భారతీయ రిపబ్లికన్ పార్టీ

భారతదేశం యొక్క రాజకీయ పార్టీ

భారతీయ రిపబ్లికన్ పార్టీ (ఆంగ్లం: Republican Party of India) అనేది భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ.[1] రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) ని సాధారణంగా రిపబ్లికన్ పార్టీ అని కూడా పిలుస్తారు. ఇది బి. ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని షెడ్యూల్డ్ కులాల సమాఖ్యలో దాని మూలాలను కలిగి ఉంది.

భారతీయ రిపబ్లికన్ పార్టీ
స్థాపకులుఎన్. శివరాజ్,
యశ్వంత్ అంబేద్కర్,
పి. టి. బోరలే,
ఎ. జి. పవార్,
దత్తా కట్టి,
దాదాసాహెబ్ రూపవతే
స్థాపన తేదీ1957 అక్టోబరు 3
Preceded byషెడ్యూల్డ్ కులాల సమాఖ్య (Scheduled Castes Federation)
రాజకీయ విధానంరాజ్యాంగవాదం
రిపబ్లికనిజం
అంబేద్కరిజం
ప్రోగ్రెసివిజం
లౌకికవాదం
సమతావాదం
రంగు(లు)నీలం

1956లో బి. ఆర్. అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రవేశానికి అనువుగా ట్రైనింగ్ స్కూల్ ఫర్ ఎంట్రన్స్ టు పాలిటిక్స్ అనే పాఠశాలను స్థాపించాడు. మొదటి బ్యాచ్‌లో 15 మంది విద్యార్థులు చేరారు.[2] అయితే అదే సంవత్సరం ఆయన మరణంతో ఆ పాఠశాల మూసివేయబడింది.

చరిత్ర

మార్చు

ఇండిపెండెంట్ లేబర్ పార్టీ

మార్చు

ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP) అనేది 1936 ఆగస్టు 15న బి. ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పడిన ఒక రాజకీయ సంస్థ. దీని ప్రధాన లక్ష్యాలు బ్రాహ్మణ, పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకించడం, భారతీయ కార్మికవర్గానికి మద్దతునివ్వడం, కుల వ్యవస్థను నిర్మూలించడం మొదలైనవి.[3]

ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఏర్పాటును కమ్యూనిస్ట్ నాయకులు స్వాగతించలేదు. ఇది కార్మికవర్గ ఓట్ల చీలికకు దారితీస్తుందని వాదించారు. కమ్యూనిస్టు నాయకులు కార్మికుడి హక్కుల కోసం పనిచేస్తున్నారు కానీ దళిత కార్మికుల మానవ హక్కుల కోసం కాదని బి.ఆర్. అంబేద్కర్ అన్నారు.[4] అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే తన పుస్తకంలో కులం అనేది కేవలం 'శ్రమ విభజన' మాత్రమే కాదు, శ్రేణీకృత అసమానతపై ఆధారపడిన 'శ్రామికుల విభజన' అనే ఆలోచనను ముందుకు తెచ్చారు.[5]

1937 ప్రావిన్షియల్ ఎన్నికలలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పోటీ చేసిన 17 స్థానాల్లో 14 స్థానాలను కైవసం చేసుకుంది. సాంప్రదాయకంగా అణగారిన వర్గాలకు రిజర్వ్ చేయబడిన 13 స్థానాల్లో 11 ఉన్నాయి.[5]

ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1938లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ మద్దతుతో, కొంకణ్ ప్రాంతం నుండి బొంబాయి వరకు 20,000 మంది కౌలుదారులతో ఒక మార్చి‌ను నిర్వహించింది. ఇది ఈ ప్రాంతంలో స్వాతంత్ర్యానికి ముందు జరిగిన అతిపెద్ద రైతు సమీకరణగా గుర్తించబడింది. అదే సంవత్సరంలో కార్మికుల సమ్మె చర్యలను నియంత్రించేందుకు ఉద్దేశించిన పారిశ్రామిక వివాదాల బిల్లుకు వ్యతిరేకంగా బొంబాయి వస్త్ర కార్మికులను సంఘటితం చేసేందుకు కమ్యూనిస్టులతో కలిసి ఇది కూడా చేరింది. బొంబాయి శాసనసభలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించింది.[4]

 
1945 మే 6న బొంబాయిలో జరిగిన "ది ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ మహిళా సదస్సు" సందర్భంగా అన్నై మీనాంబాల్ శివరాజ్ (L), డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (C) రావు బహదూర్ ఎన్. శివరాజ్ (R).

షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్

మార్చు

షెడ్యూల్డ్ కులాల సమాఖ్య (SCF) అనేది దళితుల హక్కుల కోసం 1942లో బి. ఆర్. అంబేద్కర్ చేత స్థాపించబడిన ఒక సంస్థ. దీనికి ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ కార్యనిర్వాహక సంఘం ఎన్నుకోబడింది. మద్రాసు రాష్ట్రానికి చెందిన ఎన్.శివరాజ్ అధ్యక్షుడిగా, బొంబాయి రాష్ట్రానికి చెందిన పి.ఎన్.రాజ్భోజ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.[6]

బి.ఆర్. అంబేద్కర్ 1930లో డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ (DCF) ని, 1935లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP) ని స్థాపించారు.[7] షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా పరిణామం చెందింది.

భారత విభజన తర్వాత పాకిస్తాన్‌లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీ కూడా ఉంది. అది ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తరహా జాతీయవాద రాజకీయాలకు ప్రత్యామ్నాయం అని రాంనారాయణ్ రావత్ పేర్కొన్నారు.[8]

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా

మార్చు

1956 సెప్టెంబరు 30న బి.ఆర్. అంబేద్కర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ ని రద్దు చేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపనను ప్రకటించారు. కానీ పార్టీ ఏర్పాటుకు ముందు అతను 1956 డిసెంబరు 6న మరణించాడు. ఆ తర్వాత, అతని అనుచరులు, కార్యకర్తలు ఈ పార్టీని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. పార్టీని స్థాపించడానికి 1957 అక్టోబరు 1న నాగ్‌పూర్‌లో ప్రెసిడెన్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్.శివరాజ్, యశ్వంత్ అంబేద్కర్, పి.టి.బొరలె, ఎ.జి.పవార్, దత్తా కట్టి, దాదాసాహెబ్ రూపవతే పాల్గొన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 1957 అక్టోబరు 3న స్థాపించబడింది. పార్టీ అధ్యక్షుడిగా ఎన్. శివరాజ్ ఎన్నికయ్యారు.[9]

1957లో పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు రెండవ లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంబేద్కర్ పార్టీ సాధించిన అతిపెద్ద విజయం ఇదే.[10]

చీలిక సమూహాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "In Ambedkar's state, Dalit parties stare at oblivion". dna. 1 October 2014. Retrieved 5 September 2015.
  2. Dahat, Pavan (2016-07-02). "JNU scholars will revive Dr. Ambedkar's Political School". The Hindu. Retrieved 31 August 2016.
  3. Mendelsohn, Olive; Vicziany, Marik (1998). The Untouchables: Subordination, Poverty and the State in Modern India. Contemporary South Asia. Vol. 4. Cambridge University Press. p. 115. ISBN 978-0521556712.
  4. 4.0 4.1 Singh, Mahendra Prasad, ed. (2011). Indian Political Thought: Themes and Thinkers. Pearson Education India. p. 228. ISBN 978-8131758519.
  5. 5.0 5.1 Jaffrelot, Christophe (2003). India's Silent Revolution: The Rise of the Lower Castes in North India. C. Hurst & Co. Publishers. pp. 103–104. ISBN 978-1850653981.
  6. "Dr. Ambedkar and All India Scheduled Castes Federation". Archived from the original on 15 నవంబర్ 2017. Retrieved 15 November 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  7. Keane, David (2007). "Why the Hindu Caste System Presents a New Challenge for Human Rights". In Rehman, Javaid; Breau, Susan (eds.). Religion, Human Rights and International Law: A Critical Examination of Islamic State Practices. BRILL. p. 283. ISBN 978-9-04742-087-3.
  8. Rajan, Nalini (1974). Practising journalism: values, constraints, implications.
  9. Khobragade, Fulchand (2014). Suryaputra Yashwantrao Ambedkar (in మరాఠీ). Nagpur: Sanket Prakashan. pp. 20, 21.
  10. "विचारधारेपासून दुरावणारी आंबेडकरी चळवळ".