భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

ఒక ఎక్స్‌ప్రెస్ రైలు

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (Bhagyanagar Express) భారతీయ రైల్వేలు నడిపిస్తున్న ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్, మహారాష్ట్ర లోని బల్హార్షా స్టేషన్ల మధ్య నడుస్తుంది. తేది:1 జనవరి 2004వ తేదీన ప్రవేశపెట్టబడినది. హైదరాబాద్ యొక్క మరో పేరైన భాగ్యనగరం పేరుమీద నామకరణం చేయబడినది. ఇది దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో నడుస్తుంది.

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
Bhagyanagar express
ఘటకేసర్ వద్ద భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్.
సారాంశం
రైలు వర్గంSuperfast Express train
స్థానికతతెలంగాణ & మహారాష్ట్ర
తొలి సేవ1 జనవరి 2004
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుసికింద్రాబాద్ జంక్షన్
ఆగే స్టేషనులు32
గమ్యంబల్హార్షా
ప్రయాణ దూరం367 km (228 mi)
సగటు ప్రయాణ సమయం9 గంటల 35 నిమిషాలు
రైలు నడిచే విధంDaily
సదుపాయాలు
శ్రేణులు1 AC chair car, 3 second class sitting, 14 general, 3 SLR
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుNo
ఆహార సదుపాయాలుYes
సాంకేతికత
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
వేగం38 km/h (24 mph) average with halts
మార్గపటం
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

రైలు సంఖ్య మార్చు

సికింద్రాబాద్ జంక్షన్ నుండి బల్హార్షా కు వెళ్లు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ సంఖ్య 17233 కాగా; బల్హార్షా నుండి సికింద్రాబాద్ జంక్షన్ కు వెళ్లు రైలు బండి సంఖ్య 17234.

రైలుమార్గం మార్చు

ఈ రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుండి 15:25 గంటలకు బయలుదేవి బల్హార్షా మరునాడు 01:00 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో బల్హార్షా నుండి 02:10 గంటలకు బయలుదేవి సికింద్రాబాద్ జంక్షన్ అదే రోజు 10:45 గంటలకు చేరుతుంది. ఇది మార్గంలో భువనగిరి, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్ నగర్ స్టేషన్లలో ఆగుతుంది.

భోగీల సర్దుబాటు మార్చు

ఈ రైలు భోగీలను గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (17201/17202), సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240/17239) లతో పంచుకొంటుంది.

ఇంజను మార్చు

ఈ రైలు సాధారణంగా లల్లాగూడ కు చెందిన డబ్లూ.ఎ.పి.-4 ఇంజనుతో నడపబడుతున్నది.

తరగతులు మార్చు

ఈ రైలుకు 21 భోగీలు ఉంటాయి. ఇందులో 1 AC చైర్ కారు, 3 రెండవ తరగతి సీటింగ్ భోగీలు, 14 సాధారణ భోగీలు, 3 స్లీపర్ భోగీలు ఉన్నాయి.

మూలాలు మార్చు

  • "17233/Bhagyanagar Express". India Rail Info.
  • "17234/Bhagyanagar Express". India Rail Info.