బెంగళూరు సిటీ - ఎర్నాకుళం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

బెంగుళూరు సిటీ - ఎర్నాకుళం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది బెంగుళూరు రైల్వే స్టేషను, ఎర్నాకుళం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]

బెంగళూరు సిటీ - ఎర్నాకుళం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
Bangalore City - Ernakulam Intercity Express
సారాంశం
రైలు వర్గంఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
స్థానికతకర్నాటక, తమిళనాడు, కేరళ
తొలి సేవబుధవారం, ఏప్రిల్ 15, 1998
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే జోన్
మార్గం
మొదలుఎర్నాకులం జంక్షన్
ఆగే స్టేషనులు12 హాల్టులు (విరామములు)
గమ్యంబెంగుళూర్ సిటీ రైల్వే స్టేషన్
ప్రయాణ దూరం587 కి.మీ. (365 మై.)
సగటు ప్రయాణ సమయం10గం. 40ని.లు
రైలు నడిచే విధంప్రతిరోజు- ప్రతి మార్గం
రైలు సంఖ్య(లు)12677/12678
సదుపాయాలు
శ్రేణులునిబంధనలు లేని జనరల్, రెండవ తరగతి సిట్టింగ్, ఎసి చైర్ కార్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలుఉంది
చూడదగ్గ సదుపాయాలుకిటికీలు
ఇతర సదుపాయాలుప్యాంట్రీ కార్ క్యాటరింగ్
సాంకేతికత
రోలింగ్ స్టాక్1
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం55 km/h (34 mph) హాల్టులతో కలిపి సరాసరి వేగం

చరిత్ర

మార్చు

కోయంబత్తూరు, బెంగుళూరు మధ్య ఒక సూపర్‌ఫాస్ట్ రైలును 1997-98 సంవత్సరం రైల్వే బడ్జెట్లో పరిచయం చేసేందుకు ఒక ప్రణాళిక ప్రతిపాదించారు.[3] 1998 ఏప్రిల్ 15 న, రైలు నంబరు: 2677 బెంగుళూరు - కోయంబత్తూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంచించారు. తదుపరి, ఈ రైలు యొక్క తాత్కాలిక సేవలు తర్వాత 2008 సంవత్సరంలో కొత్త రైలు నంబరు: 12677 సంఖ్య మార్పుతో పాటుగా ఇది ఎర్నాకుళం వరకు పొడిగించబడింది.[4]

రైలు సమాచారం

మార్చు

ఈ రైలు ఎగువ, దిగువ ప్రతి మార్గం రోజువారీ నడుస్తుంది.

  • రైలు సంఖ్య: 12677 (ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ) 06:15 గంటలకు బెంగుళూర్ సిటీ జంక్షన్ లో బయలుదేరి, 16:55 గంటలకు ఎర్నాకుళం జంక్షన్ చేరుతుంది.
  • రైలు సంఖ్య: 12678 (బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ ) 09:10 గంటలకు ఎర్నాకుళం జంక్షన్ నుండి బయలుదేరడం, 19:50 గంటలకు బెంగుళూర్ సిటీ జంక్షన్ చేరుకుంటుంది.

ఇది ప్రతి ప్రయాణ మార్గము దిశలో 587 కిలోమీటర్ల (365 మైళ్ళు) దూరం ప్రయాణిస్తుంది, ప్రయాణం వ్యవధి సుమారు 10 గంటల, 40 నిమిషాలు. ఈ రైలు రేక్ సాధారణంగా మొత్తం 21 కోచ్‌లు ఉంటాయి. దీనిలో 4 సాధారణ బోగీలు, 11 రెండవ తరగతి బోగీలు, 2 ఎసి చైర్ కార్ కోచ్‌లు, ఒక పాంట్రీ కారు, ఒక హై కెపాసిటీ పార్సెల్ వాన్, 2 ఎస్ఎల్ఆర్ కార్లు కలిగి ఉంటాయి.

జోను , డివిజను

మార్చు

ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు సంఖ్య : రైలు నంబరు: 12677, తరచుదనం (ఫ్రీక్వెన్సీ) : ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది. విరామములు : 12, ప్రయాణ సమయము : సుమారుగా గం. 10.40 ని.లు, బయలుదేరు సమయము : గం. 10.15 ని.లు., చేరుకొను సమయము : గం. 13.30 ని.లు + 2 రాత్రులు, దూరము : సుమారుగా 585 కి.మీ., వేగము : సుమారుగా 54 కి.మీ./గంట, తిరుగు ప్రయాణము రైలు సంఖ్య : రైలు నంబరు: 12678

రేక్ / కోచ్ కంపోజిషన్

మార్చు
లోకో ఎస్‌ఎల్‌ఆర్ యుఆర్ యుఆర్ డి1 డి2 డి3 డి4 డి5 డి6 డి7 పిసి డి8 డి9 డి10 డి11 సి1 సి2 యుఆర్ యుఆర్ ఎస్‌ఎల్‌ఆర్ హెచ్‌సిపివి

ఎస్‌ఎల్‌ఆర్ - సిట్టింగ్ కం లగేజీ రేక్

యుఆర్ - అన్‌రిజర్వుడు

డి - సెకండ్ సిట్టింగ్

సి - ఎసి చైర్ కార్

పిసి - పాంట్రీ కార్

హెచ్‌సిపివి - హై కెపాసిటీ పార్సిల్ వ్యాన్

షెడ్యూల్

మార్చు

నిష్క్రమణ , రాక

మార్చు
స్టేషన్ కోడ్ స్టేషన్ పేరు బయలుదేరే
సమయం
చేరుకునే
సమయం
దూరం రోజు తరచుదనం
SBC బెంగుళూర్ సిటీ జంక్షన్ 06:15 - 0 1 ప్రతిరోజు
ERS ఎర్నాకుళం జంక్షన్ - 16:55 587 కి.మీ. (365 మైళ్ళు) 1 -
ERS ఎర్నాకుళం జంక్షన్ 09:10 0 1 ప్రతిరోజు
SBC బెంగుళూర్ సిటీ జంక్షన్ 19:50 587 కి.మీ. (365 మైళ్ళు) 1 -

రైలు సంఖ్య 12677 (ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ) ప్రయాణ మార్గము

మార్చు
క్రమ
సంఖ్య
స్టేషన్
కోడ్
స్టేషన్
పేరు
రాక
సమయం
బయలుదేరు
సమయం
విరామములు
(నిమిషములు)
పూర్తయిన
దూరం
1 SBC బెంగుళూర్ సిటీ జంక్షన్ ప్రారంభం 06:15 0
2 BNC బెంగుళూర్ కంటోన్మెంట్ 06:25 06:27 02 5
3 CRLM కార్మెలారం 06:46 06:47 01 25
4 HSRA హోసూర్ 07:18 07:20 02 60
5 DPJ ధర్మపురి 08:38 08:40 02 152
6 SA సేలం జంక్షన్ 10:02 10:05 03 218
7 SGE శంకరిదుర్గ్ 10:43 10:45 02 260
8 ED ఈరోడ్ జంక్షన్ 11:20 11:30 10 281
9 TUP తిరుప్పూర్ 12:13 12:15 02 331
10 CBE కోయంబత్తూర్ జంక్షన్ 13:07 13:10 03 381
11 PGT పాలక్కాడ్ 14:18 14:20 02 436
12 TCR త్రిసూర్ 15:22 15:24 02 513
13 AWY అలూవా 16:03 16:05 02 568
14 ERS ఎర్నాకుళం జంక్షన్ 16:55 గమ్యస్థానం - 587

రైలు ప్రమాదం

మార్చు

13 ఫిబ్రవరి, 2015 న ఈ రైలు బెంగుళూరు నుండి ఎర్నాకుళం ప్రయాణంలో వెళ్ళుతుండగా పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు, 150 మందికి గాయాలయినాయి.[5][6][7] భారతీయ రైల్వేల యొక్క తుది నివేదిక ప్రకారం కేవలం 42 మందికి గాయాలయినట్లు, 9 మంది మరణించినట్లు పేర్కొన బడింది.[8]

మూలాలు

మార్చు
  1. http://indiarailinfo.com/train/bengaluru-city-ernakulam-intercity-express-12677-sbc-to-ers/709/136/52
  2. http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  3. "Indian Railway Budget 1997-1998". Retrieved 14 February 2015.
  4. "Southern Railways revises train timings". The Hindu. 2 July 2008. Retrieved 14 February 2015.
  5. "10 dead, over 150 injured as Ernakulam-bound Inter City Express derails near Bengaluru". Yahoo India. No. 13 February 2015. Yahoo India. PTI. 13 February 2015. Retrieved 13 February 2015.
  6. "5 feared dead as Bengaluru-Ernakulam train derails". The Hindu. No. 13 February 2015. The Hindu. 13 February 2015. Retrieved 13 February 2015.
  7. "2 Killed, Several Injured as Train Derails Near Tamil Nadu's Hosur". NDTV Convergence Limited. No. 13 February 2015. NDTV Convergence Limited. Press Trust of India. 13 February 2015. Retrieved 13 February 2015.
  8. Lalitha, S (14 January 2016). "Engineer, Coach Factory, Driver Chargesheeted for Anekal Train Mishap". The New Indian Express. Express Network Private Limited. Archived from the original on 14 June 2016. Retrieved 14 June 2016.

బయటి లింకులు

మార్చు
  1. 12677/Bangalore City-Ernakulam Intercity Express
  2. 12678/Ernakulam-Bangalore City InterCity Express