బ్రెంట్ ఆర్నెల్
బ్రెంట్ జాన్ ఆర్నెల్ (జననం 1979, జనవరి 3) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున ఆరు టెస్టులు ఆడాడు. 2006లో ప్రారంభమైన దేశీయ కెరీర్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్, వెల్లింగ్టన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బ్రెంట్ జాన్ ఆర్నెల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | టె అవముటు, న్యూజీలాండ్ | 1979 జనవరి 3|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | బిఏ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 4 అం. (1.93 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 246) | 2010 19 March - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2012 15 May - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006– | Northern DistrictsWellington Firebirds, Wellington | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 12 May |
దేశీయ కెరీర్
మార్చు2006లో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌కు తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు, కాంటర్‌బరీకి వ్యతిరేకంగా ఆడాడు. 2007-08 సీజన్‌లో స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన తర్వాత, అతను న్యూజీలాండ్ ఎ జట్టు పర్యటనకు భారతదేశానికి ఎంపికయ్యాడు.
సేథ్ రాన్స్‌తోపాటు, ఇతను వెల్లింగ్‌టన్ ఫైర్‌బర్డ్స్[1] తరపున ఆడుతూ పదిహేను అవుట్‌లతో 2016–17 సూపర్ స్మాష్‌లో ఉమ్మడి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
అంతర్జాతీయ కెరీర్
మార్చు2009లో, ఇంగ్లండ్ లయన్స్‌పై విజయం సాధించిన తర్వాత న్యూజీలాండ్ టెస్ట్ జట్టులోకి వచ్చాడు. 2009-10లో న్యూజీలాండ్‌లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా గాయపడిన ఆటగాడి స్థానంలో మళ్ళీ వచ్చాడు, కానీ ఆడేందుకు ఎంపిక కాలేదు. చివరకు 2010, మార్చి 19న వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Records: Super Smash, 2016/17 Most wickets". ESPNcricinfo. Retrieved 7 January 2017.
- ↑ "Scorecard: 1st Test: New Zealand v Australia at Wellington, 19–23 March 2010". ESPNcricinfo. Retrieved 19 March 2010.