భరత్‌పూర్ (రాజస్థాన్)
భరత్‌పూర్, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక నగరం. భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీకి దక్షిణాన 180 కి.మీ. (110 మైళ్లు), రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి 178 కి.మీ. (111 మైళ్లు), ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకు పశ్చిమాన 55 కి.మీ (34మైళ్లు), ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నుండి 38 కి.మీ. (24 మైళ్లు) దూరంలో ఉంది.ఇది భరత్‌పూర్ జిల్లాకు, విభాగానికి పరిపాలనా ప్రధాన కేంద్రం.భరత్‌పూర్ భారతదేశ జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సిఆర్) లో ఒక భాగం.[2] పూర్వపు ఈ నగరం భరత్‌పూర్ రాజ్యానికి రాజధాని.2014 లో 65 వార్డులతో నగరపాలక సంస్థగా మారింది.[3][4][5]
భరత్‌పూర్ లోహాగర్ | |
---|---|
![]() లక్ష్మీ ప్యాలెస్ | |
ముద్దుపేరు(ర్లు): లోహాగర్ | |
నిర్దేశాంకాలు: 27°13′N 77°29′E / 27.22°N 77.48°ECoordinates: 27°13′N 77°29′E / 27.22°N 77.48°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | భరత్‌పూర్ |
స్థాపించిన వారు | భరత్ |
పేరు వచ్చినవిధం | భరత్- ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఒక చారిత్రక యోధుడు |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | నగరపాలక సంస్థ |
• నిర్వహణ | భరత్‌పూర్ నగరపాలక సంస్థ |
సముద్రమట్టం నుండి ఎత్తు | 183 మీ (600 అ.) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 252,838 |
భాషలు | |
• అధికార | హిందీ , ఆంగ్లం |
కాలమానం | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్‌కోడ్ | 321001 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | (+91) 5644 |
ISO 3166 కోడ్ | RJ-IN |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | RJ-05 |
జాలస్థలి | http://bharatpur.rajasthan.gov.in |
ఇది సముద్రమట్టానికి 183 మీ (600 అడుగులు) సగటు ఎత్తులో ఉంది. దీనిని "తూర్పు గేట్వే టు రాజస్థాన్" అని కూడా పిలుస్తారు. భరత్‌పూర్కోటను "లోహాగఢ్" అని పిలుస్తారు.[6]
చరిత్రసవరించు
భరత్‌పూర్ రాచరిక రాష్ట్రమైన భరత్‌పూర్ రాజధాని. భరత్‌పూర్ నగరం 19 వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారి ముట్టడికి గురైంది.రాజ్‌పుతానాలు బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి రాచరిక రాష్ట్రాలలో ఇది ఒకటి.
జనాభా గణాంకాలుసవరించు
భరత్‌పూర్ నగరాన్ని భరత్‌పూర్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోకి వచ్చే మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం భరత్‌పూర్ నగర జనాభా 252,342 మంది కాగా, వారిలో పురుషులు 133,780 ఉండగా, స్త్రీలు 118,562 మంది ఉన్నారు. భరత్‌పూర్ నగరంలో 252,342 జనాభా ఉన్నప్పటికీ; దాని పట్టణ / మెట్రోపాలిటన్ పరిధి జనాభా 252,838, ఇందులో 134,040 మంది పురుషులు, 118,798 మంది మహిళలు ఉన్నారు.[7]
జనాభా పెరుగుదల చార్టుసవరించు
సంవత్సరం | జనాభా |
---|---|
1891 | 43,000
|
1911 | 44,000
|
1941 | 35,500
|
1951 | 37,300
|
1961 | 49,800
|
1971 | 69,400
|
1981 | 1,05,200
|
1991 | 1,56,900
|
2001 | 2,05,235
|
2011 | 2,52,838
|
2014 | 3,20,559
|
ఇది కూడ చూడుసవరించు
ప్రస్తావనలుసవరించు
- ↑ "Rajasthan (India): State, Major Agglomerations & Cities – Population Statistics, Maps, Charts, Weather and Web Information". citypopulation.de. Retrieved 1 January 2021.
- ↑ "NCR expanded to include Bhiwani, Bharatpur". The Hindu. Chennai, India. 2 July 2013.
- ↑ "Bharatpur to be a Municipal Corporation". Business Standard. Jaipur, India. 19 Feb 2014.
- ↑ "Vasundhara's cabinet decides to make Bharatpur a Municipal Corporation". News 18. Jaipur, India. 19 Feb 2014.[permanent dead link]
- ↑ "Rajasthan Govt to Make Bharatpur a Municipal Corporation". Outlook India. Jaipur, India. 19 Feb 2014.
- ↑ "Bharatpur – Eastern Gateway to Rajasthan". Archived from the original on 5 October 2013.
- ↑ "Bharatpur City Population Census 2011-2021 | Rajasthan". www.census2011.co.in. Retrieved 2021-02-27.