బ్యాంక్ స్ట్రీట్ (హైదరాబాదు)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రధాన వాణిజ్య ప్రాంతం.

బ్యాంక్ స్ట్రీట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రధాన వాణిజ్య ప్రాంతం. ఈ వీధిలో భారతీయ స్టేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ మొదలైన బ్యాంకులు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పార్కు ఉంది. బ్లడ్ బ్యాంక్‌కు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం అబిడ్స్, చాదర్‌ఘాట్‌ల మధ్యలో ఉంది.

బ్యాంక్ స్ట్రీట్
సమీప ప్రాంతం
బ్యాంక్ స్ట్రీట్ is located in Telangana
బ్యాంక్ స్ట్రీట్
బ్యాంక్ స్ట్రీట్
తెలంగాణలో ప్రాంతం స్థానం
బ్యాంక్ స్ట్రీట్ is located in India
బ్యాంక్ స్ట్రీట్
బ్యాంక్ స్ట్రీట్
బ్యాంక్ స్ట్రీట్ (India)
Coordinates: 17°23′09″N 78°28′46″E / 17.38584°N 78.479347°E / 17.38584; 78.479347
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
500 001
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంగోషామహల్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో ట్రూప్ బజార్ మార్కెట్, గాంధీ నగర్, వకీల్ వాడి, రాంకోటి, సుల్తాన్ బజార్, కోఠి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[1]

వాణిజ్య ప్రాంతం

మార్చు

ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ దుకాణాలు (గుజరాతీ గల్లీ) ఎక్కువగా ఉన్నాయి. బొంబాయి హల్వా అని పిలువబడే ఒక ప్రసిద్ధ స్వీట్ల దుకాణం, గ్రాండ్ హోటల్ అనే ప్రసిద్ధ ఇరానీ కేఫ్,[2] ప్రభుత్వ ఈ.ఎన్.టి ఆసుపత్రి, నిజాం కాలం నుండి రుస్తుం ఫ్రామ్ అని పిలువబడే చాలా పురాతనమైన బార్, భారతదేశంలోని పురాతన అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటైన జె & జె డెచాన్ ల్యాబ్స్, 101 ఏళ్ల నాటి ఆయుర్వేద తయారీ యూనిట్ కూడా ఇక్కడ ఉన్నాయి.

రవాణా

మార్చు

ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రధాన బస్ హబ్‌ను ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుండి రవాణా సౌకర్యం ఉంది.[3] సమీపంలోని నాంపల్లిలో ఎంఎంటిఎస్ రైలు స్టేషన్ ఉంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంది.

ప్రార్థనా మందిరాలు

మార్చు
  • జగన్నాథ దేవాలయం
  • సాయిబాబా దేవాలయం
  • మస్జిద్ జోరావర్ ఖాన్
  • మస్జిద్ ఇంతేజామ్ జంగ్

విద్యాసంస్థలు

మార్చు
  • ప్రగతి మహావిద్యాలయం
  • మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  • జి. పుల్లారెడ్డి జూనియర్ కళాశాల
  • శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత & నృత్య కళాశాల
  • బచ్‌పన్ ప్లే స్కూల్
  • డైమండ్ జూబ్లీ హైస్కూల్
  • రోసరీ కాన్వెంట్ హైస్కూల్

మూలాలు

మార్చు
  1. "Bank Street, Sultan Bazar, Koti Locality". www.onefivenine.com. Archived from the original on 2021-01-30. Retrieved 2022-10-01.
  2. Bhavani, Divya Kala (2017-11-09). "Flavours of Hyderabad". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-28.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-09-24.

ఇవి కూడా చూడండి

మార్చు