బీజాపూర్ జిల్లా (ఛత్తీస్‌గఢ్)

చత్తిస్గఢ్ లోని జిల్లా

బీజపూర్ జిల్లా (హింది: बीजापुर जिला) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో ఒకటి.[1] 2007 మే 11న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రూపొందించబడిన రెండు జిల్లాలలో ఇది ఒకటి. రాష్ట్రంలో అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాలలో బీజపూర్ జిల్లా ద్వితీయస్థానంలో ఉంది. ప్రధమస్థానంలో నారాయణపూర్ జిల్లా ఉంది. 2011 గణాంకాల ఆధారంగా బీజ్పూర్ జిల్లా రాష్ట్రంలో అత్యల్ప అక్షరాశ్యత కలిగిన జిల్లాలలో ద్వితీయస్థానంలో (41.58%, ) ఉందని అంచనావేయబడింది. ప్రధమస్థానంలో అలీరాజ్‌పూర్ జిల్లా ఉంది.[2]

బీజాపూర్ జిల్లా
बीजापुर जिला
ఛత్తీస్‌గఢ్ పటంలో బీజాపూర్ జిల్లా స్థానం
ఛత్తీస్‌గఢ్ పటంలో బీజాపూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
డివిజనుబస్తర్
ముఖ్య పట్టణంబీజాపూర్
మండలాలు4
విస్తీర్ణం
 • మొత్తం6,562.48 కి.మీ2 (2,533.79 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం2,55,180
 • జనసాంద్రత39/కి.మీ2 (100/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత41.58%
 • లింగ నిష్పత్తి982
ప్రధాన రహదార్లుNH-16
సగటు వార్షిక వర్షపాతం1517 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

చరిత్ర

మార్చు

దంతేవాడ జిల్లాను విభజించి బీజ్‌పూర్ జిల్లాను రూపొందించారు. జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం.[3]

భౌగోళికం

మార్చు

బీజపూర్ జిల్లా ఛత్తీస్‌గఢ్ నైరుతీ భాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో నారాయణపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో దంతేవాడ జిల్లా ఉన్నాయి. జిల్లా నైరుతీ సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో మహారాష్ట్ర ఉన్నాయి. జిల్లా దక్షిణప్రాంతంలో ఇంద్రావతి నది ప్రవహిస్తూ ఉంది. జిల్లావైశాల్యం 6555 చ.కి.మీ. ఉంది. [4] జిల్లాలో 741 గ్రామాలు ఉన్నాయి. [5]

అభయారణ్యం

మార్చు
  • ఇంద్రావతి అభయారణ్యం.

నైసర్గికం

మార్చు

జిల్లాలో అత్యధికప్రాంతాన్ని కొండలు ఆక్రమించుకుని ఉన్నాయి. జిల్లాలో అత్యంత ఎత్తైన శిఖరం ఇంద్రావతీ నదీతీరంలో ఉన్న " బుల్లాక్స్ హంప్ "

ప్రయాణసౌకర్యాలు

మార్చు

జిల్లారాజధాని బీజపూర్ నగరం మీదుగా జాతీయరహదారి - 16 పయనిస్తుంది. ఇది జిల్లాను తూర్పున జగదల్‌పూర్, పశ్చిమంలో మహారాష్ట్ర మీదుగా పయనించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన నిజామాబాద్ జిల్లాలను అనుసంధానిస్తుంది. రహదారి -16 భోపాల్‌పట్నం వద్ద బీజపూర్‌ను జాతీయరహదారి -202 తో అనుసంధానిస్తుంది. ఇక్కడ నుండి సులువుగా వరంగల్, హైదరాబాదు చేరుకోవచ్చు.

వృక్షలాలం, జంతుజాలం

మార్చు

జిల్లా అరణ్యసంపదతో అలరారుతూ ఉంది. జిల్లాలో అరణ్యాలు మిశ్రిత వనాలు కలిగిన " డ్రై రీజియన్ " వర్గీకరించబడింది. ఇక్కడి అరణ్యంలోధవ్రా, భిర్రా, ర్హోని, చర్, అయోనియా, హర్రా, హరియా, ఇతర చెట్లు ఉన్నాయి.

రాతిమయ ప్రాంతంలో చెట్లు రూపరహితంగా ఉన్నాయి. సాల, హంగు, ఖైర్, హర్రా, పలాస్, సెసాం, ఇతర చెట్లు ఉన్నాయి. జిల్లా ఉత్తరభాగంలో టేకు, సాల, సిర్సా, బీజసాల్, కుసుం, పలాస్, మహుయా, తెండు, హర్రా, అయోన్లా, సాజా, కౌహా (మద్ది), సాలై, చార్, ఇతరాలు ఉన్నాయి.

గ్రామీణప్రాంతాలలో ఉన్న సాధారణచెట్లు ఇక్కడ వివరించబడలేదు. తాటిచెట్లు జిల్లా ప్రజల ఆర్ధికరంగాన్ని అధికంగా ప్రభావితం చేస్తుంది. పాల్మిరా తాటి (ప్రాంతీయంగా తార్ అంటారు) జిల్లా నైరుతీ భాగంలో అధికంగా కనిపిస్తుంటాయి.తరువాత స్థానాన్ని సల్ఫీ చెట్లు వహిస్తున్నాయి. తాటిచెట్లలా కాక సల్ఫీ చెట్లు నీడ అధికంగా కలిగిన కొండచరియలలో ఎగుడు దిగుడు ప్రాంతాలలో పెరుగుతుంటాయి. ఇవి జిల్లా మధ్యభాగంలో అధికంగా ఉన్నాయి.సల్ఫీ చెట్ల నుండి రుచికరమైన జూస్ తయారౌతూ ఉంది.అడవి ఖర్జూరం, అకౌలీస్ (ప్రాంతీయంగా చింద్, బుటా చింద్ అంటారు). దీనిని కొండతెగల ప్రజలు ఆహారంలో వినియోగిస్తుంటారు.

జిల్లాలో పులులు, చిరుతలు అధికంగా ఉన్నాయి. చిరుతలు మనుషులను చంపుతూ మానవభక్షకులుగా మారాయి. చెట్లు క్షీణించడం అరణ్యంలో సహజంగా లభించే ఆహారం అందకపోవడం, పశు సంపద మరుగు కావడం ఇందుకు ప్రధాన కారణంగా మారాయి.

ప్రయాణ వసతులు

మార్చు

జిల్లా సమీపంలోని విమాశ్రయం రాయపూర్ వద్ద ఉంది. సమీపంలోని రైల్వే స్టేషన్ దంతవాడ లో ఉంది. రహదారి మార్గం ద్వారా బీజపూర్ దంతేవాడ, రాయపూర్, విశాఖపట్నంతో అనుసంధానించబడి ఉంది. జిల్లాకేంద్రం బీజపూర్ దంతేవాడకు దక్షిణంలో దాదాపు 90 కి.మీ దూరంలో ఉంది.

గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 255,180,[6]
ఇది దాదాపు. వనౌతు దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 581వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 39 [6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం.

8.76%.[6]

స్త్రీ పురుష నిష్పత్తి. 982:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాశ్యత శాతం. 41.58%.[6]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

మూలాలు

మార్చు
  1. "Chhattisgarh carves out nine more districts". The Times Of India. 2012-01-01. Archived from the original on 2014-11-16. Retrieved 2014-07-20.
  2. "Bijapur District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-10-11.
  3. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  4. Srivastava, Dayawanti (2010). India 2010, A Reference Annual (PDF). New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of Indiaand. p. 1122. ISBN 978-81-230-1617-7. Archived from the original (PDF) on 2010-12-29. Retrieved 2014-07-20.
  5. "2 new districts formed in Chhattisgarh". April 20, 2010.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Vanuatu 224,564 July 2011 est.

బయటి లింకులు

మార్చు
  • [1] List of places in Bijapur