బి. మనోహర్ రెడ్డి
బుయ్యని మనోహర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి తాండూర్ ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]
బుయ్యని మనోహర్‌రెడ్డి | |||
పదవీ కాలం 2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం | |||
ముందు | పైలెట్ రోహిత్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | తాండూర్ | ||
డీసీసీబీ చైర్మన్
| |||
పదవీ కాలం 2020 - 2023 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1965 జూన్ 05 తిర్మలాపూర్, కులకచర్ల మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | బాలకృష్ణా రెడ్డి, సత్తమ్మ | ||
జీవిత భాగస్వామి | అరుణ | ||
సంతానం | శివకుమార్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి | ||
నివాసం | హైదరాబాదు, భారతదేశం | ||
మతం | హిందూ |
జననం, విద్యాభాస్యం
మార్చుబి. మనోహర్ రెడ్డి 1965 జూన్ 05న తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లా ,కులకచర్ల మండలం, తిర్మలాపూర్ గ్రామంలో బుయ్యని బాలకృష్ణా రెడ్డి, సత్తమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 10వ తరగతి వరకు చదువుకున్నాడు.[3]
రాజకీయ జీవితం
మార్చుబి. మనోహర్ రెడ్డి 1987లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995లో పరిగి నియోజకవర్గ సమన కమిటీసభ్యుడిగా, 1996లో రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ డైరక్టర్‌గా, 2006లో కుల్కచర్ల మండల జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడు. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఆ తరువాత వివిధ హోదాల్లో పని చేసి 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పరిగి ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు. ఆయన ఆ తరువాత 2020లో కుల్కచర్ల పీఏసీఎస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవ ఎన్నికై, ఆ తరువాత 2020 ఫిబ్రవరి 29న రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[4]
బి. మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి 2023 అక్టోబర్ 5న రాజీనామా చేసి[5], అక్టోబర్ 6న కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనను అక్టోబర్ 28న 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాండూర్ కాంగ్రెస్ నుండి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డిపై 6583 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[6]
వ్యాపారాలు
మార్చుబి. మనోహర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, బీఎంఆర్ సర్త కన్వెన్షన్[7], ప్రైవేట్ హాస్పిటల్స్ వివిధ వ్యాపారాలు, బీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.[8]
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Eenadu (28 October 2023). "తొలగిన ఉత్కంఠ". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Sakshi (28 October 2023). "బీఎమ్మార్‌కే." Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ 10TV Telugu (29 February 2020). "తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, వైఎస్ చైర్మన్లు వీరే" (in Telugu). Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (6 October 2023). "బీఆర్‌ఎస్‌కు డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి గుడ్ బై!". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ "BMR Sartha Conventions". 2023. Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ Eenadu (12 February 2023). "ఫౌండేషన్ నుంచి నిరంతర సహకారం: డీసీసీబీ ఛైర్మన్". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.