బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి

బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడు సార్లు ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1985 - 1994
ముందు ఆనం వెంకటరెడ్డి
తరువాత కొమ్మి లక్ష్మయ్య నాయుడు
నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1935 అక్టోబర్‌ 17
బట్టేపాడు, ఆత్మకూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ
సంతానం ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె

రాజకీయ జీవితంసవరించు

సుందర్‌రామిరెడ్డి చెన్నైలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, ఆ తరువాత ఆత్మకూరు, అనంతసాగరంలో ప్రభుత్వ వైద్యునిగా పని చేసి 1970లో ఆత్మకూరులో సొంత వైద్యశాలను ప్రారంభించాడు. ఆయన లో 1978లో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1983లో ఓడిపోయి, తిరిగి 1985, 1989 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1991లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సంస్థ(ఎస్‌ఎఫ్‌సీ) చైర్మన్‌గా పని చేశాడు.

మరణంసవరించు

డాక్టర్‌ బొమ్మిరెడ్డి సుందర్‌రామిరెడ్డి 2020 ఫిబ్రవరి 6న మరణించాడు. ఆయన భార్య, ముగ్గురు కుమారులు డా.బి. రవీంద్రనాథ్ రెడ్డి, డా.బి.రాజేంద్రనాథ్ రెడ్డి, బి. రాఘవేంద్ర రెడ్డి (మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌), ఒక కుమార్తె ఉన్నారు.[2][3]

మూలాలుసవరించు

  1. Sakshi (2019). "ఆత్మకూరు నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  2. Sakshi (7 February 2020). "మాజీ ఎమ్మెల్యే సుందరరామిరెడ్డి కన్నుమూత". Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.
  3. The Hans India (7 February 2020). "Former MLA and Congress leader Sundara Rami Reddy passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.