నారాయణ గురు
నారాయణ గురు, (1856 - సెప్టెంబరు 20, 1928) కేరళకు చెందిన ఒక సంఘసంస్కర్త. సమాజంలోని మూఢ విశ్వాసాలను, కుల తత్వాన్ని నిరసించాడు.[1] కులం కారణంగా కొన్ని వర్గాలకు చెందిన ప్రజలు అన్యాయానికి గురవుతున్నారనీ, వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ, సామాజిక స్వాతంత్ర్యం ఉండాలని అతను భావించాడు. వారిని ఉద్ధరించడానికి ఆలయాలు, పాఠశాలలు మొదలైన సంస్థలు నెలకొల్పడానికి పాటు పడ్డాడు.[2]
శ్రీ నారాయణ గురు | |
---|---|
జననం | 1856 చెంపళంతి, ట్రావెంకూర్, కేరళ |
నిర్యాణము | 1928 సెప్టెంబరు 20 వర్కాల, ట్రావెంకూర్ |
ప్రభావితులైన వారు |
బాల్యం
మార్చుఅతను ఇంటిని విడిచిపెట్టి, గురు కేరళ, తమిళనాడు గుండా ప్రయాణించాడు. ఈ ప్రయాణాలలో, అతను సామాజిక, మత సంస్కర్త చట్టంపి స్వామికల్‌ని కలుసుకున్నాడు. అతను అయ్యావు స్వామికల్‌కు గురువును పరిచయం చేసాడు. అతను ధ్యానం, యోగా నేర్చుకున్నాడు.[3]
1887లో అతను ప్రాచుర్యంలోకి వచ్చాక అతని బాల్య విశేషాల గురించి అనేక రకాలైన కథలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అందులో వేటిలోనూ నిర్దిష్టమైన సమాచారం లభించలేదు. నారాయణ గురు 1856లో కేరళ లోని తిరువనంతపురం సమీపంలోని చెంపళంతి అనే గ్రామంలో మదన్ ఆసన్, కుట్టియమ్మ అనే వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించాడు. వయలవరంలోని వారి ఇల్లు ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థాయిలో ఉంది. అతనికి నారాయణన్ అనే పేరు పెట్టి, నానూ అని పిలుచుకునే వారు. నానూకు ముగ్గురు సోదరీ మణులు ఉండేవారు. తండ్రి మదన్ ఆసన్ ఉపాధ్యాయుడు. అతనికి సంస్కృతం, జ్యోతిష శాస్త్రం, ఆయుర్వేదం లోనూ ప్రవేశం ఉండేది. నారాయణన్ కు ఐదేళ్ళ వయసులో పక్కనే ఉన్న గురుకుల పాఠశాల లో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు.[4]
గుర్తింపు
మార్చురవీంద్రనాథ ఠాగూర్ నారాయణ గురును 1922 నవంబరున శివగిరి ఆశ్రమంలో కలిశాడు. తరువాత ఠాగూర్ అతనిని గురించి నారాయణ గురును మించిన లేక అతనితో పోల్చదగిన ఆధ్యాత్మిక వేత్తను నేను ఎన్నడూ చూడలేదని ప్రశంసించాడు.[5][6]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "కులమత భేదాల నిర్మూలన కోసం నారాయణ గురు కృషి గొప్పది : సోనియా". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 8 November 2016.[permanent dead link]
- ↑ Pullapilly, Cyriac K. (1976). "The Izhavas of Kerala and their Historic Struggle for Acceptance in the Hindu Society". In Smith, Bardwell L. (ed.). Religion and social conflict in South Asia. International studies in sociology and social anthropology. Vol. 22. BRILL. pp. 24–46. ISBN 978-90-04-04510-1.
- ↑ Younger, Paul (2002). Playing host to deity : festival religion in the South Indian tradition. Library Genesis. New York : Oxford University Press. ISBN 978-0-19-514044-6.
- ↑ కత్తి, పద్మారావు. "అక్షర దీపం వెలిగించిన నారాయణ గురు". prajasakti.com. ప్రజాశక్తి. Retrieved 9 November 2016.[permanent dead link]
- ↑ Bhattacharya, Sabyasachi (31 December 2011). "The Other Tagore". Frontline. No. Volume 28 - Issue 27. Retrieved 9 February 2015.
{{cite news}}
:|issue=
has extra text (help) - ↑ "కారు చీకట్లలో చైతన్య దీప్తులు". sakshi.com. సాక్షి. Retrieved 8 November 2016.