బ్రహ్మచారి మొగుడు
బ్రహ్మచారి మొగుడు 1994 లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం.[1] రాజేంద్ర ప్రసాద్, యమున ఇందులో ప్రధాన పాత్రధారులు. జె. వి. రాఘవులు స్వరాలు సమకూర్చాడు. దీనిని శ్రీ సాయి మాధవి ఆర్ట్స్ నిర్మాణ సంస్థ [2] లో బత్తిన వెంకట కృష్ణారెడ్డి నిర్మించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.
బ్రహ్మచారి మొగుడు | |
---|---|
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
నిర్మాత | బత్తిన వెంకటకృష్ణా రెడ్డి |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, యమున |
సంగీతం | జె. వి. రాఘవులు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జనవరి 1, 1994 |
భాష | తెలుగు |
కథ
మార్చురాంబాబు (రాజేంద్ర ప్రసాద్) కుటుంబరావు (గిరి బాబు) నేతృత్వంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్‌గా కొత్తగా చేరతాడు.కుటుంబరావు సోదరిని ఒక బ్రహ్మచారి మోసం చేసాడు. అంచేత అతడు బ్రహ్మచారులను ద్వేషిస్తాడు. అందువల్ల అతడు బ్రహ్మచారి రాంబాబుకు చవకబారు పనులు చెప్పి అతనిని చాలా వేధిస్తాడు. అతని ఉద్యోగం ఇంకా ప్రొబేషను లోనే ఉన్నందున, ఇదే అతని మొదటి ఉద్యోగం అయినందున, వేరే ఖాళీలేమీ లేనందున, రాంబాబు ఈ ఉద్యోగాన్ని వదులుకోలేడు. మరొక ఉద్యోగం పొందనూ లేడు.
తాను పెళ్ళి చేసుకోబోతున్నానని యజమానికి అబద్ధం చెప్పమని అతని సహోద్యోగి గురునాధం (బ్రహ్మానందం) సలహా ఇస్తాడు. అతను యాదృచ్ఛికంగా ఒక అమ్మాయి ఫోటోను తీసి పెళ్ళి కార్డులు వేసి పంపిణీ చేస్తాడు. కొంతకాలం తర్వాత, అనుకోకుండా జయలక్ష్మి (యమున) అనే ఆ ఫోటోలోని అమ్మాయి అతని భార్యనని చెప్పుకుంటూ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇక, రాంబాబు ఆమెను వదిలించుకోవాలని వివిధ ఉపాయాలు పన్నడం, అవి పారకపోవడం, చివరికి వాళ్ళ గతి ఏమౌతుందనేది మిగతా కథ.
తారాగణం
మార్చు- రాంబాబుగా రాజేంద్రప్రసాద్
- జయలక్ష్మిగా యమున
- మాధవయ్యగా సత్యనారాయణ
- కుటుంబరావుగా గిరి బాబు
- గురునాధంగా బ్రహ్మానందం
- రిటైర్డ్ ఆర్మీ కల్నల్‌గా నాగేష్
- టాక్సీ రాముడుగా ధర్మవరపు సుబ్రమణ్యం
- పంతులుగా సుత్తివేలు
- సావిత్రిగా అన్నపూర్ణ
- కామాక్షి / కాముడుగా శ్రీలక్ష్మి
- రాణిగా డిస్కో శాంతి
- భాగ్యలక్ష్మిగా అన్నూజ
- శాంతమ్మగా డబ్బింగ్ జానకి
- కల్పనా రాయ్
- సత్యగా వై.విజయ
పాటలు
మార్చుసం. | పాట | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "చిగురాకులలోనా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర్ర | 4:32 |
2. | "కామునిపట్నం" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర్ర | 5:21 |
3. | "అహా ముత్యాల" | కె.ఎస్. చిత్ర్ర | 4:44 |
4. | "వచ్చాను గురూ" | కె.ఎస్. చిత్ర్ర | 4:22 |
5. | "కాష్మోరా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమణ | 5:08 |
మొత్తం నిడివి: | 24:07 |
మూలాలు
మార్చు- ↑ "బ్రహ్మచారి మొగుడు సినిమా సమీక్ష". thecinebay.com. Archived from the original on 9 ఆగస్టు 2018. Retrieved 24 September 2017.
- ↑ [dead link]