బోధేశ్వరన్
బోధేశ్వరన్ (1901 డిసెంబర్ 28 - 1990 జూలై 3) భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక సంస్కర్త, మలయాళ కవి. అతని అసలు పేరు కేశవ పిళ్ళై. అతన్ని బోధేశ్వరానంద అని కూడా అంటారు. అతను కేరళగానం వంటి జాతీయవాద కవితలు రాసాడు. వైకం సత్యాగ్రహం వంటి సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నాడు. 1936 లో ఆలయ ప్రవేశ ప్రకటనకు దారితీసిన సంఘటనలకు అతడు ప్రసిద్ధి చెందాడు.
బోధేశ్వరన్ | |
---|---|
జననం | కేశవ పిళ్ళై 1901 డిసెంబరు 28 నెయ్యట్టింకర, ట్రావన్కూర్ సంస్థానం |
మరణం | 1990 జూలై 3 | (వయసు 88)
జాతీయత | భారతీయుడు |
వృత్తి |
|
జీవిత భాగస్వామి | వి.కె.కాత్యాయని అమ్మ |
పిల్లలు | హృదయ కుమారి, సుగతా కుమారి, సుజాత |
తల్లిదండ్రులు |
|
జీవిత చరిత్ర
మార్చుబోధేశ్వరన్, 1901 డిసెంబరు 28 న ట్రావెన్‌కోర్‌లోని (ప్రస్తుత తిరువనంతపురం) నెయ్యట్టింకరలో చంపాయిల్ వీటిల్ కుంజన్ పిళ్లై, తాజమంగళం జానకి లకు జన్మించాడు. [1]
పిళ్ళై, చిన్న వయసు లోనే స్వామి వివేకానంద ఆలోచనలతో ప్రభావితమయ్యాడు. చదువు విడిచిపెట్టి, సామాజిక, మతపరమైన సంస్కర్త నారాయణ గురువును దర్శించుకున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల పాటు అతని వద్దనే ఉన్నాడు. [2] తదనంతరం, అతను భారతదేశం అంతటా పర్యటించాడు. కాశీ విశ్వనాథ దేవాలయ సందర్శనలో ఉండగా, బోధేశ్వరానంద అనే పేరు స్వీకరించాడు. ఈ ప్రయాణాలలో, అతను అనేక మంది సన్యాసులను భారత స్వాతంత్ర్య సమర యోధులనూ కలుసుకున్నాడు. మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ ల బహిరంగ సభలకు హాజరయ్యే అవకాశం కూడా అతనికి లభించింది. [3]
బోధేశ్వరన్ తిరువనంతపురంలోని ప్రభుత్వ సంస్కృత కళాశాలలో సంస్కృత ప్రొఫెసర్ వికె కార్తియాయిని అమ్మను పెళ్ళి చేసుకున్నాడు. [4] ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హృదయ కుమారి, సుగాతా కుమారి, సుజాత అనే ఈ ముగ్గురూ రచయిత్రులే. [5] [6] అతను 1990 జూలై 3 న, 88 సంవత్సరాల వయస్సులో మరణించాడు. [1]
చట్టంపి స్వామికల్, నారాయణ గురులతో
మార్చుకేరళకు తిరిగి వచ్చిన తర్వాత, బోధేశ్వరన్ తన జీవితంలో ఎంతో ప్రభావం చూపిన చట్టంపి స్వామికల్‌ని కలవమని నారాయణ గురు సలహా ఇచ్చాడు. [2] ఆ తర్వాత, అతను భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూనే స్వామికల్‌తో తన అనుబంధాన్ని కొనసాగించాడు. అనేక బహిరంగ ప్రసంగాలు చేసి, పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించాడు. [3] కొన్నాళ్ళూ ఆర్య సమాజ్ ఉద్యమాన్ని నుసరించాడు. వైకం సత్యాగ్రహం లోని, తత్సంబంధిత ఇతర కార్యక్రమాలలోనూ పాల్గొన్నాడు. ఇవే 1936 లో ఆలయ ప్రవేశ ప్రకటనకు దారితీసాయి. [2] భారత జాతీయ కాంగ్రెసు సభ్యుడయ్యాడు. అతని పేరును మరోసారి మార్చుకుని బోధేశ్వరన్ అయ్యాడు. [3]
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బోధేశ్వరన్ క్రమంగా క్రియాశీల రాజకీయాల నుండి వైదొలిగాడు. అయితే, అతను మరణించే వరకు కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నాడు. అతను స్వామికల్ అనే అంశంపై ఉపన్యాసాలు చేసాడు. వ్యాసాలు రాసాడు. నాయర్, దేవిలు చెప్పినట్లుగా, స్వామికల్ అంటే "పరిపూర్ణ జ్ఞాన స్వరూపం" అని అతని నమ్మకం. [3]
వారసత్వం, గౌరవాలు
మార్చుబోధేశ్వరన్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న సమయంలో జాతీయ భావాలను ప్రతిబింబించే కవితలు రాసాడు. ఇందులో కేరళగానం ఒకటి. ఇది ఆనాడు ప్రసిద్ధి గాంచిన దేశభక్తి గేయం. [5] [7] అతను ఆరు పుస్తకాలను ప్రచురించాడు. వాతిలో కవితా సంకలనాలతో పాటు, అతని ప్రసంగాల సంకలనం కూడా ఉంది. [8] అతను మొదటి ప్రపంచ యుద్ధం వరకు సమగ్ర ప్రపంచ చరిత్రను రాయడానికి ప్రయత్నించాడు. కానీ దానిని పూర్తి చేయలేకపోయాడు. అతను స్థాపించిన సుప్రభాతం అనే పత్రిక కూడా కొద్దికాలం మాత్రమే జీవించింది. [1]
భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం అతడిని తామ్రపత్రం తో సత్కరించింది. [1] 2002 లో భారత రాష్ట్రపతిగా ఉన్న KR నారాయణన్ తన ఆశయాలను ప్రచారం చేయడం కోసం బోధేశ్వరన్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి, ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు.[9] కేరళగానం, దేశభక్తి గీతాన్ని 2014 లో కేరళ సాంస్కృతిక గేయంగా ప్రకటించారు. [10]
గ్రంథ పట్టిక
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Biography on Kerala Sahitya Akademi portal". Kerala Sahitya Akademi portal. 8 April 2019. Retrieved 8 April 2019.
- ↑ 2.0 2.1 2.2 "Bodheswaran - Veethi profile". veethi.com. 8 April 2019. Retrieved 8 April 2019.
- ↑ 3.0 3.1 3.2 3.3 R. Raman, Nair; L. Sulochana, Devi (2010). Chattampi Swami: An Intellectual Biography. Trivandrum: Centre for South Indian Studies. pp. 168–169. ISBN 978-81-905928-2-6. Retrieved 11 October 2011.
- ↑ "Bodheswaran - Veethi profile". veethi.com. 8 April 2019. Retrieved 8 April 2019.
- ↑ 5.0 5.1 R. Raman, Nair; L. Sulochana, Devi (2010). Chattampi Swami: An Intellectual Biography. Trivandrum: Centre for South Indian Studies. pp. 168–169. ISBN 978-81-905928-2-6. Retrieved 11 October 2011.
- ↑ R. Raman, Nair; L. Sulochana, Devi (2010). Chattampi Swami: An Intellectual Biography. Trivandrum: Centre for South Indian Studies. pp. 168–169. ISBN 978-81-905928-2-6. Retrieved 11 October 2011.
- ↑ Prerna Singh (2015). How Solidarity Works for Welfare: Subnationalism and Social Development in India. Cambridge University Press. pp. 85–. ISBN 978-1-107-07005-9.
- ↑ "List of works". Kerala Sahitya Akademi. 8 April 2019. Retrieved 8 April 2019.
- ↑ "Bodheswaran foundation inaugurated - Times of India". The Times of India. Retrieved 8 April 2019.
- ↑ "Bodheswaran - Kerala Literature". keralaliterature.com. 8 April 2019. Archived from the original on 8 April 2019. Retrieved 8 April 2019.