బ్రూస్ టేలర్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

బ్రూస్ రిచర్డ్ టేలర్ (1943, జూలై 12 – 2021, ఫిబ్రవరి 6) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1965 - 1973 మధ్యకాలంలో 30 టెస్ట్ మ్యాచ్‌లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రంలోనే సెంచరీ చేసి ఐదు వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ ఇతడు.[1][2]

బ్రూస్ టేలర్
బ్రూస్ రిచర్డ్ టేలర్ (1967)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బ్రూస్ రిచర్డ్ టేలర్
పుట్టిన తేదీ(1943-07-12)1943 జూలై 12
తిమారు, న్యూజీలాండ్
మరణించిన తేదీ2021 ఫిబ్రవరి 6(2021-02-06) (వయసు 77)
లోయర్ హట్, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 108)1965 5 March - India తో
చివరి టెస్టు1973 5 July - England తో
తొలి వన్‌డే (క్యాప్ 14)1973 18 July - England తో
చివరి వన్‌డే1973 20 July - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 30 2 141 14
చేసిన పరుగులు 898 22 4,579 272
బ్యాటింగు సగటు 20.40 22.00 24.75 24.72
100లు/50లు 2/2 0/0 4/17 0/1
అత్యుత్తమ స్కోరు 124 22 173 59*
వేసిన బంతులు 6,334 114 21,562 410
వికెట్లు 111 4 422 16
బౌలింగు సగటు 26.60 15.50 25.13 25.62
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 0 15 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 7/74 3/25 7/74 4/38
క్యాచ్‌లు/స్టంపింగులు 10/– 1/– 66/– 7/–
మూలం: Cricinfo, 2017 1 April

అంతర్జాతీయ కెరీర్

మార్చు

1964-65లో కలకత్తాలో భారత్‌తో జరిగిన టెస్ట్ అరంగేట్రంలో న్యూజీలాండ్ తరపున 105 పరుగులు చేసి, 86 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.[3] అరంగేట్రంలోనే ఈ ఆల్‌రౌండ్ ఫీట్‌ను పూర్తిచేసిన మొదటి క్రికెటర్ గా రికార్డు సాధించాడు.[4] కేవలం మూడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన టేలర్ 8వ స్థానంలో వచ్చి 158 నిమిషాల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 105 పరుగులు చేసి బెర్ట్ సట్‌క్లిఫ్ (151 నాటౌట్)కు సహకరించాడు. ఏడో వికెట్‌కు 163 పరుగులు జోడించారు.[5]

1969లో న్యూజీలాండ్ వేగవంతమైన టెస్ట్ సెంచరీని కూడా సాధించాడు. 2005లో డేనియల్ వెట్టోరి దానిని బద్దలు కొట్టే వరకు ఈ రికార్డు కొనసాగింది. ఆక్లాండ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో 6 వికెట్ల నష్టానికి 152 పరుగుల వద్ద ఉన్నపుడు టేలర్ వచ్చి 14 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. ఈ రెండో టెస్టు సెంచరీ, అతని రెండో ఫస్ట్‌క్లాస్ సెంచరీ.[6]

1971-72లో వెస్టిండీస్‌లో ఐదు టెస్టులు డ్రా అయిన బ్యాట్స్‌మెన్ సిరీస్‌లో, ఇరువైపులా ఏ ఇతర బౌలర్ 14 వికెట్లకు మించి తీయలేదు. టేలర్ నాలుగు టెస్టుల్లో 17.70 సగటుతో 27 వికెట్లు తీశాడు. బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన మూడవ టెస్ట్‌లో 74 పరుగులకు 7 వికెట్లు తీసుకున్నాడు. 1973లో ఇంగ్లాండ్ పర్యటనలో తన చివరి టెస్టు ఆడాడు.[2]

దేశీయ క్రికెట్

మార్చు

1972-73లో, డునెడిన్‌లో ఒటాగోపై 173 పరుగులతో టేలర్ అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరు చేశాడు.[7] 1979-80లో తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.[2]

మూలాలు

మార్చు
  1. "Zero sum". Retrieved 17 July 2019.
  2. 2.0 2.1 2.2 "Record-holding New Zealand allrounder Bruce Taylor dies". ESPN Cricinfo. ESPN Internet Ventures. 6 February 2021. Retrieved 6 February 2021.
  3. "2nd Test: India v New Zealand at Kolkata, Mar 5–8, 1965". espncricinfo. Retrieved 18 December 2011.
  4. "An Australian menace". ESPN Cricinfo. Retrieved 7 March 2017.
  5. "New Zealand cricket genius Bruce Taylor dies in hospital, aged 77". Stuff. 6 February 2021. Retrieved 6 February 2021.
  6. Wisden 1970, p. 907.
  7. "Remembering Bruce Taylor". New Zealand Cricket. 6 February 2021. Archived from the original on 6 February 2021. Retrieved 6 February 2021.

బాహ్య లింకులు

మార్చు