బ్రూస్ మారిసన్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

బ్రూస్ డోనాల్డ్ మారిసన్ (జననం 1933, డిసెంబరు 17) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1963లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కుడి-చేతి మీడియం పేస్ బౌలింగ్, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ గా రాణించాడు.[1]

బ్రూస్ మారిసన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బ్రూస్ డోనాల్డ్ మారిసన్
పుట్టిన తేదీ (1933-12-17) 1933 డిసెంబరు 17 (వయసు 90)
లోయర్ హట్, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 96)1963 1 March - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 1 47
చేసిన పరుగులు 10 374
బ్యాటింగు సగటు 5.00 9.34
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 10 37
వేసిన బంతులు 186 11,110
వికెట్లు 2 167
బౌలింగు సగటు 64.50 24.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 7
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2
అత్యుత్తమ బౌలింగు 2/129 7/42
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 30/–
మూలం: Cricinfo, 1 April 2017

క్రికెట్ కెరీర్

మార్చు

మోరిసన్ 1933, డిసెంబరు 17న లోయర్ హట్‌లో జన్మించాడు. 1951 డిసెంబరులో హాక్ కప్‌లో నెల్సన్‌లో జరిగిన ఒక అవే మ్యాచ్ లో తన స్థానిక జట్టు హట్ వ్యాలీ కోసం మొదటిసారి ఆడాడు.[2] 20 ఏళ్ళ వయస్సులో, 1954 జనవరి 7న బేసిన్ రిజర్వ్‌లో ఒటాగోపై వెల్లింగ్‌టన్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఒటాగో మొదటి ఇన్నింగ్స్‌లో 4–70, ఆ తర్వాత వారి రెండో ఇన్నింగ్స్‌లో 7–42 సాధించాడు.[3] తర్వాతి మ్యాచ్ లో ఈడెన్ పార్క్‌లో ఆక్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5–60తో తన చక్కటి ఫామ్‌ను కొనసాగించాడు. బ్యాట్‌తో నాటౌట్‌గా 33 పరుగులు చేశాడు.[4] 16.68 సగటుతో 22 వికెట్లతో సీజన్‌ను ముగించాడు.[5]

ఎంసిసికి వ్యతిరేకంగా వెల్లింగ్టన్ టూర్ మ్యాచ్ లో బేసిన్ రిజర్వ్‌లో ట్రెవర్ బెయిలీ, బిల్ ఎడ్రిచ్, కోలిన్ కౌడ్రీల వికెట్లను తీశాడు.[6] 16 వికెట్లతో సీజన్‌ను ముగించాడు.[7]

1997–98లో బెర్ట్ సట్‌క్లిఫ్ మెడల్‌లో ఉమ్మడి మొదటి విజేతగా నిలిచాడు. ఇది వెల్లింగ్‌టన్ ప్రాంతంలో జూనియర్ క్రికెట్‌కు చేసిన కృషికి గుర్తింపుగా న్యూజీలాండ్‌లో క్రికెట్‌కు అత్యుత్తమ సేవలకు అందితుంది.[8] కొన్ని సంవత్సరాలు వెల్లింగ్టన్ సెలెక్టర్‌గా కూడా ఉన్నాడు. ట్రెంథమ్‌లో నివసించడానికి పదవీ విరమణ చేసే ముందు హట్ వ్యాలీలో స్పోర్ట్స్ గూడ్స్ వ్యాపారాన్ని నడిపాడు.[9]

మూలాలు

మార్చు
  1. "Bruce Morrison". Cricinfo. Retrieved 27 February 2020.
  2. Cricket Archive
  3. Cricket Archive
  4. Cricket Archive
  5. Cricket Archive
  6. Cricket Archive
  7. Cricket Archive
  8. "New Zealand Cricket Awards". NZ Cricket Museum. Archived from the original on 22 July 2019. Retrieved 27 February 2020.
  9. Leggat, David (30 March 2018). "New Zealand Cricket's one test wonders: Bruce Morrison". NZ Herald. Retrieved 26 October 2021.

బాహ్య లింకులు

మార్చు