బ్రాహ్మణపల్లి (పిడుగురాళ్ళ మండలం)
బ్రాహ్మణపల్లి, గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
బ్రాహ్మణపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°31′02″N 79°49′52″E / 16.517306°N 79.831075°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | పిడుగురాళ్ళ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 437 |
ఎస్.టి.డి కోడ్ | 08649 |
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
మార్చుఈ గ్రామానికి చెందిన శ్రీ నల్లగొండ నాగేశ్వరరావు, పిడుగురాళ్ళలో ఒక అపార్టుమెంటులో వాచ్ మన్ గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు గోపి బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుచున్నాడు. ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో ఇతడు తన ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయి అండర్-14 పోటీలకు ఎంపికైనాడు. ఈ విద్యార్థి, 2016,జనవరి-7 నుండి ఢిల్లీలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటాడు.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
మార్చువ్యక్తిగత మరుగుదొడ్లు:- ప్రభుత్వం ఇంటింటికీ మరుగుదొడ్డి పథకంలో భాగంగా, ఈ గ్రామంలో మొత్తం 341 మరుగుదొడ్ల నిర్మాణం చేయవలసియుండగా, అధికారుల, సర్పంచ్ చొరవతో గ్రామంలో మొత్తం 341 మరుగుదొడ్లనూ, నిర్ణీత గడువులోగానే నిర్మించుకొని, ఈ గ్రామస్థులు మండలంలోని మిగిలిన గ్రామాలవారికి ఆదర్శంగా నిలిచారు.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చుగ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో యక్కల పుల్లారావు, సర్పంచిగా ఎన్నికైనాడు.
2021లో జరిగిన ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో షేక్ బడే షాహెబ్, గారు సర్పంచ్ గా ఎన్నికైనాడు.