బేబీ 2023లో విడుదలైన తెలుగు సినిమా. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గోవర్ధన మారుతీ, ఎస్‍కేఎన్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా..నీ ప్రేమలో జీవిస్తున్నా..’ పాటను 2023 మే 16న నటి రష్మికా మందన్న విడుదల చేయగా[1], ట్రైలర్‌ను జులై 07న విడుదల చేసి[2], సినిమాను జులై 14న విడుదలైంది.[3][4]

బేబీ
దర్శకత్వంసాయి రాజేష్
రచనసాయి రాజేష్
నిర్మాతగోవర్ధన మారుతీ
ఎస్‍కేఎన్
తారాగణం
ఛాయాగ్రహణంఎం.ఎన్. బాలిరెడ్డి
కూర్పువిప్లవ్ నైషధం
సంగీతంవిజయ్‌ బుల్గానిన్‌
నిర్మాణ
సంస్థ
మాస్ మూవీ మేకర్స్
విడుదల తేదీs
14 జూలై 2023 (2023-07-14)(థియేటర్)
25 ఆగస్టు 2023 (2023-08-25)( ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

'బేబీ' సినిమా విడుదలైన తరువాత కేవలం 11 రోజుల్లో దాదాపు 70 కోట్ల కలెక్షన్స్‌ను వసూలు చేసింది.[5]  ఈ సినిమా ఆగస్ట్ 25న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[6]

నటీనటులు

మార్చు

వైషు అలియాస్ వైష్ణవి (వైష్ణవి చైతన్య) బస్తీలో ఉంటూ చిన్నప్పటి నుంచి తన ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను స్కూల్ డేస్ నుంచి ప్రేమిస్తుంటుంది. టెన్త్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆనంద్ దేవరకొండ ఆటో డ్రైవర్‌గా స్థిరపడతాడు. వైష్ణవి ఇంటర్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరడంతో కొత్త పరిచయాల వల్ల ఆమె ఆలోచనా విధానంలో మార్పులు మొదలవుతాయి. ఈ క్రమంలో తన క్లాస్మెట్ విరాజ్(విరాజ్ అశ్విన్)కు వైషు దగ్గరవుతుంది. దీంతో అనుకోని పరిస్థితుల వల్ల విరాజ్ వైష్ణవి శారీరకంగా దగ్గరవ్వాల్సి వస్తుంది. వీరిద్దరి వ్యవహారం ఆనంద్ కు తెలిసిందా ? చివరకు ఆనంద్, విరాజ్ లలో వైష్ణవి ఎవర్ని ప్రేమించింది? తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[10][11]

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: మాస్ మూవీ మేకర్స్
  • నిర్మాత: గోవర్ధన మారుతీ, ఎస్‌కెఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు) [12]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సాయి రాజేష్ [13]
  • సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌
  • సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాలిరెడ్డి
  • పాటలు: అనంత శ్రీరామ్, కళ్యాణ్ చక్రవర్తి, సురేష్ బానిశెట్టి
  • ఎడిటర్ : విప్లవ్ నైషధం
  • కో- నిర్మాత: ధీరజ్ మొగిలినేని
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సతీష్ దాసరి
  • కొరియోగ్రాఫర్ :విజయ్ పోలాకి
  • ఆర్ట్ : సురేష్ భీమిగాని

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఓ రెండు ప్రేమ మేఘాలిలా"అనంత శ్రీరామ్శ్రీరామచంద్ర5:14
2."దేవరాజా"కళ్యాణ్ చక్రవర్తిఆర్య దయాళ్5:37
3."ప్రేమిస్తున్న"సురేష్ బానిశెట్టిపి వి ఎన్ ఎస్ రోహిత్6:36
4."రిబాపప్ప"సురేష్ బానిశెట్టిశ్రీ కృష్ణ5:05
5."ఓ రెండు ప్రేమ మేఘాలిలా (రిప్రైజ్)"అనంత శ్రీరామ్శ్రీరామా చంద్ర5:08
6."చంటి పిల్లల"సురేష్ బానిశెట్టిఅనుదీప్ దేవ్5:08
7."కలకాలమే"సురేష్ బానిశెట్టిసాహితి చాగంటి3:27
మొత్తం నిడివి:36:15

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (18 May 2023). "నీ ప్రేమలో జీవిస్తున్నా". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.
  2. Zee News Telugu (7 July 2023). "బేబీ ట్రైలర్.. నరాలు మెలిపెట్టే డైలాగ్స్". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.
  3. V6 Velugu (29 June 2023). "'బేబీ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (30 June 2023). "'బేబీ' విడుదల ఖరారు". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.
  5. A. B. P. Desam (27 July 2023). "అన్నను మించిన తమ్ముడు - 11 రోజుల్లో 'అర్జున్ రెడ్డి' రికార్డులు బద్దలుకొట్టిన 'బేబీ'". Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
  6. Eenadu (20 August 2023). "ఓటీటీలో 'బేబీ' మూవీ.. స్ట్రీమింగ్‌ తేదీ ఫిక్స్‌.. వాళ్లకు స్పెషల్‌". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
  7. A. B. P. Desam (18 May 2023). "చిరునవ్వులు చిందిస్తున్న తెలుగమ్మాయి.. చుడీదార్ లో మెరిసిపోతున్న వైష్ణవి..!". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.
  8. Andhra Jyothy (12 July 2023). "టిక్‌టాక్‌ వీడియోలతో హీరోయిన్‌ అవుతావా? అన్నారు! | Will you become a heroine with Tiktok videos? Said". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
  9. Eenadu (11 July 2023). "బేబి.. ప్రత్యేకత అదే". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
  10. Sakshi (14 July 2023). "'బేబీ' మూవీ రివ్యూ". Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
  11. NTV Telugu (14 July 2023). "బేబీ రివ్యూ". Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
  12. Namasthe Telangana (7 July 2023). "అందరూ సొంత కథగా ఫీల్‌ అవుతారు". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.
  13. The Hindu (19 July 2023). "Director Sai Rajesh: 'Baby' has been a learning experience; henceforth I will be more cautious in my writing" (in Indian English). Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=బేబీ&oldid=4191071" నుండి వెలికితీశారు