భరత్ భూషణ్ బత్రా

హర్యానా రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు

భరత్ భూషణ్ బత్రా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రోహ్తక్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

భరత్ భూషణ్ బత్రా

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
24 అక్టోబర్ 2019
ముందు మనీష్ గ్రోవర్
నియోజకవర్గం రోహ్తక్
పదవీ కాలం
2009 – 2014
ముందు షాదీ లాల్ బత్రా
తరువాత మనీష్ గ్రోవర్
నియోజకవర్గం రోహ్తక్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-05-04) 1952 మే 4 (వయసు 72)
కలనౌర్, తూర్పు పంజాబ్ (ప్రస్తుతం హర్యానా ), భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి నీలం బాత్రా
సంతానం 1
నివాసం శక్తి నగర్, రోహ్తక్ , హర్యానా

రాజకీయ జీవితం

మార్చు

భరత్ భూషణ్ బత్రా తన తండ్రి షాదీ లాల్ బాత్రా అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2009 శాసనసభ ఎన్నికలలో రోహ్తక్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మనీష్ గ్రోవర్‌పై 19,595 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి మనీష్ గ్రోవర్ చేతిలో 11,132 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

భరత్ భూషణ్ బత్రా 2019 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మనీష్ గ్రోవర్‌పై 2,735 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి మనీష్ గ్రోవర్‌ చేతిలో 1,341 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. TV9 Bharatvarsh (8 October 2024). "Rohtak Vidhan Sabha Seat 2024 Results: रोहतक में कांग्रेस की विजय, काउंटिंग के अंत तक बढ़ी रहीं धड़कनें, आखिरी राउंड में भारत भूषण ने पलटी बाजी". Retrieved 4 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  3. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. TimelineDaily (8 October 2024). "Rohtak Election Results: Congress' Bharat Bhushan Batra Wins" (in ఇంగ్లీష్). Retrieved 4 November 2024.