బొట్టు కాటుక
(బొట్టూకాటుక నుండి దారిమార్పు చెందింది)
'బొట్టు కాటుక 'తెలుగు చలన చిత్రం , శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించారు.విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాగంటి మురళి మోహన్, జయంతి, మోహన్ మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.ఈ చిత్రం1979, డిసెంబర్,21 న విడుదలైనది .
బొట్టు కాటుక (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రాజాచంద్ర |
తారాగణం | మురళీమోహన్ , జయంతి, మోహన్ |
సంగీతం | చక్రవర్తి |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- మురళీమోహన్
- నూతన్ ప్రసాద్
- శ్రీధర్
- హరిబాబు
- జయంతి
- మాధవి
- నిర్మలమ్మ
- బేబి గౌరి
- పి.ఆర్.వరలక్ష్మి
- రాజేశ్వరి
- సత్యచిత్ర
- వీరయ్య
- నరసింహం
సాంకేతిక వర్గం
మార్చు- కథ : జంధ్యాల
- పాటలు: వేటూరి, జాలాది, ఉత్పల సత్యనారాయణాచార్య, ఆరుద్ర
- సంగీతం: చక్రవర్తి
- కళ: కళాధర్
- కూర్పు: కె.సత్యం
- ఛాయాగ్రహణం: జి.కె.రాము
- నిర్మాత:మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
- దర్శకత్వం : విజయ బాపినీడు
పాటలు
మార్చు- అల్లీ బిల్లీ గారడీ - అల్లరి చూపుల చిన్నది - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- స్వాగతం స్వాగతం సుస్వాగతం సీతమ్మ చరితమే రామాయణం ఆ అమ్మ కథ మాకు పారాయణం - రచన: ఉత్పల - గానం:పి.సుశీల, ఎస్.పి.శైలజ
- తలనెప్పి అంటేనే తల్లడిల్లి పోయారు నా తలరాత తెలుసుకుంటే ఏమైపోతారు? - రచన:జాలాది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- చాటపర్రు చిన్నోడమ్మో యీడు చావతేరి ఉన్నోడమ్మో - రచన: జాలాది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- ఏమయ్యా మావయ్యా కాబొయే బావయ్యా - రచన: జాలాది - గానం: ఆనంద్, శైలజ, రమణ
- బెల్లూ బ్రేకుల్లేవు నారాయణా ఇది పరమ కంత్రీ బండి నారాయణా - జాలాది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.