బుర్రా మధుసూదన్ యాదవ్
బుర్రా మధుసూదన్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో కనిగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
బుర్రా మధుసూదన్ యాదవ్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - 2024 | |||
ముందు | కదిరి బాబూరావు | ||
---|---|---|---|
తరువాత | ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి | ||
నియోజకవర్గం | కనిగిరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 15 మే 1972 శివపురం,టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | బి.చినపేరయ్య, లక్ష్మమ్మ | ||
జీవిత భాగస్వామి | లక్ష్మి | ||
సంతానం | అమృత భార్గవి, వెంకటసాయి, లక్ష్మీనారాయణ | ||
నివాసం | కనిగిరి |
జననం, విద్యాభాస్యం
మార్చుబుర్రా మధుసూదన్ యాదవ్ 15 మే 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, శివపురం గ్రామంలో బి.చినపేరయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదివాడు.[1]
రాజకీయ జీవితం
మార్చుబుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా 2013లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ వెఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావు చేతిలో 7107 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బుర్రా మధుసూదన్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వెఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావు పై 40903 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 15 సెప్టెంబర్ 2021న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యునిగా నియమితుడయ్యాడు.[4][5]
బుర్రా మధుసూదన్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కందుకూరు నుండి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు చేతిలో 18558 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]
మూలాలు
మార్చు- ↑ Sakshi (18 March 2019). "ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు". Archived from the original on 16 September 2021. Retrieved 17 September 2021.
- ↑ iDreamPost (8 June 2021). "ఎమ్మెల్యే బుర్రా.. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర – ఇద్దరూ ఇద్దరే" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ Sakshi (10 April 2019). "దీర్ఘకాలిక సమస్యలకు చెక్!". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ TV9 Telugu (15 September 2021). "25 మందితో టీటీడీ పాలక మండలి.. తుది జాబితా ఖరారు చేసిన ఏపీ సర్కార్". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV (16 September 2021). "తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే | List of members of the new governing body of Tirumala" (in telugu). Archived from the original on 16 September 2021. Retrieved 4 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kandukur". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.