బెన్నీ బెహనన్ (జననం 22 ఆగస్టు 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చలకుడి లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

బెన్నీ బెహనాన్

బెన్నీ బెహనాన్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు ఇన్నోసెంట్
నియోజకవర్గం చలకుడి

వ్యక్తిగత వివరాలు

జననం (1952-08-22) 1952 ఆగస్టు 22 (వయసు 72)
వెంగోలా , ట్రావెన్‌కోర్-కొచ్చిన్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి షేర్లీ బెన్నీ
సంతానం 1 కొడుకు & 1 కూతురు
నివాసం త్రిక్కాకర
వెబ్‌సైటు [1][2]

రాజకీయ జీవితం

మార్చు

బెన్నీ బెహనాన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 1979 నుండి 1982 వరకు కేరళ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పని చేసి 17 సంవత్సరాలు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. ఆయన 1982లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పిరవం నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004లో ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి, 2011లో త్రిక్కాకర శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] బెన్నీ బెహనాన్ 2018లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కన్వీనర్‌గా నియమితుడై 27 సెప్టెంబర్ 2020 వరకు పని చేశాడు.[3]

బెన్నీ బెహనన్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చలకుడి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి ఇన్నోసెంట్‌పై 1,32,274 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2024లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి సి.రవీంద్రనాథ్ పై 63754 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

మార్చు
  1. TimelineDaily (5 April 2024). "Benny Behanan: Veteran Congress MP Vying For His Second Term From Chalakudy" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  2. "Members - Kerala Legislature". 2024. Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  3. The News Minute (27 September 2020). "Congress MP Benny Behanan quits as Kerala UDF convenor" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Chalakudy". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.