బెందాళం కృష్ణారావు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ జర్నలిస్టు, రచయత.[1]

బెందాళం క్రిష్ణారావు
Bendalam krishnarao-writer.jpg
బెందాళం క్రిష్ణారావు
జననంబెందాళం క్రిష్ణారావు
సెప్టెంబరు 17 . 1971
శ్రీకాకుళం జిల్లా లోని కవిటి
నివాస ప్రాంతంశ్రీకాకుళం జిల్లా లోని కవిటి
ప్రసిద్ధిప్రముఖ జర్నలిస్టు, రచయత.

బాల్య విశేషాలుసవరించు

ఈయన శ్రీకాకుళం జిల్లా లోని కవిటి గ్రామంలో సెప్టెంబరు 17 . 1971 న జన్మించారు. ఇంటర్మీడియట్ వరకూ కవిటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత విజయనగరం మహారాజా కళాశాలలో డిగ్రీ చేసారు. "ప్రసారమాధ్యమాలకు తెలుగులో రాయడం" పై పీజీ డిప్లమో చేసారు విద్యార్థి దశ నుంచే వివిధ పత్రికలకు రచనలు చేయడం ప్రారంభించారు. పత్రికారంగంపై ఆసక్తి పెంచుకుని 1992లో గ్రామీణ విలేఖరిగా పాత్రికేయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2016 జూన్1 నుంచి 2020 ఏప్రిల్ 30 వరకూ ప్రజాశక్తిలో ఫీచర్స్ రైటర్ / సీనియర్ జర్నలిస్ట్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం స్వతంత్ర పాత్రికేయునిగా కొనసాగుతున్నారు.

జర్నలిస్టు, రచయితగాసవరించు

"ఆంధ్రభూమి" దిన పత్రికలో పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించిన కృష్ణారావు గత పాతికేళ్ళకు పైగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. "ఉదయం, వార్త, ఆంధ్రప్రభ, ఏబిఎన్-ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి, సూర్య " తదిర పత్రికలు, న్యూస్ చానల్లో కూడా స్టాఫ్ రిపోర్టర్ గా, బ్యూరో ఇన్చార్జ్ గా పనిచేసారు. ఎక్కడా రాజీపడని వ్యక్తిత్వంతో పాత్రికేయ ప్రస్థానంలో ముందుకు సాగుతున్నారు. సహచర జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి 2006లో "వార్తలు ఎలా రాయాలి?" అనే రిఫరెన్స్ పుస్తకాన్ని రాసారు. ఇది పలువురి జర్నలిస్టులకు మార్గదర్శకంగా నిలచింది. ఈ రంగంలో వచ్చిన ప్రామాణికమైన పుస్తకాలలో ముందువరసలో ఉంది. మరోవైపు పీజీ విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు. 2016 లో ...ధమ్మపదం, 2017లో ..మీరే జర్నలిస్ట్, ... ప్రవక్త (ఖలీల్ జిబ్రాన్ ది ప్రొఫెట్ అనువాదం). ... రవీంద్రుని గీతాంజలి, .వెన్నెల వెలుగు - మొపాసా కథలు (2018), సుభాష్ చంద్రబోస్-సమరశీల జీవితం (2020)....పుస్తకాలు రాశారు. వివిధ అంశాలపై పలు పుస్తకాలు రాసే పనిలో ఉన్నారు. బ్లాగులు కూడా నిర్వహిస్తున్నారు. 2016 జూన్1 నుంచి 2020 ఏప్రిల్ 30 వరకూ ప్రజాశక్తిలో ఫీచర్స్ రైటర్ / సీనియర్ జర్నలిస్ట్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం స్వతంత్ర పాత్రికేయునిగా కొనసాగుతున్నారు.

పుస్తకాలుసవరించు

మూలాలుసవరించు

5. http://www.namaste.in/te/blog/58983f4cf85a567c24cf8d96/5898453b419df07c225e6dd2/detail/5a1500e4c27d00ca1a83cd14

6 http://www.anandbooks.com/Ravindruni-Geetanjali-Telugu-Book-By-Bendalam-Krishnarao

7. http://www.namaste.in/te/literature/571779ee1cbfb07f7a4b67e4/57dcd60b4900cd7c1d74806d/detail/Youre-a-journalist-the-strongName-p-of

8 http://www.prajasakti.com/Article/Kotha_Pustakalu/2080377

9. http://www.prajasakti.com/Article/Kotha_Pustakalu/2205669