నాభి
Navel 13 04 1993.jpg
మానవ స్త్రీ నాభి
లాటిన్ umbilicus
Dorlands/Elsevier u_02/12836058

నాభి లేదా బొడ్డు (ఆంగ్లం: Umbilicus or Navel) ఉదరము యొక్క ఉపరితలంలో యుండే భాగము. బిడ్డ పుట్టిన తర్వాత కత్తిరించబడిన నాభి నాళం ఎండి రాలిపోయి ఏర్పడిన లోతైన భాగం ఇది. ఇది అన్ని క్షీరదాలలో ఉన్నా కూడా మానవులలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

మనుషులలో నాభి యొక్క పరిమాణము, లోతు, ఆకారము వివిధ వ్యక్తులలో విభేదిస్తుంది. ఒకే విధంగా కనిపించే కవలలో కొన్ని సార్లు దీనిని గుర్తింపు లక్షణంగా ఉపయోగిస్తారు.

భాషా విశేషాలుసవరించు

తెలుగు భాషలో బొడ్డు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] బొడ్డు లేదా నాభి (The navel) మన శరీర భాగము. బొడ్డుకోయుట అనగా బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డు నాళాన్ని కోయడం అనే ప్రక్రియ. బొడ్డుఊచ అనగా గొళ్ళెము (a bolt, a pointless arrow). బొడ్డుకొంగు అనగా పురుషులు బొడ్డు చుట్టూ ధరించే వస్త్రము. బొడ్డుచావడి, బొడ్డుచవిక అనగా నడిమి చావిడి లేదా చావడిలోని మధ్యభాగము. బొడ్డుగంటలు ఏనుగుకు రెండువైపులా వేలాడదీసే గంటలు. ఉదా: "కరులబొడ్డుగంటలు ఘల్లుమనిమ్రోయ." బొడ్డుపుడక దూదిని ఏకే పరికరం. ఒకవిధమైన మ్రానికొరముట్టు. బొడ్డుమల్లె ఒక రకమైన మల్లె.

మానవునిలో నిర్మాణముసవరించు

నాభి ఉదరము యొక్క ఉపరితలంలో బాహ్యంగా కనిపించే స్పష్టమైన నిర్మాణము. మానవులలో నాభి యొక్క స్థానము స్థిరంగా ఉంటుంది. దీని తలంలోని చర్మం 10వ కశేరు నాడి (T10 dermatome) ద్వారా కలుపబడతాయి. దీని స్థానం కటి వెన్నుపూస (L3/L4) తలానికి సమానం.

 
Navel at Golden Section - 62% of body height

కొందరు పిల్లలలో నాభి వద్ద హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కారణం నాభి నిర్మాణాత్మకంగా బలహీనమైన భాగం కావడమే. గర్భం వచ్చిన తర్వాత పెరుగుతున్న గర్భాశయం నాభి మీద ఒత్తిడి తెచ్చి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అయితే ప్రసవం తర్వాత కొంతకాలానికి అది మామూలుగా లోపలికి పోతుంది.

నాబి ఉదరభాగాన్ని నాలుగు భాగాలుగా చేస్తుంది. లియోనార్డో డావిన్సీ చిత్రించిన మానవుని శరీరనిర్మాణంలో నాభి మధ్యభాగాన్ని ఆక్రమించింది. నిజంగా మన శరీరంలో గురుత్వాకర్షణ పరంగా కూడా నాభి మధ్యభాగం అవుతుంది.

కొందరిలో నాభి ఒక చిన్న లొత్తగానే ఉంటుంది. ఇది సామాన్యంగా నాభి హెర్నియా (umbilical hernia) కోసం శస్త్రచికిత్స చేసిన తర్వాత కనిపిస్తుంది.[2]

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=బొడ్డు&oldid=3065027" నుండి వెలికితీశారు