విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(భవానీపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం ఒకటి.దీనిని భవానీపురం నియోజకవర్గం అని వాడుకలో వ్యవహరిస్తారు.

నియోజకవర్గంలోని ప్రాంతాలుసవరించు

  • విజయవాడ పట్టణ మండలం-విజయవాడ పట్టణ మండల పరిధిలో విజయవాడ ఒక పట్టణం మాత్రమే కలిగి ఉంది.అందువల్ల ఇది పూర్తిగా పట్టణ మండలం.విజయవాడ పట్టణ మండలాన్ని పరిపాలనా సౌలభ్యంకోసం 4 విభాగాలుగా విభజించారు.
    1. విజయవాడ తూర్పు
    2. విజయవాడ సెంట్రల్
    3. విజయవాడ నార్త్
    4. విజయవాడ వెస్ట్
  • విజయవాడ కార్పోరేషన్‌లోని కొన్ని వార్డులు - విజయవాడ నగరపాలక సంస్థ పాక్షికం - వార్డులు 1 నుండి 13 వరకుగల వార్డులు,18, 19, 76, 77, 78 వార్డులు

విజ్ఞానకేంద్రంసవరించు

  • భవానీపురంలో అన్ని విధాలైన ఆధునిక వసతులతో 15 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో అందంగా, విజ్ఞానశాస్త్రంలో విద్యార్థులకు అవగాహన కలగించేందుకు ఒక విజ్ఞానకేంద్రం నిర్మించారు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 జలీల్ ఖాన్ పు వై.కా.పా 63180 వెల్లంపల్లి శ్రీనివాసరావు పు భాజపా 60072
2009 వెల్లంపల్లి శ్రీనివాసరావు M ప్రజారాజ్యం 51467 మల్లికా బేగం F కాంగ్రెస్ 43125
2004 షేక్ నాసర్ వలి M సి.పి.ఐ 62365 ఎం.కే.బేగ్ M కాంగ్రెస్ 35846
1999 జలీల్ ఖాన్ M కాంగ్రెస్ 52837 నాగుల్ మీరా M తె.దే.పా 49729
1994 కాకర్లపూడి సుబ్బరాజు M సి.పి.ఐ 60369 ఎం.కే.బేగ్ M కాంగ్రెస్ 44393
1989 ఎం.కే.బేగ్ M కాంగ్రెస్ 63401 కోరగంజి చంద్రశేఖర్ రావు M సి.పి.ఐ 45201
1985 ఉప్పలపాటి రామచంద్ర రాజు M సి.పి.ఐ 51249 ఎం.కే.బేగ్ M కాంగ్రెస్ 43948
1983 బి.ఎస్. జయరాజు M ఇతరులు 35449 ఉప్పలపాటి రామచంద్ర రాజు M సి.పి.ఐ 33911
1978 పోతిన చిన్న M కాంగ్రెస్

(I)

33587 ముహమ్మద్ ఇమ్తియజుద్దిన్ M జనతా 29198
1972 అసిబ్ పాషా M కాంగ్రెస్ 23972 తమ్మిన పోతరాజు M ఇతరులు 20007
1967 చిట్టి M కాంగ్రెస్ 26295 తమ్మిన పోతరాజు M సి.పి.ఐ 23747
1962 తమ్మిన పోతరాజు M సి.పి.ఐ
1957 మారుపిల్ల చిట్టి M కాంగ్రెస్
1953 తమ్మిన పోతరాజు M సి.పి.ఐ

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు