భగవద్గీత (సంస్కృత సినిమా)

జి.వి.అయ్యర్ దర్శకత్వంలో 1993లో విడుదలైన సంస్కృత సినిమా

భగవద్గీత, 1993 సెప్టెంబరు 17న విడుదలైన సంస్కృత సినిమా.[1] టి. సుబ్బరామి రెడ్డి నిర్మాణంలో జి.వి.అయ్యర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భగవద్గీత పుస్తకం ఆధారంగా రూపొందించబడింది.[2] ఇందులో నీనా గుప్తా, గోపి మనోహర్, జి. వి. రాఘవేంద్ర తదితరులు నటించారు.

భగవద్గీత
దర్శకత్వంజి.వి.అయ్యర్
రచనబన్నంజే గోవిందచార్య
జివి అయ్యర్
దీనిపై ఆధారితంభగవద్గీత
నిర్మాతటి. సుబ్బరామి రెడ్డి
తారాగణంనీనా గుప్తా
గోపి మనోహర్
జి. వి. రాఘవేంద్ర
ఛాయాగ్రహణంమధు అంబట్
కూర్పుశ్రీ నంజుందస్వామి
సంగీతంమంగళంపల్లి బాలమురళీకృష్ణ
విడుదల తేదీ
1993 సెప్టెంబరు 17
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషసంస్కృతం

కథా నేపథ్యం

మార్చు

పూలతో శివలింగం పూజించే సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు, తన రథసారథి శ్రీ కృష్ణుడు ఉన్నారు. ఇద్దరి మధ్య సంభాషణలతో భగవద్గీత ప్రారంభమవుతంది. అందులోని శ్లోకాలతో కాంప్లిమెంటరీ ఇమేజరీ, ప్రకృతిలో ఉన్న అనేక దృశ్యాలు చూపబడుతాయి. చివరికి అర్జునుడు హిమాలయాల మధ్య మేఘాలపైన నిలబడి, కృష్ణుడు పాడిన పద్యాలతోపాటు గ్రహాలు దాటి విశ్వంలోకి మరింతగా పెరుగుతాడు.

నటవర్గం

మార్చు
  • నీనా గుప్తా
  • గోపి మనోహర్
  • జి. వి. రాఘవేంద్ర
  • గోవింద్ రావు
  • సూర్య మోహన్ కులశ్రేష్ఠ

హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా ప్రదర్శన జరిగింది.[3] 1993లో జరిగిన 40వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.[4][5][6]

మూలాలు

మార్చు
  1. "Bhagavathgeetha (1993)". Indiancine.ma. Retrieved 2021-06-19.
  2. "Bhagavad Gita summary". sites.google.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-19.
  3. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 3 April 2014. Retrieved 2021-06-19.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Bhagvad Gita (film) G V Iyer". IMDb. Retrieved 2021-06-19.
  5. "40th National Film Awards". India International Film Festival. Archived from the original on 2 June 2016. Retrieved 2021-06-19.
  6. "40th National Film Awards (PDF)" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 2016-03-09. Retrieved 2021-06-19.

బయటి లింకులు

మార్చు