భాగ్యశ్రీ థిప్సే

భారతీయ మహిళా చెస్ కీర్థకారిని

భాగ్యశ్రీ థిప్సే (జననం 1961 ఆగస్టు 4) ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ బిరుదును కలిగిన భారతీయ చెస్ క్రీడాకారిణి.[1]

భాగ్యశ్రీ థిప్సే
పూర్తి పేరుభాగ్యశ్రీ సాఠే థిప్సే
దేశంభారతదేశం
పుట్టిన తేది(1961-08-04)1961 ఆగస్టు 4
టైటిల్ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్
ర్యాంకింగ్15981 యాక్టీవ్ (1961)

కెరీర్ మార్చు

ఆమె 1985 (నాగ్‌పూర్), 1986 (జలంధర్), 1988 (కురుక్షేత్ర), 1991 (కోజికోడ్), 1994(బెంగళూరు)లలో ఐదుసార్లు భారతీయ మహిళల ఛాంపియన్‌షిప్‌ టైటిల్ సాధించింది. 1991లో భోపాల్ లో ఆసియా మహిళల ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.[2] 1984లో ఆమె బ్రిటిష్ లేడీస్ ఛాంపియన్‌షిప్‌లో వాసంతి ఉన్నితో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది.[3][4] ఆమె మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2000లో పోటీ పడింది. అయితే మొదటి రౌండ్‌లో పెంగ్ జావోకిన్(Peng Zhaoqin) చేతిలో ఓడిపోయింది.

ఆమె ప్రస్తుతం ముంబైలోని ఐడీబీఐ(IDBI Bank)లో ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తోంది.

వ్యక్తిగతం మార్చు

చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రవీణ్ థిప్సేతో వివాహమైన తర్వాత ఆమె తన పేరును భాగ్యశ్రీ సాఠే థిప్సేగా మార్చుకుంది.[5]

పురస్కారాలు మార్చు

ఆమెను భారతప్రభుత్వం 1987లో పద్మశ్రీ పురస్కారం, అర్జున అవార్డులతో సత్కరించింది.

మూలాలు మార్చు

  1. "Thipsay, Bagyashree Sathe". web.archive.org. 2023-04-03. Archived from the original on 2023-04-03. Retrieved 2023-04-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. D.K. Bharadwaj (2003-05-13). "A big boom in the brain game". Press Information Bureau, Government of India.
  3. "Barua Finishes Third". ChessMate. October 1991. Archived from the original on 2004-11-24. Retrieved 1 March 2016.
  4. "British Champions 1904 – present". The English Chess Federation. Archived from the original on 26 June 2018. Retrieved 1 March 2016.
  5. "Bhagyashree is queen again". The Hindu. 2003-06-06. Archived from the original on 2014-03-20. Retrieved 2014-03-24.