బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం

హైదరాబాదు విమోచనోద్యమం తర్వతా సైనిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత 1951 హైదరాబాదు రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితంగా, బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తొలి ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఈ మంత్రివర్గం 1952 నుండి 1956 నవంబరు 1న హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్రరాష్ట్రంతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేదాకా పనిచేసింది. హైదరాబాదు రాష్ట్రంలో తెలుగు మాట్లాడే తెలంగాణా ప్రాంతంతో పాటు, మరాఠీ, కన్నడ మాట్లాడే ప్రాంతాలు కూడా కలిసి ఉండేవి. ఈ పరిస్థితిని ప్రతిఫలిస్తూ మంత్రివర్గంలో అనేకమంది మరాఠ్వాడా, కన్నడ ప్రాంతం నుండి వచ్చిన నాయకులకు ప్రాతినిధ్యం లభించింది.

బూర్గుల రామకృష్ణారావు

మంత్రివర్గం

మార్చు
  1. బూర్గుల రామకృష్ణారావు - ముఖ్యమంత్రి[1]
  2. దిగంబరరావు బిందూ - హోం శాఖ
  3. కె.వి.రంగారెడ్డి - ఎక్సైజు శాఖ
  4. వినాయకరావు కొరాట్కర్ - వాణిజ్య, పారిశ్రామిక శాఖలు
  5. జి.ఎస్.మేల్కోటే - ఆర్థిక శాఖ
  6. మెహదీ నవాజ్ జంగ్ - ప్రజాపనుల శాఖ
  7. ఫూల్‌చంద్ గాంధీ - ప్రజారోగ్య, విద్యా శాఖలు
  8. మర్రి చెన్నారెడ్డి - వ్యవసాయ, సరఫరా శాఖలు
  9. అన్నారావు గణముఖి - స్థానిక స్వయంపాలనా శాఖ
  10. జగన్నాథరావు చందర్కి - న్యాయ, దేవాదాయ శాఖలు
  11. వల్లూరి బసవరాజు - కార్మిక, పునరావాస శాఖలు
  12. శంకర్ దేవ్ - సాంఘిక సంక్షేమ శాఖ
  13. దేవీసింగ్ చౌహాన్—గ్రామీణ పునర్నిర్మాణ శాఖ
  14. గోపాలరావు ఎక్బోటే - విద్యా శాఖ
  15. సంగం లక్ష్మీ బాయమ్మ - డిప్యూటీ విద్యాశాఖ

మూలాలు

మార్చు
  1. Hyderabad Legislative Assembly Debates: Volume III No.1 (PDF). Hyderabad: Government Press. 21 Nov 1952. p. 1. Retrieved 25 December 2014.