బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయం
బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి గ్రామంలో ఉన్న భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయం.[1] హైదరాబాద్-మెదక్ ప్రధాన మార్గంలోని బొంతపల్లి కమాన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం, హైదరాబాదు నుండి 40 కి.మీ., బాలనగర్ నుంచి 25 కి.మీ., నర్సాపూర్ నుంచి 18 కి.మీ.ల దూరంలో ఉంది. వీరభద్రస్వామి కొలువైవున్న ఈ దేవాలయంలో అద్దాల మండపం ఉండటం ఇక్కడి ప్రత్యేకత.[2]
బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు: | 17°39′20″N 78°21′45″E / 17.6556°N 78.3626°E |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | సంగారెడ్డి జిల్లా |
ప్రదేశం: | బొంతపల్లి, గుమ్మడిదల మండలం |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | వీరభద్రస్వామి |
చరిత్ర
మార్చుఈ దేవాలయానికి కాకతీయుల నాటి చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం, గతంలో ఇక్కడ చిన్న ఆలయం ఉండేది. ఒక రోజు రాత్రి ఒక కాపరి ఆలయం ముందు నుంచి వెలుతుండగా ఎవరో పిలుస్తునట్లు వినిపించి వెనకకు చూస్తే వీరభద్రస్వామిని కనిపించాడు. తనకు ఈ ఆలయ ప్రదేశం ఇష్టంలేదని, తనని వేరొక ప్రదేశానికి మార్చమి వీరభద్రస్వామి కోరగా, స్వామిని తన భుజాలపై కూర్చోబెట్టుకొని కొన్ని కిలొమీటర్లు దూరం నడిచి వెళ్ళిన తరవాత స్వామిని ప్రస్తుత ఆలయ ప్రదేశంలో ప్రతిష్ఠ చేశాడు. వెనుకకు తిరగకుండా ఇంటికి వెళ్ళాలని, ఒకవేళ వెనుకకు తిరిగితే శిల్పంగా మారిపొతావని కాపరికి చెప్పాడు. కాపరి కొంతదూరం వెళ్ళిన తరవాత వెనుకకు తిరిగిచూసిన వెంటనే శిల్పంగా మారిపొయాడు. అలా శిల్పంగా మారిన కాపరి విగ్రహం గ్రామంలో ఇప్పటికి ఉంది. కొన్నిరోజుల తరువాత పూజారికి, గ్రామ పెద్దలకు కలలో కనిపించిన స్వామి తనకు ఆ ప్రదేశంలో ఒక ఆలయం నిర్మించమని చెప్పాడు. అలా ప్రస్తుత పెద్ద దేవాలయం నిర్మించబడింది.
దేవాలయ వివరాలు
మార్చుదేవాలయంలోని వీరభద్రస్వామికి ఎదురుగా భారీగా నంది విగ్రహం, దాని పక్కనే భారీ ఎత్తున ఆలయ ధ్వజస్తంభం నిర్మితమై ఉంది. వీరభద్రస్వామి దేవాలయానికి ప్రవేశించేముందు పక్కనే వినాయకుడి దేవాలయం ఉంది. ప్రధాన ఆలయంకు సమీపంలో ఇరవై నాలుగు స్తంభాలతో మహంకాళి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ జంగాలు, దేవ తమ్ముళ్ళు కులాల వారే అర్చకులుగా ఉంటారు. అ దేవాలయం 1972 నుండి దేవాలయ శాఖ ఆధీనంలోకి వచ్చింది.
పూజలు
మార్చుఈ దేవాలయంలో ప్రతిరోజూ అభిషేకం, అర్చనలు, శ్రావణ, కార్తీక మాసాల్లో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడి భద్రకాళి వరుసగా బాలత్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలిత, మహాలక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, మహాకాళి రూపాలలో దర్శనం ఇస్తుంది. దసరా రోజున సాయంత్రం శమీ పూజ చేస్తారు.[3]
ఉత్సవాలు
మార్చుప్రతి సంవత్సరం తొమ్మిది రోజులపాటు బ్రహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడి, కల్యాణోత్సవం, రథోత్సవం జరుగుతాయి. మొదటిరోజు నందీశ్వర వాహనసేవ, ఆశ్వవాహన సేవ, రెండవరోజు హంసవాహనసేవ, మూడవరోజు బృంగీశ్వర వాహన సేవ, నాలుగవరోజు పొన్న వాహన సేవ, అగ్నిగుండాలు, 5వరోజు స్వామివారి ఎదుర్కొలు, కల్యాణం, గజవాహన సేవ, పల్లకీ సేవ నిర్వహిస్తారు. ఆరవరోజు స్వామివారి దివ్య రథోత్సవం, ఏవడరోజు నాకబలి ఉంటాయి. ఎనమిదవరోజు ఏకాంత సేవ, డోలోత్సవం, పవళింపుతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.[4]
మూలాలు
మార్చు- ↑ "బొంతపల్లి వీరభద్రుడి ఆలయం చూడచక్కని ఆధ్యాత్మిక ధామం." Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-12-04.
- ↑ "కోరమీసాల స్వామికి కొత్తందాలు". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-18. Archived from the original on 2021-12-15. Retrieved 2021-12-15.
- ↑ "నేటి నుంచి దేవి శరన్నవరాత్రోత్సవాలు.. ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశిష్టత". ETV Bharat News. Retrieved 2021-12-04.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు". andhrajyothy. Archived from the original on 2021-12-04. Retrieved 2021-12-04.