ఉత్పల సత్యనారాయణాచార్య

తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

ఉత్పల సత్యనారాయణాచార్య తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. బాల సాహిత్య సృష్టికి విశేష కృషి చేశారు.

ఉత్పల సత్యనారాయణాచార్య
Utpala.jpg
ఉత్పల సత్యనారాయణాచార్య
జననం
ఉత్పల సత్యనారాయణాచార్య

(1927-07-24)1927 జూలై 24
మరణం2007 అక్టోబరు 23(2007-10-23) (వయసు 80)
ఇతర పేర్లుఉత్పల
సుపరిచితుడు/
సుపరిచితురాలు
శ్రీకృష్ణ చంద్రోదయము
ఈ జంటనగరాలు హేమంతశిశిరాలు
తల్లిదండ్రులు
  • రఘునాథాచార్యులు (తండ్రి)
  • అలివేలమ్మ (తల్లి)

జీవిత విశేషాలుసవరించు

వీరు ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతానికి చెందినవారు. ఉత్పల సత్యనారాయణ 1927, జూలై 4న రఘునాథాచార్యులు, అలివేలమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం తిరుపతిలో వేటూరి ప్రభాకరశాస్త్రి శిష్యరికంలో జరిగింది. ఇతడు విద్వాన్ వరకు చదివాడు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. విద్వాన్ పూర్తి అయిన తరువాత మద్రాసులో మాతృభూమి పత్రికలో ఉపసంపాదకునిగా చేరాడు. అక్కడ ఇతనికి చుండి జగన్నాథంతో పరిచయం ఏర్పడి జాతీయ భావాలను పెంపొందించుకున్నాడు.నెల్లూరులోని జమీన్‌ రైతు పత్రికకు సినిమా రిపోర్టర్‌గా మద్రాసు నుండి వారం వారం సినిమా వార్తలను పంపేవాడు. ఇలా ఇతడు పత్రికారంగంలో ప్రవేశించి ప్రజామత, ఆనందవాణి, భారతి, గోలకొండ పత్రికలకు గేయాలు అనేకం వ్రాసి ప్రకటించేవాడు. ఇతడు హైదరాబాదుకు వచ్చిన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. పట్టా పొందాడు. ఈయన సికింద్రాబాదులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యునిగా పనిచేశాడు. ఆ తర్వాత జంటనగరాలలో అనేక కళాశాలలో ఉపన్యాసకునిగా కొనసాగాడు.[1]

రచనలుసవరించు

ఇతడు రామ్‌నరేష్ త్రిప్రాఠీ, మైథిలీ శరణ్‌గుప్త, గోల్డ్స్ స్మిత్ మొదలైన వారి రచనలనుండి ప్రభావితుడైనాడు. ఇతని రచన శ్రీకృష్ణ చంద్రోదయమునకు 2003 సంవత్సరములో 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' అందుకున్నాడు. ఈయన రచనలలో ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షము, భ్రమర గీతము, గోపీగీతము, రాజమాత, వేణు గీతము, యశోదానంద గేహిని, స్వప్నాల దుప్పటి, తపతి, గాంధారి, శరణాగతి, కీచకుని వీడ్కోలు, చిన్ని కృష్ణుడు, గంగావతరణము, శతరూప, వ్యాసమంజూష, యుగంధరాయణ, పాతబస్తీ విలాసము, రాసపంచాధ్యాయి, రాసపూర్ణిమ, రాజమాత, రసధ్వని ప్రముఖమైనవి. ఇంకా ఇతడు బొమ్మరిల్లు, యవ్వనం కాటేసింది, బొట్టు కాటుక మొదలైన సినిమాలకు పాటలను అందించాడు.[1]

పురస్కారాలుసవరించు

మరణంసవరించు

సత్యనారాయణాచార్య 2007, అక్టోబర్ 23న హైదరాబాదులో అనారోగ్యముతో మరణించాడు.[2]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 యస్.యస్.రెడ్డి (25 August 1981). "ఉత్పల:సంప్రదాయసత్ఫలం". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 68, సంచిక 144. Archived from the original on 29 నవంబరు 2020. Retrieved 21 February 2018.
  2. "హిందూపత్రికలో ఉత్పల సత్యనారాయణాచార్య మరణ వార్త". Archived from the original on 2007-10-28. Retrieved 2007-10-30.