బెట్ ద్వారక

గుజరాత్ లో ఒక దీవి

బెట్ ద్వారక లేక శంఖోదర్ గుజరాత్‌లో ఓఖా పట్టణం నుండి 3 కి.మీ. దూరంలో నున్న ఒక దీవి. కచ్ సింధుశాఖలో ఉన్న ఈ దీవి 13 కి.మీ. పొడవు, 4 కి.మీ సగటు వెడల్పూ కలిగి ఉంది. ఇది ద్వారక పట్టణం నుండి 30 కి.మీ ఉత్తరంగా ఉంది.[1][2]

బెట్ ద్వారక
island
బెట్ ద్వారక మ్యాపు
బెట్ ద్వారక మ్యాపు
దేశంభారతదేశం
రాష్ట్రంగుజరాత్
జిల్లాదేవ్‌భూమి ద్వారకా
Languages
 • OfficialGujarati, Hindi
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationGJ-xx

చరిత్ర

మార్చు
 
Bet Dwarka marked with other sites of Indus Valley Civilization, Late Phase (1900-1300 BCE)

బెట్ ద్వారక మహాభారతం, స్కాందపురాణాల్లో చెప్పిన ద్వారకా నగరంలోని భాగంగా భావిస్తారు. గుజరాతీ పండితుడు ఉమాశంకర్ జోషి, మహాభారతం సభాపర్వంలో ప్రస్తావించిన అంతర్ద్వీపం అంటే బెట్ ద్వారకయే అని చెప్పాడు. ద్వారకకు చెందిన యాదవులు పడవలపై అక్కడికి వెళ్ళేవారు. ఈ ద్వీపంలో విస్తారంగా దొరికే శంఖాల కారణంగా దీనికి శంఖోదర్ అనే పేరు వచ్చింది. సముద్ర అంతర్భాగంలో దొరికిన పురాతత్వ అవశేషాలను బట్టి అక్కడ అంతిమ హరప్పా కాలం నాటిది కానీ తదనంతర కాలంనాటిది కానీ అయిన నివాస స్థావరం ఉండేదని తెలుస్తోంది. దాన్ని మౌర్య సామ్రాజ్యం నాటిదిగా చెప్పగలిగే బలమైన ఆధారాలున్నాయి. అది ఓఖా మండలానికి లేదా కుశద్వీపానికి చెందినది. సా.శ. 574 నాటి సింహాదిత్యుని రాగి శాసనంలో ద్వారక ప్రసక్తి ఉంది. అతడు వల్లభికి మంత్రి, ద్వారక రాజైన వరాహదాసు కుమారుడు.[1]

 
Bet Dwarka under Baroda state, Amreli division, 1909

ఈ దీవి బరోడా గయక్వాడ్ పాలనలో ఉండేది. 1857 నాటి మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో వఘేర్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. తిరిగి 1859 లో గయక్వాడ్, బ్రిటిషు వారు, ఇతర సంస్థానాధీశులూ కలిసి ఈ ప్రాంతాన్ని వశపరచుకున్నారు.[3][4]

స్వాతంత్ర్యం తరువాత, ఈ ప్రాంతం సౌరాష్ట్ర రాష్ట్రంలో అంతర్భాగమైంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో ఇది బాంబే రాష్ట్రంలో భాగమైంది. బాంబే రాష్ట్రం నుండి గుజరాత్ వేరు పడినపుడు, ఈ ప్రాంతం గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో భాగమైంది. 2013 లో జామ్‌నగర్ జిల్లా నుండి దేవభూమి జిల్లాను ఏర్పరచినపుడు ఈ ప్రాంతం కొత్త జిల్లాలో భాగమైంది.

పురాతత్వం

మార్చు

1980 లో చేసిన పరిశోధనలలో సిద్దీ బావా పీర్ దర్గా వద్ద అంతిమ హరప్పా కాలానికి చెందిన మట్టి పాత్రలు, ఇతర వస్తువులూ లభించాయి. 1982 లో 580 మీటర్ల పొడవైన రక్షణ కుడ్యాన్ని కనుగొన్నారు. అది సా.పూ. 1500 నాటిది. అది ఉప్పెన కారణంగా దెబ్బతిని మునిగిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అక్కడ దొరికిన వస్తువులలో అంతిమ హరప్పన్ ముద్ర, లిపి లిఖించి ఉన్న ఒక జాడీ, రాగి పనివారి మూస, రాగి చేపల గాలం ఉన్నాయి. తవ్వకాల్లో దొరికిన ముక్కలైన పడవలు, రాతి లంగర్లు రోమన్లతో వాణిజ్య సంబంధాలుండేవని సూచిస్తున్నాయి. దీవిలో ఉన్న దేవాలయాలు 18 వ శతాబ్దాంతంలో నిర్మించారు.[1][2][5][6]

ఆరాధ్య స్థలాలు

మార్చు

ద్వారకాధీశ, కేశవరాయ్‌జీ దేవాలయాలు శ్రీకృష్ణుని ఆలయాలు. హనుమాన్ దండి, వైష్ణవ్ మహాప్రభు బేఠక్‌లు ఇతర యాత్రా స్థలాలు. సిద్ద్ది బావా పీర్ దర్గా, హాజీ కిర్మాయ్ దర్గా, ఓ గురుద్వాఅరా కూడా ఇక్కడ ఉన్నాయి.

రవాణా

మార్చు

ఓఖా నుండి ఫెర్రీపై బెట్ ద్వారక చేరుకోవచ్చు. ఇక్కడ రూ 400 కోట్ల ఖర్చుతో 2 కి.మీ. పొడవైన వంతెనను కట్టాలని ప్రతిపాదించారు.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Rao, S. R.; Gaur, A. S. (July 1992). "Excavations at Bet Dwarka" (PDF). Marine Archeology. 3. Marine Archeological Centre, Goa: 42–. Retrieved 1 January 2015.
  2. 2.0 2.1 Gaur, A. S. (25 February 2004). "A unique Late Bronze Age copper fish-hook from Bet Dwarka Island, Gujarat, west coast of India: Evidence on the advanced fishing technology in ancient India" (PDF). Current Science. 86 (4). IISc: 512–514. Archived from the original (PDF) on 4 జనవరి 2015. Retrieved 1 January 2015.
  3. Ramanlal Kakalbhai Dharaiya (1970). Gujarat in 1857. Gujarat University. p. 120.
  4. "Gujarat During The Great Revolt: The Rebellion In Okhmandal". People's Democracy. October 7, 2007. Archived from the original on 16 జనవరి 2015. Retrieved 15 January 2015.
  5. Gaur, A.S.; Sundaresh; Tripati, Sila (2004). "An ancient harbour at Dwarka: Study based on the recent underwater explorations". Current Science. 86 (9). Retrieved 28 February 2014.
  6. Sullivan, S. M. (2011) Indus Script Dictionary, page viii