంద్రనగర్‌ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు.[4]

వృత్తి జీవితం

మార్చు

బి. జనార్దన్‌రెడ్డి 1990లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో ర్యాంకు సాధించి డిఫ్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్లగొండ, నెల్లూరు ఆర్డీవోగా, వరంగల్‌, అనంతపురం జిల్లాల కలెక్టర్‌గా పనిచేశాడు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, సెరికల్చర్‌, మార్కెటింగ్‌ శాఖల కమిషనర్‌గా, సహకారశాఖ రిజిస్ట్రార్‌గా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా, విద్యాశాఖ కమిషనర్‌గా పనిచేశాడు. జనార్దన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన ఐఏఎస్ గా 2022 నవంబరులో పదవీ విరమణ పొందనున్నా ఆయనను 2021, మే 19న టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.[5][6][7][8]

రాష్ట్రంలో 2023లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వంలో నియమితులైన టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మిగతా ముగ్గురు సభ్యులు తమ పదువులకు రాజీనామా చేశారు.[9]

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (21 May 2021). "టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి". www.andhrajyothy.com. Archived from the original on 21 May 2021. Retrieved 21 May 2021.
  2. Eenadu (11 December 2023). "టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
  3. Andhrajyothy (11 December 2023). "టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
  4. Namasthe Telangana, Home > జిల్లాలు (19 May 2021). "పాలమూరు వాసులకు అరుదైన గౌరవం". Namasthe Telangana. Archived from the original on 21 May 2021. Retrieved 21 May 2021.
  5. Eenadu, ప్రధానాంశాలు (20 May 2021). "టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి". EENADU. Archived from the original on 20 May 2021. Retrieved 20 May 2021.
  6. NTV-Telugu News (19 May 2021). "తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను నియమించిన కేసీఆర్". NTV-Telugu News. Archived from the original on 20 May 2021. Retrieved 20 May 2021.
  7. The New Indian Express (20 May 2021). "Telangana government appoints Janardhan Reddy as TSPSC chief". The New Indian Express. Archived from the original on 20 May 2021. Retrieved 20 May 2021.
  8. Eenadu (20 May 2021). "టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి". Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
  9. Eenadu (11 January 2024). "టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం". Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.