బోయకొండ గంగమ్మ

(బోయ కొండ గంగమ్మ నుండి దారిమార్పు చెందింది)

బోయ కొండ గంగమ్మ దేవాలయం చిత్తూరు జిల్లాలో పుంగనూరు దగ్గర ఉంది. ఇది గ్రామ దేవత ఆలయం; కొన్నేళ్ల క్రితం వరకు అతి సాధారణ గ్రామ దేవత ఆలయంగా వున్న ఈ ఆలయం కొన్ని సంవత్సరాల నుండి చాల ప్రాముఖ్యత వహిస్తున్నది. చిత్తూరు జిల్లాలో ఈ తరహా గ్రామ దేవతల ఆలయాలన్నింటి కన్న ఈ ఆలయం అతి ప్రసిద్ధి పొందినది. ఈ అలయం ఒక చిన్న కొండపై వెలసి ఉంది. ఇక్కడ నిత్య పూజలు జరుగు తున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొత్తగా ఆలయాన్ని అభివృద్ధి చేసినందున దైవ దర్శనానికి చాల సులభం. ప్రస్తుతం లక్షలాది రూపాయల ఆదాయం ఈ దేవాలయానికున్నది. వసతి సౌకర్యాలు అంతగా లేవు. కాని ఈ ఆలయం వద్ద రాత్రులందు ఎవరూ వుండరు.

బోయకొండ గంగమ్మ దేవాలయం

ఆలయంలో పూజావిధానం అన్ని ఆలయాలలో వున్నట్లే వుంటుంది. కాని భక్తులు ఎక్కువగా జంతు బలులతో తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ చుట్టు ప్రక్కలా చిన్న చిన్న కొండలు, గుట్టల మయం, అంతా చిట్టడవి. సామాన్యంగా భక్తులు అందరూ బృందాలుగా తమ వెంట వంట సామానులు, ఒక ఏటను అనగా ఒక మేక గాని లేదా ఒక గొర్రెను గాని, కనీసం ఒక కోడిని గాని తీసుకొని వస్తారు. వంట సామునులు తేలేని వారికి అన్ని వంట సామానులు ఇక్కడ అద్దెకు ఇస్తారు. గంగమ్మ కొండ దిగువన మేకలను, గొర్రెలను కోసి వంటలు చేసి అక్కడే తిని గంగమ్మను దర్శించుకొని సాయంకాలం తీరిగ్గా ఇళ్లకు వెళ్తారు. గంగమ్మకు మొక్కిన వారు వాయిదా వేయ కుండా తప్పని సరిగా మొక్కును తీర్చు కుంటారు. లేకుంటే గంగమ్మ ఆగ్రహారానికి గురి కావలసి వస్తుందని భయం. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమంటే ఆలయం లోపల మామూలుగా ప్రసాదాలు ఇస్తుంటారు. ఎక్కడ లేనివిధంగా ఇక్కడ రంగు నీళ్లను కూడా తీర్తం లాగ ఇస్తారు. దాని కొరకు అందరు నీళ్ల బాటిళ్లు తీసుకెళతారు. ఆ నీళ్లను తమ పంట పొలాలలో చల్లితే పంటలకు చీడ పీడలు తగలకుండా మంచి పంట నిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి భక్తులు మన రాష్ట్రం నుండే కాక, సమీపంలో వున్నందున కర్ణాటక, తమిళ నాడు రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు.

ఇది చౌడే పల్లి సమీపాన వున్న కొండపై వెలసిన దేవత. ఈ ఆలయం పురాతనమైనా ఈ మధ్యనే ఎక్కువ ప్రాచుర్యంలోనికి వచ్చింది. జంతు బలులు ఇక్కడి నిత్యకృత్యం. భక్తులు కుటుంబ, బందు మిత్ర సమేతంగా వచ్చి ఏటను తెచ్చుకొని ఇక్కడే కోసి వంట చేసుకొని తిని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని నిదానంగా ఇళ్లకు వెళతారు. ఇక్కడ భక్తులకు వంట చేసుకోడానికి పాత్రలు, టెంట్లులు వంటివి అద్దెకు కూడా ఇస్తారు. ఇతర పూజా సామాగ్రి కూడా అందు బాటులో వుంటుంది. ఇది కర్ణాటకకు తమిళ నాడు రాష్ట్రాలకు కూడా దగ్గరగా వున్నందున ఆ యా రాష్ట్రాల భక్తులు కూడా వస్తుంటారు. ఇక్కడ జరుగుతున్న బలులు, వంట కార్యక్రమాలు హైదరాబాద్ లోని బంజార హిల్సు లోని పెద్దమ్మ గుడి వద్ద జరిగే కార్యక్రమాలను తలపిస్తుంది.

యివి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు