బీరేందర్ సింగ్
సిహెచ్. బీరేందర్ సింగ్ (జననం 25 మార్చి 1946) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి 2016 వరకు నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, పారిశుధ్యం & త్రాగునీటి మంత్రిగా, 2016 నుండి 2019 వరకు కేంద్ర ఉక్కు మంత్రిగా పని చేశాడు.[2]
బీరేందర్ సింగ్ | |||
| |||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2 ఆగష్టు 2016 – 20 జనవరి 2020 | |||
నియోజకవర్గం | హర్యానా | ||
---|---|---|---|
పదవీ కాలం 29 నవంబర్ 2014 – 1 ఆగష్టు 2016 | |||
నియోజకవర్గం | హర్యానా | ||
పదవీ కాలం 2 ఆగష్టు 2010 – 28 ఆగష్టు 2014 | |||
నియోజకవర్గం | హర్యానా | ||
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 5 జులై 2016 – 14 ఏప్రిల్ 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | నరేంద్ర సింగ్ తోమార్ | ||
తరువాత | ధర్మేంద్ర ప్రధాన్ | ||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | నితిన్ గడ్కరీ | ||
తరువాత | నరేంద్ర సింగ్ తోమార్ | ||
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | నితిన్ గడ్కరీ | ||
తరువాత | నరేంద్ర సింగ్ తోమార్ | ||
మంచినీటి శాఖ & పారిశుధ్యం శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | నితిన్ గడ్కరీ | ||
తరువాత | రమేష్ జిగజినాగి, నరేంద్ర సింగ్ తోమార్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1984 – 1989 | |||
ముందు | మణి రామ్ బాగ్రి | ||
తరువాత | జై ప్రకాష్ | ||
నియోజకవర్గం | హిసార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రోహతక్, పంజాబ్ | 1946 మార్చి 25||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ (1972–2014) (2024[1]– ) | ||
ఇతర రాజకీయ పార్టీలు | బీజేపీ (2014–2024) | ||
జీవిత భాగస్వామి | ప్రేమ్లతా సింగ్ | ||
సంతానం | బ్రిజేంద్ర సింగ్, సహా 2 |
రాజకీయ జీవితం
మార్చుబీరేందర్ సింగ్ ఉచానా శాసనసభ నియోజకవర్గం నుండి (1977–82, 1982–84, 1991–96, 1996–2000, 2005–09) ఐదుసార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు. ఆయన హర్యానాలో ప్రభుత్వంలో 1982 నుండి 1984 వరకు సహకార & పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రిగా, 1991 నుండి 1992 వరకు రెవెన్యూ & ప్రణాళిక శాఖ మంత్రిగా, 2005 నుండి 2009 వరకు ఆర్థిక, కార్మిక & ఉపాధి శాఖ మంత్రిగా, 2007 నుండి 2009 వరకు ఎక్సైజ్ & పన్నుల శాఖ మంత్రిగా పని చేశాడు.
బీరేందర్ సింగ్ 1984లో హిసార్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంటు అంచనాల కమిటీ (1984-86), కాన్సులేటివ్ కమిటీ ఆన్ డిఫెన్స్ (1986-88), కన్సల్టేటివ్ కమిటీ ఆన్ పవర్ (1988-89)లో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన 2010లో హర్యానా కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నికై సెప్టెంబర్ 2013 నుండి ఏప్రిల్ 2014 వరకు మానవ వనరులు, మహిళలు & శిశు అభివృద్ధి, యువజన & క్రీడల మంత్రిత్వ శాఖపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు.
బీరేందర్ సింగ్ 28 ఆగస్టు 2014న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి 29 ఆగస్టు 2014న భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత తిరిగి రాజ్యసభకు ఎన్నికై నవంబర్ 2014లో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, త్రాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు. ఆయన జూలై 2016లో మూడవసారి రాజ్యసభకు తిరిగి ఎన్నికై నరేంద్ర మోడీ రెండవ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉక్కు శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.
మూలాలు
మార్చు- ↑ The Hindu (9 April 2024). "Ex-Minister Chaudhary Birender Singh returns to Congress after 10 years with BJP" (in Indian English). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
- ↑ "Haryana abuzz after Birender Singh's name dropped from Union Cabinet | Chandigarh News". The Times of India. Archived from the original on 2013-06-30.