భరమగౌడ అలగౌడ కేగే

భరమగౌడ అలగౌడ కేగే లేదా రాజు కేజ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కాగ్వాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

రాజు కేగే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023
ముందు శ్రీమంత్ పాటిల్
నియోజకవర్గం కాగ్వాడ్
పదవీ కాలం
2000 – 2018
ముందు పసగౌడ ఉర్ఫ్ పోపట్ అప్పగోడ పాటిల్
తరువాత శ్రీమంత్ పాటిల్
నియోజకవర్గం కాగ్వాడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1958-05-21) 1958 మే 21 (వయసు 66)[1]
కుడాచి , బెల్గాం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్(2019–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు బీజేపీ
(2003–2019), జేడీయూ
(1999–2003), స్వతంత్ర (1998–1999), జనతాదళ్ (1988–1998), జనతా పార్టీ
(1988 వరకు)
నివాసం సిద్దేశ్వర నగారా, ఉగర్ ఖుర్ద్ , బెలగావి జిల్లా , కర్ణాటక, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

రాజు కేగే 1983లో శాసనసభ ఎన్నికలలో జనతా పార్టీ అభ్యర్థిగా అథని నుండి పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన పవార్ దేశాయ్ సిధరాజ్ చేతిలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 1993లో గ్రామపంచాయతీ సభ్యుడు ఎన్నికై 1995లో బెలగావి జిల్లా పంచాయతీకి ఎన్నికయ్యాడు. రాజు కేగే 1999 శాసనసభ ఎన్నికలలో కాగ్వాడ్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన పసగౌడ ఉర్ఫ్ పోపట్ అప్పగోడ పాటిల్ చేతిలో ఓడిపోయాడు. ఆయన 2000 కర్నాటక శాసనసభ ఉప ఎన్నికలో జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థిగా కగ్వాడ్ నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజు కేగే అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి 2004, 2008, 2013లో వరుసగా కగ్వాడ్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై 2018 శాసనసభ ఎన్నికలలో, 2019 కర్ణాటక శాసనసభ ఉప ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన శ్రీమంత్ పాటిల్ చేతిలో ఓడిపోయాడు. రాజు కాగే 2019లో బీజేపీని వీడి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి,[3] 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇదో సరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. https://entranceindia.com/election-and-politics/bharamgoud-alagoud-kage-member-of-legislative-assembly-mla-karnataka/ Educational Details
  2. Deccan Herald (2019). "Siddaramaiah appoints 34 MLAs as chiefs to boards & corporations" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  3. Deccan Herald (15 November 2019). "BJP's Raju Kage joins Congress" (in ఇంగ్లీష్). Retrieved 18 November 2024.
  4. Hindustantimes (14 May 2023). "Karnataka assembly election 2023: Constituency-wise full list of winners from BJP, Cong, JD(S)". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  5. TV9 Kannada (13 May 2023). "Kagawad Election Results: ಕಾಗವಾಡ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರ ಎಲೆಕ್ಷನ್ 2023 ರಿಸಲ್ಟ್: ಕಾಂಗ್ರೆಸ್​ನ ರಾಜು ಕಾಗೆಯನ್ನು ಸೋಲಿಸಿದ ಶ್ರೀಮಂತ್ ಪಾಟೀಲ". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024. {{cite news}}: zero width space character in |title= at position 83 (help)CS1 maint: numeric names: authors list (link)