బోడుప్పల్ నగరపాలక సంస్థ
బోడుప్పల్ నగరపాలక సంస్థ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న13 నగరపాలక సంస్థలలో మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లాలో ఇది కొత్తగా ఏర్పడిన నగరపాలక సంస్థ.ఇంతకుముందు బోడుప్పల్ మున్సిపాలిటి 2016 సంవత్సరంలో పూర్వపు రంగారెడ్డి జిల్లాలోని బోడుప్పల్, చంగిచెర్ల గ్రామ పంచాయతీల విలీనంతో ఏర్పడింది.[1] తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 211, తేది 2019 జూలై 23 లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది.[2] నగర ప్రాంతం 20.53 చ.కి. విస్తీర్ణంలో విస్తరించిఉంది. చర్లపల్లి వద్ద ప్రతిపాదిత రైల్ టెర్మినల్, పోచారం ఐటి పార్క్ వంటి పరిసరాలలో జరుగుతున్న పరిణామాలతో బోడుప్పల్ నగరం అధిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ తిరుపతిగా పిలవబడుతున్న[3] యాదగిరిగుట్ట ఆధ్యాత్మిక ప్రదేశం ఇక్కడకి 51 కి.మీ. దూరంలో ఉంది.
బోడుప్పల్ నగరపాలక సంస్థ | |
---|---|
![]() | |
రకం | |
రకం | పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ |
నాయకత్వం | |
మేయర్ | సామల బుచ్చిరెడ్డి 2020 నుండి |
డిప్యూటీ మేయర్ | కొత్త లక్ష్నీ |
నిర్మాణం | |
రాజకీయ వర్గాలు | టి.ఆర్.యస్ |
సమావేశ స్థలం | |
బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ కార్యాలయం | |
వెబ్‌సైటు | |
వెబ్ సైట్ |
ఉనికిసవరించు
బోడుప్పల్ నగరం హైదరాబాద్ ఎంజిబిఎస్ టెర్మినల్ నుండి 14 కి.మీ. దూరంలో, జిహెచ్ఎంసి పరిధిలోని ఉప్పల్ సర్కిల్కు ఆనుకొని 17.6297 7, 78.4814 రేఖాంశం కూడలిలో ఉంది. ఇది ఈశాన్య దిశలో రాష్ట్ర రాజధాని తెలంగాణకు 14 కి.మీ. దూరంలో, ఘట్కేసర్ మండల ప్రధాన కార్యాలయం నుండి కీసర వద్ద ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 25 కి.మీ. దూరంలో ఉంది.
2020 ఎన్నికల వార్డులు సంఖ్యసవరించు
బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిని 2020 లో జరిగిన ఎన్నికలకు తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ వారిచే ఇరవై ఎనిమిది ( 28 ) వార్డులుగా విభజించబడింది.[4]
మేయర్ , డిప్యూటీ మేయర్సవరించు
2020లో జరిగిన సాధారణ ఎన్నికలలో మేయరు పదవికి (యుఆర్ జి) తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సామాల బుచ్చిరెడ్డి ఎన్నికయ్యాడు.అలాగే డిప్యూటీ మేయరు పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొత్తలక్ష్మి ఎన్నికైంది.[5]
మూలాలుసవరించు
- ↑ http://boduppalmunicipality.telangana.gov.in/assets/boduppalgos/images/1557322356.PDF
- ↑ "Boduppal Municipal Corporation". web.archive.org. 2019-12-18. Retrieved 2020-01-24.
- ↑ https://www.eenadu.net/districts/news/119017313/yadadri%20bhuvanagiri/1900/698
- ↑ https://cdma.telangana.gov.in/Ward%20Delimitation%20Gos/GO%20320%20-%20Boduppal%20-.pdf[permanent dead link]
- ↑ https://tsec.gov.in/pdf/munc_corp/2020/Mayer_chairperson_MC_1427.pdf