గుమ్మడిదల మండలం

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం


గుమ్మడిదల మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] ఇది పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని కొత్తగా ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  12  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. గుమ్మడిదల, ఈ మండలానికి కేంద్రం.

గుమ్మడిదల మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°41′00″N 78°22′06″E / 17.683401°N 78.368343°E / 17.683401; 78.368343
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం గుమ్మడిదల
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 98 km² (37.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 37,061
 - పురుషులు 18,873
 - స్త్రీలు 18,188
పిన్‌కోడ్ 502313

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.

మార్చు

లోగడ గుమ్మడిదల గ్రామం మెదక్ జిల్లా, మెదక్ రెవెన్యూ డివిజను పరిధిలోని జిన్నారం మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గుమ్మడిదల గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా సంగారెడ్డి జిల్లా, సంగారెడ్ది రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+11 (పన్నెండు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 98 చ.కి.మీ. కాగా, జనాభా 37,061. జనాభాలో పురుషులు 18,873 కాగా, స్త్రీల సంఖ్య 18,188. మండలంలో 9,022 గృహాలున్నాయి.[5]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. అనంతారం
  2. అన్నారం
  3. కానుకుంట
  4. కొత్తపల్లి
  5. గుమ్మడిదల
  6. దాచారం
  7. దోమడుగు
  8. నల్లపల్లి
  9. ప్యారానగర్
  10. బొంతపల్లి
  11. మంబాపూర్
  12. లక్ష్మాపూర్

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-18.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు