బోజ్జు వెడ్మా పటేల్

కల్లుగూడా గూడెంలో గోండు సామాజిక వర్గంలో జన్మించారు వెడ్మా బోజ్జు .

గోండులకు రాజకీయ అవకాశాల పైన ఉద్యమాన్ని చేస్తూ.. తుడుం దెబ్బ స్టేట్ జనరల్ సెక్రెటరీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు బొజ్జు వేడ్మా.

ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడ్డ వ్యక్తి బోజ్జు వెడ్మా పటేల్ .

గిరిజన బిడ్డగా.. గిరిజన నాయకుడిగా.. సామాజిక కార్యకర్తగా.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా క్రింది స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన వ్యక్తి బోజ్జు వెడ్మా .

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వెడ్మా ఆ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి వరకు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా... ఖానాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జిగా ఉన్నారు వెడ్మ బొజ్జు .

నియోజకవర్గంలో తన పనిని.. పార్టీలో తన నిబద్ధతను గుర్తించిన పార్టీ అధిష్టానం బొజ్జుకు ఖానాపూర్ నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది.

2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికలు ఘనపురి శాసనసభ నియోజకవర్గం నుంచి భారతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలు ముందున్నారు బొజ్జు వేడ్మా పటేల్ .

నియోజకవర్గంలో అన్నివేళలా అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి మధ్యనే ఉంటూ ఎదిగారు బొజ్జు.

తనాదైన సేవ, సామాజిక కార్యక్రమాలతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా నియోజకవర్గంలో ఉన్న యువతకు భవిష్యత్తు అవకాశాలు పైన అవగాహన కల్పించడం,.. హెల్త్ క్యాంపులు నిర్వహించడం లాంటివి చేశారు బోజ్జు. [1] ఇవన్నీ బొజ్జు గెలుపుకు ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు .

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.