పుంగనూరు

ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, పుంగనూరు మండల పట్టణం

పుంగనూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన పట్టణం.ఈ ఊరికి "దేవాలయాల పట్టణం" అని ముద్దు పేరు ఉంది. బ్రిటిష్ హయాంలో రాజ్యం చేసిన దొరల కోట ఒకటి ఈ వూళ్ళో ఉంది. అలాగే అమర శిల్పి జక్కన్నకుమారుడు ఒకే ఒక రాత్రిలో చెక్కిన ఒక పెద్ద కళాత్మకమైన కోనేరు కూడా ఉంది. ఇక్కడ ఎటా జరిగే గంగమ్మ జాతర ప్రముఖ ఆకర్షణ.

పట్టణం
పటం
Coordinates: 13°22′N 78°35′E / 13.37°N 78.58°E / 13.37; 78.58
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండలంపుంగనూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం32.28 కి.మీ2 (12.46 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం54,746
 • జనసాంద్రత1,700/కి.మీ2 (4,400/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1010
ప్రాంతపు కోడ్+91 ( 8581 Edit this on Wikidata )
పిన్(PIN)517247 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

పేరు వ్యుత్పత్తి

మార్చు

పుంగనూరు అసలు పేరు పరుశురామక్షేత్రం. కాల గమనంలో పుంగ పురంగా మారి నేడు పుంగనూరుగా పిలువబడుతున్నది.

చరిత్ర

మార్చు

తిమ్మ రాయలు సంతతి వారు పుంగనూరు జమీందారలుగా వుండే వారు. 1866 లో ఈ సంస్థానంలో ఒక అందమైన రాజ భవనాన్ని నిర్మించారు. స్వాతంత్ర్యానంతరం జమీందారి వ్వవస్థ రద్దు కావడంతో వారు బెంగుళూరుకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. దాంతో ఈ రాజమహలు కళా హీనమై వన్నె కోల్పోయింది. ఒకప్పుడు ఈ మహల్ లో గ్రంథాలయం, మ్యూజియం వుండేవి. కాల క్రమంలో అవి కనుమరుగయ్యాయి. వెనుక భాగంలో అత్యంత కళాకాంతులుతో వున్న కళ్యాణ మంటపం ఉంది. గత వైభవానికి సాక్షిగా ఇది ఇంకా నిలబడి ఉంది. ఇక్కడే ఒక బావి ఉంది. గతంలో నేరస్తులకు మరణ శిక్ష విధించి ఈ బావిలో వడవేసె వారని వారి ఆత్మలు ప్రస్తుతం ఈ మహల్ లో తిరుగుతున్నాయని ఇక్కడి జనుల నమ్మకం. దానికి నివారణగా "అష్టబంధనం" అనే మంత్రాన్ని చక్కలపై చెక్కించి గోడలకు తగిలించే వారు. అవి ఈ నాటికి ఉన్నాయి. రాజ ప్రసాదంనుండి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న నక్కల బండ వరకు సొరంగ మార్గం వుండేదని, అదిప్పుడు పూడుక పోయిందని అంటారు. ప్రస్తుతం ఈ రాజ మహల్ శిథిలావస్థలో ఉంది.[2]

ఈ గ్రామంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. బ్రిటిష్ హయాములో రాజ్యం చేసిన దొరల కోట ఒకటి ఈ వూళ్ళో ఉంది. అలాగే అమర శిల్పి జక్కన్న కుమారుడు ఒకే ఒక రాత్రిలో చెక్కిన ఒక పెద్ద కళాత్మకమైన కోనేరు కూడా ఉంది. ఇక్కడ ఎటా జరిగే గంగమ్మ జాతర ఎంతో ప్రాముఖ్యత గలది. ఈ జాతరకు కర్ణాటక, తమిళనాడు ల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు.పుంగనూరు చింతపండు, పశువుల వ్యాపారంలో దేశం లోనే ప్రఖ్యాతి గాంచింది. ఈ తాలూకాలో ప్రసిద్ధి చెందిన బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉంది.

పుంగనూర్ అసలు పేరు పరుశురామక్షేత్రం. కాల గమనంలో పుంగ పురంగా మారి నేడు పుంగనూరుగా పిలువ బడు తున్నది. తిమ్మ రాయలు సంతతి వారు పుంగ నూరు జమీందారలుగా వుండే వారు. 1866 లో ఈ సంస్థానంలో ఒక అందమైన ప్యాలెస్ ను నిర్మీంచారు. స్వాతంత్ర్యానంతరం జమీందారి వ్వవస్థ రద్దు కావడంతో జమీందార్లు బెంగుళూరుకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. దాంతో ఈ రాజ మహలు కళా హీనమై వన్నె కోల్పోయింది. ఒకప్పుడు ఈ మహల్ లో గ్రంథాలయం, మ్యూజియం వుండేవి. కాల క్రమంలో అవి కనుమరుగయ్యాయి. ప్యాలెస్ వెనుక భాగంలో అత్యంత కళాకాంతులుతో వున్న కళ్యాణ మంటపం ఉంది. గత వైభవానికి సాక్షిగా ఇది ఇంకా నిలబడి ఉంది. ఇక్కడే ఒక బావి ఉంది. గతంలో నేరస్తులకు మరణ సిక్ష విధించి ఈ బావిలో వడవేసే వారని వారి ఆత్మలు ప్రస్తుతం ఈ మహల్ లో తిరుగుతున్నాయని ఇక్కడి జనుల నమ్మకం. దానికి నివారణగా "అస్టబందం" అనే మంత్రాన్ని చక్కలపై చెక్కించి గోడలకు తగిలించే వారు. అవి ఈ నాటికి ఉన్నాయి. రాజ ప్రసాదంనుండి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న నక్కల బండ వరకు సొరంగ మార్గం వుండేదని, అదిప్పుడు పూడుక పోయిందని అంటారు. ప్రస్తుతం ఈ రాజ మహల్ శిథిలావస్థలో ఉంది.

భౌగోళికం

మార్చు

మదనపల్లె కు దక్షిణంగా 25 కి.మీ. దూరంలో వుంది.

జనగణన వివరాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణం 12767 ఇళ్లతో, 54767జనాభాతో 1193 హెక్టార్లలో విస్తరించి ఉంది. పట్టణంలో మగవారి సంఖ్య 27567, ఆడవారి సంఖ్య 27654.[3]

విద్యా సౌకర్యాలు

మార్చు

అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల వలసపల్లెలో ఉంది. సమీప వైద్య కళాశాల తిరుపతిలోను, పాలీటెక్నిక్ మదనపల్లెలోను, మేనేజిమెంటు కళాశాల చిత్తూరులోనూ ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

మార్చు

జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి.

భూమి వినియోగం

మార్చు

పుంగనూరు (రురల్)లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 249 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 207 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 40 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 31 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 11 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 80 హెక్టార్లు
  • బంజరు భూమి: 197 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 373 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 535 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 116 హెక్టార్లు
    • బావులు/బోరు బావులు: 116 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

వేరుశనగ, వరి, మొక్కజొన్న, చింతపండుకు ప్రసిద్ధి.

పర్యాటక ఆకర్షణలు

మార్చు

బోయకొండ గంగమ్మ జాతర

మార్చు

ఇక్కడ బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉంది. ఇక్కడ జరిగే జాతరకు కర్ణాటక, తమిళనాడు ల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు.

ప్రముఖులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "History of Punganuru". Archived from the original on 2013-11-27. Retrieved 2022-06-28.
  3. "Office of the Registrar General & Census Commissioner, India – Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పుంగనూరు&oldid=4000586" నుండి వెలికితీశారు