బెల్లంవారిపాలెం

బెల్లంవారిపాలెం బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బెల్లంవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
బెల్లంవారిపాలెం is located in Andhra Pradesh
బెల్లంవారిపాలెం
బెల్లంవారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°00′00″N 80°43′19″E / 16.000°N 80.722°E / 16.000; 80.722
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ

మార్చు

గాలివారి పాలెం. జంగంలంక అగ్రహారం గ్రామాలు, ఈ గ్రామ పంచాయతీలోని శివారు గ్రామాలు.

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నల్లూరి కృష్ణకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

మార్చు

శ్రీ కోదండరామాలయం

మార్చు

ఉత్సవాలు

మార్చు

ఈ గ్రామములో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఉత్సవాలను మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా 2015, మార్చి-13వ తేదీ శుక్రవారం నాడు, అమ్మవారి ప్రతిమతో యేలేటిపాలెం, వెలమావారిపాలెం గ్రామాలలో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమములో దేవాలయ కమిటీ సభ్యులు, పురోహితులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

మార్చు

కృష్ణానదిపై రైతుల కోసం నిర్మించనున్న ఆనకట్ట కోసం, వీరు సిమెంటు కర్మాగారాన్ని నిర్మించారు. లాభాపేక్ష లేకుండా, నాణ్యమైన సిమెంటు అందించి, జాతీయస్థాయిలో ప్రముఖుల ప్రశంసలు పొందిన మహోన్నత వ్యక్తి. నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మాణంలో కె.సి.పి.సిమెంటు వినియోగించారు. 1896లో ఈ అతి చిన్న గ్రామంలో జన్మించిన వీరు, పారిశ్రామిక ఆంధ్రావనికి ఆద్యులుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పారిశ్రామికంగా మనదేశం ముందుకు వెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేశారు. వ్యవసాయం మీద ఆధారపడిన మన దేశాన్ని, పారిశ్రామిక అభివృద్ధి వైపు తీసుకొని వెళ్ళడానికి ఆయన మన రాష్ట్రంలో పునాదులు వేశారు. దేశవ్యాప్తంగా అనేక పథకాలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. మన రాష్ట్రంలోనే గాకుండా, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాలలోనూ, పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినారు. ఎందరికో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు కల్పించారు.

గ్రామ విశేషాలు

మార్చు

నూతన అక్షరాస్యులకు ఈ గ్రామములోని సాక్షరభారత్ కేంద్రంలో, 2014, మార్చి-9, ఆదివారం నాడు, ఉదయం 10 గం. నుండి సాయంత్రం 5 గంటల వరకు, సాక్షర భారత్ సమన్వయకర్తలు, పరీక్షలు నిర్వహించారు.

మూలాలు

మార్చు