భారతమాత దేవాలయం
భారతమాత దేవాలయం భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గల వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం ప్రాంగణంలో ఉంది. సంప్రదాయ దేవతల విగ్రహాలకు బదులుగా, ఈ ఆలయంలో పాలరాతితో చెక్కబడిన అఖండ భారతదేశ భారీ శిల్పం ఉంది. ఈ దేవాలయంలోని ప్రధాన ఆరాధ్య దైవం భారత మాత కాబట్టి దీన్ని భారత మాతకు అంకితం చేయబడింది. ప్రపంచంలోని భారత మాతకు చెందిన దేవాలయాలలో ఇదే మొట్టమొదటిది.[1][2][3][4]
భారతమాత దేవాలయం | |
---|---|
भारत माता मंदिर | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 25°19′02″N 82°59′21″E / 25.317209°N 82.989291°E |
దేశం | Indiaభారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | వారణాసి |
ప్రదేశం | మహాత్మాగాంధీ విద్యాపీఠం, వారణాసి |
ఎత్తు | 83.67 మీ. (275 అ.) |
సంస్కృతి | |
దైవం | భారతమాత |
ముఖ్యమైన పర్వాలు | స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర దినోత్సవం |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 1936 |
సృష్టికర్త | శివప్రసాద్ గుప్త |
చరిత్ర
మార్చు1936లో స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ శివప్రసాద్ గుప్తా చేత నిర్మించబడిన భారత మాతా మందిరాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించాడు. ఈ ఆలయం మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం ప్రాంగణంలో నిర్మించబడింది.[1][2]
నిర్మాణం
మార్చుభారత మాత మందిరం రాతితో నిర్మించబడింది. ఇది అవిభాజ్య భారతదేశానికి ప్రతీకగా పాలరాతితో నిర్మించిన భారత మాత విగ్రహాన్ని కలిగి ఉంది. ఈ ఆలయంలో పాలరాతితో చెక్కబడిన భారతదేశం రిలీఫ్ మ్యాప్ కూడా ఉంది. మ్యాప్ లో పర్వతాలు, మైదానాలు, మహాసముద్రాలు గుర్తించబడ్డాయి.[5]
వివిధ ప్రదేశాల నుండి దూరం
మార్చుభారత మాత మందిరం మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం ఆవరణలో ఉంది. వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్‌కు దక్షిణంగా 1.5 కిలోమీటర్ల దూరంలో, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉత్తరాన ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి సమీపంలో ఈ భారత మాత ఆలయం ఉంది.[6]
చిత్రాలు
మార్చు-
ఆలయంలోని భారతదేశ పటం
-
ఆలయంలోని భారతదేశ పటం
-
ఆలయంలోని భారతమాత చిత్రపటం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Bharat Mata Mandir". varanasi.org. Retrieved 3 March 2015.
- ↑ 2.0 2.1 "Bharat Mata". varanasicity.com. Retrieved 3 March 2015.
- ↑ "LP". Lonely Planet. Retrieved 3 March 2015.
- ↑ "Temple news". The Times of India. Retrieved 3 March 2015.
- ↑ Karkar, S.C. (2009). The Top Ten Temple Towns of India. Kolkota: Mark Age Publication. p. 11. ISBN 978-81-87952-12-1.
- ↑ "Location". Google Maps. Retrieved 3 March 2015.