బ్లడీ మేరీ 2022లో తెలుగులో విడుదలైన థ్రిల్లర్‌ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మొండేటి చందు దర్శకత్వం వహించాడు. నివేదా పేతురాజ్, అజయ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఏప్రిల్ 15న ఆహా ఓటీటీలో విడుదలైంది.[1]

బ్లడీ మేరీ
బ్లడీ మేరీ.jpg
దర్శకత్వంమొండేటి చందు
రచనప్రశాంత్ కుమార్ దిమ్మల
నిర్మాతటీజీ విశ్వప్రసాద్
నటవర్గం
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
కూర్పువిప్లవ్ నైషధం
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
పంపిణీదారులుఆహా
విడుదల తేదీలు
2022 ఏప్రిల్ 15 (2022-04-15)
నిడివి
91 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

మేరీ (నివేదా పేతురాజ్) ఓ అనాథ. మరో ఇద్దరు అనాథలు అయినటువంటి బాషా (కిరీటి దామరాజు), రాజు (రాజ్ కుమార్ కాశీరెడ్డి)తో కలిసి విశాఖలో ఉంటోంది. మేరీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. బాషాకు మాటలు రావు (మూగవాడు). యాక్టర్ కావాలనేది అతడి కల. రాజుకు వినపడదు (చెవిటివాడు). కెమెరామ్యాన్ అవ్వాలనేది లక్ష్యం. అయితే అనుకోని విధంగా ఈ ముగ్గురు ఒక్కో హత్య కేసుల్లో ఇరుక్కుంటారు. అయితే వీరి జీవితాల్లో ఎదురైన ఈ షాకింగ్ సీరియల్ హత్యలకి కారణం ఎవరు? ఈ సమస్య నుంచి వారు బయట పడ్డారా లేదా, చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
  • నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
  • కథ: ప్రశాంత్ కుమార్ దిమ్మల
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మొండేటి చందు
  • సంగీతం: కాల భైరవ
  • సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

మూలాలుసవరించు

  1. 10TV (4 April 2022). "డేట్ ఫిక్స్ చేసుకున్న బ్లడీ మేరీ.. ఎప్పుడంటే..? | Bloody Mary Locks OTT Release Date" (in telugu). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. Eenadu (19 April 2022). "రివ్యూ: బ్లడీ మేరీ". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  3. NTV (15 April 2022). "టైమ్ పాస్ మేరీ!". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.

బయటి లింకులుసవరించు