బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 1
బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 1,హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. ఎల్బీనగర్ నుంచి ఒవైసీ జంక్షన్ మీదుగా నూతనంగా బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 1 ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.[1]
నిర్మాణ వివరాలు
మార్చుబైరామల్గూడ కుడివైపు ఫ్లైఓవర్‌ను 11 మీటర్ల వెడల్పుతో 780 మీటర్ల పొడవున 14 పిల్లర్స్‌తో 4 లైన్లతో స్టాటిజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) సౌజన్యంతో 26.45 కోట్ల వ్యయంతో ప్రీ కాస్ట్ విధానంలో హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్మించింది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో బైరామల్‌గూడ జంక్షన్, సాగర్ రోడ్ జంక్షన్‌ల పరిధిలో ట్రాఫిక్ తగ్గింది. బైరామల్‌గూడ కుడివైపు ఫ్లైఓవర్ నిర్మాణానికి దేశంలోనే మొదటి సారి ప్రత్యేక టెక్నాలజీని వినియోగించి నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్‌ను వల్ల ఎల్బీనగర్ నుంచి ఒవైసీ జంక్షన్‌కు, శ్రీశైలం వైపు వెళ్లే వాహనదారులకు ఇది ఉపయోగకరంగా ఉంది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఎల్బీనగర్ నుంచి బైరామల్ గూడ దారిలో 11 భవనాలను తొలగించారు.
ప్రారంభం
మార్చుబైరామల్గూడ జంక్షన్‌లో నిర్మించిన కుడివైపు ఫ్లైఓవర్‌ను 2021 ఆగస్టు 10న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించాడు. [2][3] ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేషం , స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇతర వివరాలు
మార్చు2022, మార్చి 14న బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 2 (ఎడవ వైపు) కూడా ప్రారంభించబడింది.
మూలాలు
మార్చు- ↑ V6 Velugu (10 August 2020). "బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్" (in ఇంగ్లీష్). Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Prajasakti (10 August 2021). "బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన కెటిఆర్ | Prajasakti". Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.
- ↑ Andhrajyothy (10 August 2021). "చాలా ఆనందంగా ఉంది.. మంత్రి కేటీఆర్ ట్వీట్". Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.