బొమ్మ వెంకటేశ్వర్లు

బొమ్మ వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1999 నుండి 2004 వరకు ఇందుర్తి (హుస్నాబాద్) నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించాడు.

బొమ్మ వెంకటేశ్వర్లు
బొమ్మ వెంకటేశ్వర్లు

బొమ్మ వెంకటేశ్వర్లు


మాజీ శాసనసభ్యుడు
పదవీ కాలం
1999 – 2004
నియోజకవర్గం ఇందుర్తి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం మార్చి 18, 2019
హైదరాబాద్, తెలంగాణ
జీవిత భాగస్వామి కమలమ్మ
సంతానం భారతీ, రజనీ, జయశ్రీ (కుమార్తెలు), శ్రీరాం (కుమారుడు)[1]
నివాసం హైదరాబాదు, తెలంగాణ

జీవిత విశేషాలు సవరించు

పెద్దపల్లి జిల్లా, శ్రీరాంపూర్ గ్రామంలో జన్మించిన వెంకటేశ్వర్లు, సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.[2]

రాజకీయ ప్రస్థానం సవరించు

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడైన వెంకటేశ్వర్లు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడిగా, రాష్ట్రస్థాయి నాయకుడిగా పనిచేశాడు. 1989, 1994 ఎన్నికల్లో దేశిని చిన్నమల్లయ్య పోటీచేసి ఓడిపోయాడిన వెంకటేశ్వర్లు 1999లో గెలుపొంది 2014 వరకు ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2004లో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి చాడ వెంకట్ రెడ్డి చేతిలో, 2014లో వేములవాడ నుంచి పోటీచేసి ఓడిపోయాడు.[3][4]

మరణం సవరించు

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ 2019, మార్చి 18 సోమవారంనాడు మరణించాడు.[5]

మూలాలు సవరించు

  1. Sakshi (1 August 2022). "ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
  2. ఈనాడు, జిల్లా వార్తలు (19 March 2019). "మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు మృతి". Archived from the original on 19 March 2019. Retrieved 19 March 2019.
  3. ఎన్ టీవి (18 March 2019). "మాజీ ఎమ్యెల్యే బొమ్మ వెంకన్న కన్నుమూత." Archived from the original on 19 March 2019. Retrieved 19 March 2019.
  4. వి6 వెలుగు, తెలంగాణ (18 March 2019). "మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కన్నుమూత". Archived from the original on 19 March 2019. Retrieved 19 March 2019.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (18 March 2019). "మాజీ ఎమ్మెల్యే వెంకన్న కన్నుమూత". Archived from the original on 19 March 2019. Retrieved 19 March 2019.