భారతదేశపు కొనలు

భారతదేశంలో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరల్లో అత్యంత చివరన ఉండే బిందువులు, అలాగే దేశంలో సముద్రమట్టం నుండి అత్యంత ఎత్తైన, అత్యంత లోతైన బిందువులే భారతదేశపు కొనలు. దేశానికి ఉత్తరాన ఉన్న కొన, భారత, పాకిస్తాన్ల మధ్య నున్న వివాదాస్పదమైన భూభాగంలో, పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. భారతదేశ ప్రధాన భూభాగంలో అత్యంత దక్షిణాన ఉన్న కన్యాకుమారి (కేప్ కొమోరిన్) మినహా, ఇతర దిశల్లో ఉన్న కొనల్లో ఎక్కడా జనావాసాలు లేవు.

అన్ని నిర్దేశాంకాల మ్యాపును చూడండి: OpenStreetMap 
నిర్దేశాంకాలను ఈ విధంగా దింపుకోండి: KML

ఈ బిందువుల అక్షాంశ, రేఖాంశాలను దశాంశ డిగ్రీ సంజ్ఞామానంలో చూపించాం. పాజిటివు అక్షాంశ విలువ ఉత్తరార్ధగోళాన్ని సూచిస్తుంది, నెగటివు విలువ దక్షిణార్ధగోళాన్ని సూచిస్తుంది. అదేవిధంగా, పాజిటివు రేఖాంశ విలువ తూర్పు అర్ధగోళాన్ని సూచించగా, నెగటివు విలువ పశ్చిమార్ధగోళాన్ని సూచిస్తుంది. ఈ వ్యాసంలో ఉపయోగించిన నిర్దేశాంకాలు WGS84 జియోడెటిక్ రిఫరెన్స్ వ్యవస్థను ఉపయోగించుకునే Google Earth నుండి తీసుకున్నాం. సముద్రమట్టం నుండి ఎత్తు విలువ నెగటివుగా ఉంటే, అది సముద్ర మట్టం కంటే దిగువన ఉన్న బిందువు (ఆ బిందువు లోతును సూచిస్తుందన్నమాట) అని అర్థం.

కొనల బిందువులు మార్చు

 
భారతదేశ మ్యాప్‌లో కొన బిందువులు

భారతదేశానికి ఉత్తర కొసన ఉన్న బిందువు, పాకిస్తాన్-ఆక్రమణలో ఉన్న గిల్గిట్-బల్టిస్తాన్ భూభాగంలో ఉంది. ఇది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగం. ఈ జాబితాలో పాక్‌ ఆక్రమణలో ఉన్న భారత భూభాగపు ఉత్తర కొనను, పాకిస్తాన్ వివాదాస్పదం చేసిన భారత పాలనలో ఉన్న ఉత్తర కొసను, భారతదేశంలో వివాదరహిత ఉత్తర కొసను - ఈ మూడింటినీ - చూడవచ్చు. అత్యంత ఎత్తైన బిందువులకు కూడా ఇలాగే చూపిస్తుంది.

భారతదేశానికి అత్యంత తూర్పున ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్రంలోని కొంత భాగాన్ని టిబెట్ అటానమస్ రీజియన్‌లో భాగమంటూ చైనా క్లెయిమ్ చేస్తోంది. భారత-పాలనలో ఉన్న భూభాగానికి అత్యంత తూర్పు బిందువు ఈ వివాదాస్పద ప్రాంతంలో ఉంది. [1] పర్యవసానంగా, ఈ జాబితా భారతదేశంలోని వివాదాస్పదమైన, వివాదరహితమైన తూర్పు బిందువులు రెంటినీ ఈ జాబితాలో చూపించాం.

శీర్షిక స్థానం ప్రస్తుత పాలనా ప్రాంతం సరిహద్దుకు ఆవలి ప్రాంతం నిర్దేశాంకాలు [nb 1] రెఫ్(లు)
ఉత్తరం
(వివాదాస్పదం, భారత పాలన)
సియాచిన్ గ్లేసియర్ వద్ద తూర్పు ఇందిరా కల్ లడఖ్ జిన్‌జియాంగ్, చైనా 35°40′28″N 76°50′40″E / 35.674521°N 76.844485°E / 35.674521; 76.844485 (ఇందిరా కోల్ వద్ద (ఉత్తర కొస — వివాదాస్పదం, భారత పాలన)) [2]
ఉత్తరం
(వివాదాస్పదమైనది, దావా వేయబడింది)
జింజియాంగ్ - గిల్గిట్-బాల్టిస్తాన్ సరిహద్దులోని కారకోరం పర్వతాలలో కిలిక్ పాస్‌కు తూర్పున గిల్గిత్-బాల్టిస్తాన్, పాకిస్తాన్ జిన్‌జియాంగ్, చైనా 37°05′09″N 74°42′10″E / 37.08586°N 74.70291°E / 37.08586; 74.70291 (జింజియాన్-గిల్గిట్-బల్టిస్తాన్ సరిహద్దు) [3]
ఉత్తరం (వివాదరహితం) లాహౌల్, స్పితి జిల్లాలో మియార్ లోయకు ఉత్తర చివరన ఉన్న కాంగ్ లాకు ఉత్తరం హిమాచల్ ప్రదేశ్ లడఖ్ 33°15′22″N 76°47′56″E / 33.25615°N 76.79877°E / 33.25615; 76.79877 (కాంగ్లా వద్ద (ఉత్తర కొన — వివాదరహితం)) [4]
దక్షిణ నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ ద్వీపానికి దక్షిణ కొసన ఉన్న ఇందిరా పాయింట్ అండమాన్, నికోబార్ దీవులు హిందు మహా సముద్రం 6°44′48″N 93°50′33″E / 6.74678°N 93.84260°E / 6.74678; 93.84260 (ఇందిరా పాయింట్ (దక్షిణ కొన)) [5]
దక్షిణ (ప్రధాన భూభాగం) కన్యాకుమారి సమీపంలోని కేప్ కొమోరిన్ తమిళనాడు హిందు మహా సముద్రం 8°04′08″N 77°33′08″E / 8.06890°N 77.55230°E / 8.06890; 77.55230 (కేప్ కామోరిన్ (దక్షిణ కొన — ప్రధాన భూభాగం)) [6] [7]
తూర్పు
(వివాదాస్పదం, భారత పాలన)
డాంగ్‌కు ఆగ్నేయం ( అంజా జిల్లాలో కిబితుకు ముందు) అరుణాచల్ ప్రదేశ్ కచిన్ రాష్ట్రం, మయన్మార్ 28°00′42″N 97°23′44″E / 28.01168°N 97.39564°E / 28.01168; 97.39564 (కిబితు వద్ద (తూర్పు కొన — వివాదాస్పదం, భారత పాలన)) [6] [8]
తూర్పు (వివాదరహితం) చౌకన్ పాస్, చాంగ్లాంగ్ జిల్లాలోని విజయనగర్‌కు తూర్పున అరుణాచల్ ప్రదేశ్ కచిన్ రాష్ట్రం, మయన్మార్ 27°08′10″N 97°09′57″E / 27.13611°N 97.16575°E / 27.13611; 97.16575 (విజయనగర్ వద్ద (తూర్పు కొస — వివాదరహితం)) [9]
పశ్చిమం కచ్ జిల్లాలో సర్ క్రీక్ గుజరాత్ సింధు నది డెల్టా, సింధ్, పాకిస్తాన్ 23°37′34″N 68°11′39″E / 23.6261°N 68.1941°E / 23.6261; 68.1941 (ఘువర్ మోటా (పశ్చిమ కొన)) [10]

సముద్రమట్టం నుండి ఎత్తులు మార్చు

విపరీతము పేరు ఎత్తు స్థానం రాష్ట్రం కోఆర్డినేట్లు రెఫ్(లు)
అత్యంత ఎత్తైన బిందువు

(వివాదరహిత)

కాంచన్‌జంగా 8,586 m (28,169 ft) భారతదేశం-నేపాల్ సరిహద్దులో తూర్పు హిమాలయాలు సిక్కిం
అత్యంత ఎత్తైన బిందువు (వివాదాస్పదమైనది) K2 8,611 m (28,251 ft) గిల్గిట్-బాల్టిస్తాన్ (పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది), జిన్‌జియాంగ్ (చైనా) మధ్య సరిహద్దులో ఉన్న కారకోరం గిల్గిత్-బాల్టిస్తాన్, పాకిస్తాన్ [6]
అత్యంత ఎత్తైన బిందువు
(వివాదరహితమైనది, పూర్తిగా భారతదేశంలో ఉన్నది)
నందా దేవి 7,816 m (25,643 ft) గఢ్వాల్ హిమాలయాలు ఉత్తరాఖండ్ [6]
అత్యంత లోతైన బిందువు కుట్టనాడ్ −2.2 m (−7.2 ft) అలప్పుళ జిల్లా కేరళ [11]

ఇవి కూడా చూడండి మార్చు

  • భారతదేశ సరిహద్దులు
  • భారతదేశ భౌగోళికం
  • ఆసియా కొన బిందువులు
  • భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి
  • భారతదేశం లోని వివాదాస్పద భూభాగాల జాబితా
  • భారతదేశపు రూపురేఖలు

గమనికలు మార్చు

  1. Coordinates obtained from Google Earth. Google Earth makes use of the WGS84 geodetic reference system.

మూలాలు మార్చు

  1. "Why China claims Arunachal Pradesh". Rediff.com. 2006-11-16. Archived from the original on 2008-06-17. Retrieved 2008-09-11.
  2. "Google Maps (Jammu and Kashmir)". Google. Archived from the original on 2014-06-14. Retrieved 2014-05-11.
  3. "Google Maps (Gilgit-Baltistan)". Google. Retrieved 2017-11-17.
  4. "Google Maps (Himachal Pradesh)". Google. Retrieved 2008-09-11.
  5. "Google Maps (Kashmir)". Google. Retrieved 2008-09-11.
  6. 6.0 6.1 6.2 6.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; manorama అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. "Google Maps (Tamil Nadu)". Google. Retrieved 2008-09-11.
  8. "Google Maps (Arunachal Pradesh)". Google. Retrieved 2008-09-11.
  9. "Google Maps (Arunachal Pradesh)". Google. Retrieved 2008-09-11.
  10. "Google Maps (Gujarat)". Google. Retrieved 2008-09-11.
  11. Suchitra, M (2003-08-13). "Thirst below sea level". The Hindu. Archived from the original on 2019-09-22. Retrieved 2014-05-11.