భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ

భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ భారత ప్రభుత్వ ఆద్వర్యం లో నిర్వహింపబడుతున్న ఒక స్వతంత్ర సంస్థ.దీనికికేంద్ర రోడ్డు రవాణా, ప్రధాన రహదారులు మంత్రిత్వ శాఖ ఒక నోడల్ సంస్థగా వ్యవహిరిస్తున్నది.ఇవి భారతదేశంలో ప్రధాన నగరాలు, రాష్టాల రాజధానులు, ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలు, రేవు పట్టణాలను కలుపుతు నిర్మింపబడ్డాయి.

భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ
200px
Logo
India roadway map.svg
India National Highways Map
సంకేతాక్షరంNHAI
స్థాపన1988[1]
రకంస్వతంత్ర సంస్థ
చట్టబద్ధతఉంది
కేంద్రీకరణజాతీయ రహదారులు అభివృద్ధి, నిర్వహణ
ప్రధాన కార్యాలయాలుG 5&6
కార్యస్థానం
భౌగోళికాంశాలుCoordinates: 28°35′01″N 77°03′28″E / 28.583689°N 77.057886°E / 28.583689; 77.057886
సేవా ప్రాంతాలు India
ChairmanDeepak Kumar, IAS[2]
ప్రధానభాగంBoard of directors[3]
Parent organisationకేంద్ర రోడ్డు రవాణా, ప్రధాన రహదారులు మంత్రిత్వ శాఖ
జాలగూడుwww.nhai.gov.in
via Arun Ganesh
[4] Rationalization of Numbering Systems of National Highway of India
Headquarters of the NHAI at Sector 10, Dwarka in New Delhi, India

చరిత్రసవరించు

భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థను భారత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో  "భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ చట్టం 1988" ప్రకారం ఏర్పాటుచేసింది.ఈ సంస్థ ద్వారా జాతీయ రహదారుల నిర్వహణ, యాజమాన్య భద్యతలను నిర్వహింబడేల చట్టాన్ని రూపొందించడం జరిగింది.1995 లో దీనిని ఒక స్వతంత్ర సంస్థగా రూపొందించడం జరిగింది.జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ టోల్ గేట్ల వద్ద వసులు చేయు సొమ్ముకు బాధ్యత వహిస్తుంది.

జాతీయ రహదారుల అభివృద్ధి పధకంసవరించు

భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ "జాతీయ రహదారుల అభివృద్ధి పధకం" అమలులో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నది."జాతీయ రహదారుల అభివృద్ధి పధకం"లో దశలు

మొదటి దశసవరించు

2000 వ సంవత్సరంలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆమోదించారు. ఈ పధకంలో స్వర్ణ చతుర్భుజి", "ఉత్తర-దక్షిణ","తూర్పు-పడమర" కారిడార్లను అభివృద్ధి చేయడం ప్రధ్హన రేవు పట్టణాలను అనుసంధానించడం. ఈ దశ నిర్వాహణ కు సుమారు 30000 కోట్ల రూపాయిలను కేటాయించడం జరిగింది.

రెండవ దశసవరించు

ఈ దశను 2003 డిసెంబరు లో అమోదించడం జరిగింది. "ఉత్తర-దక్షిణ","తూర్పు-పడమర" కారిడార్లను పూర్తి చేయడంతో పాటు,మరో 486 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను విస్తరించడం ఈ దశ లక్ష్యాలు.దీని కొరకు 34300కోట్ల రూపాయిలను కేటాయించారు.

మూడవ దశ (A)సవరించు

ఈ దశను 2005 లో అమోదించడం జరిగింది.సుమారు 22200 కోట్ల రుపాయిల వ్యయంతో 4,035 కిలో మీటర్ల జాతీయ రహదారులను 4 వరుసల రహదారులుగా విస్తరించడం దీని లక్ష్యం .

మూడవ దశ(B)సవరించు

2006 ఏప్రిల్ లో ఈ దశను ఆమోదించడం జరిగింది.54300 కోట్ల రుపాయిల వ్యయంతో 8,074 కిలో మీటర్ల పొడవైన రెండు వరుసల జాతీయ రహదారులను 4 వరుసలుగా అభివృద్ధి చేయడం.

అయిదవ దశసవరించు

2006 అక్టోబరులో దీనికి ఆమోదం లభించింది.స్వర్ణ చతుర్భుజి" రహదారులను 6 వరుసల రహదారులుగా విస్తరించడం.

ఆరో దశసవరించు

1000 కిలో మీటర్ల ఎక్స్‌ప్రెస్ మార్గాలను 16700 కోట్ల రుపాయిల వ్యయంతో అభివృద్ధి చేయడం.

ఏడవ దశసవరించు

నగరాల్లో రద్ధిని తగ్గించడానికి రింగ్ రోడ్లు,ఫ్లై ఓవర్లు,బై పాస్ రోడ్ల నిర్మాణాలను నిర్మించడం.దీనికి 2007 డిసెంబరు లో 16700 కోట్ల రూపాయిల వ్యయం కు ఆమోదం లభించింది.

స్వర్ణ చతుర్భుజిసవరించు

భారత దేశం లో గల ప్రధాన నగరాలైన ఢిల్లీ,ముంబై,కోల్‌కాతా,చెన్నై లను మిగతా ప్రధాన రేవు పట్టణాలతో,ప్రధాన వాణిజ్య కేంద్రాలతో,పారిశ్రామిక ప్రాంతాలతోను అనుసంధానం చేయడానికి దీనిని ప్రారంభించారు.2001 లో ప్రారంభింపబడిన ఈ ప్రోజక్టూ ప్రపంచంలో అనాటికి నిర్మింపబడ్డ అతిపెద్ద రోడ్డు అనుసంధానాలలో అయిదవది.2001 లో ఇది ప్రారంభింపబడిన దీనిని 2012లో పూర్తి కాబడింది.

"తూర్పు-పడమర","ఉత్తర-దక్షిణ" కారిడార్లుసవరించు

భారతదేశ తూర్పు భాగంలో గల సిల్చేర్ నుండి,పడమర భారతంలో గల పోర్‌బందర్ వరకు ,ఉత్తర భారత దేశం లో గల శ్రీనగర్ నుండి ,దక్షిణ భారత దేశం లో గల కన్యా కుమారి వరకు గల జాతీయ రహదారులను 4లేదా6 వరుసల రహదారులుగా విస్తరించడం దీని లక్ష్యం.

జాతీయ రహదారుల అభివృద్ధి పధకం
దశ వివరాలు పొడవు నిర్మాణ వ్యయం ₹ ( in cr)
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం-I & II దశలు స్వర్ణ చతుర్భుజి", "ఉత్తర-దక్షిణ","తూర్పు-పడమర" కారిడార్లను పూర్తి చేయడం 13,000 km (8,100 mi) 42,000
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం-III దశ 4-వరసలు 10,000 km (6,200 mi) 55,000
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం--IV దశ 2-వరుసల 20,000 km (12,000 mi) 25,000
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం--V దశ 6-వరుసల రోడ్డు మర్గాలు (ఏంపిక చేయబడ్డ ప్రాంతాల్లో) 5,000 km (3,100 mi) 17,500
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం--VI దశ ఎక్స్‌ప్రెస్ మార్గాలను అభివృద్ధి చేయడం 1,000 km (620 mi) 15,000
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం-VII దశ రింగు రోడ్లు,బై-పాస్ రోడ్లు ఏర్పాటు చేయడం 700 km (430 mi) 15,000
మొత్తం 45,000 km (28,000 mi) 1,69,500 (Revised to 2,20,000)
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం కాల వ్యవధులు
Priority జాతీయ రహదారుల అభివృద్ధి పధకం దశ పొడవు (km) స్థితి ఆమోదం పూర్తికావలిసిన సంవత్సరం
1 మొదటి దశ 5,846 km (3,633 mi) పూర్తి కాబడింది డిసెంబరు 2000 డిసెంబరు 2006
2 రెండవ దశ 7,300 km (4,500 mi) నిర్మాణ దశలో కలదు డిసెంబర్ 2003 డిసెంబర్2009
3 మూడవ (A) 4,000 km (2,500 mi) మొదలు కాబడింది మార్చి 2005 డిసెంబర్ 2009
4 అయిదవ దశ 6,500 km (4,000 mi) 5700 km స్వర్ణ చతుర్భుజి" + 800"తూర్పు-పడమర" కారిడార్లు;km మొదలు కాబడింది నవంబరు 2005 డిసెంబరు 2012
5 మూడవ (B) 6,000 km (3,700 mi) మార్గాలు ఎంపిక కాబడినవి మార్చి 2006 డిసెంబరు 2012
6 ఏడవ దశ (A) 700 km (430 mi) మార్గాలు ఎంపిక కాబడినవి డిసెంబరు 2006 డిసెంబరు 2012
7 నాల్గవ దశ (A) 5,000 km (3,100 mi) మార్గాలు ఎంపిక కాబడినవి డిసెంబరు 2006 డిసెంబరు 2012
8 ఏడవ దశ (B) మార్గాలు ఎంపిక కాబడినవి డిసెంబరు 2007 డిసెంబరు 2013
9 నాల్గవ దశ (B) 5,000 km (3,100 mi) మార్గాలు ఎంపిక కాబడినవి డిసెంబరు 2007 డిసెంబరు 2013
10 ఆరవ దశ (A) 400 km (250 mi) మార్గాలు ఎంపిక కాబడినవి డిసెంబరు 2007 డిసెంబరు 2014
11 ఏడవ దశ (C) మార్గాలు ఎంపిక కాబడినవి December 2008 December 2014
12 నాల్గవ దశ (C) 5,000 km (3,100 mi) మార్గాలు ఎంపిక కాబడినవి డిసెంబరు 2008 డిసెంబరు 2014
13 ఆరవ దశ (B) 600 km (370 mi) మార్గాలు ఎంపిక కాబడినవి డిసెంబరు 2008 డిసెంబరు 2015
14 నాల్గవ దశ (D) 5,000 km (3,100 mi) మార్గాలు ఎంపిక కాబడినవి డిసెంబరు 2009 డిసెంబరు 2015

"Financing of the National Highway Development Programme" (PDF). Archived from the original (PDF) on 28 ఫిబ్రవరి 2007.

Status from NHAI websiteసవరించు

National Highways Development Project is being implemented in all phases except phase VI at present. The present phases are improving more than 49,260 km of arterial routes of NH network to international standards. The project-wise details of NHDP all phases is below as of Jan 31, 2017:

NATIONAL HIGHWAY DEVELOPMENT PROJECT (NHDP)
Projects Total Length (Km.) Already 4/6 Laned (Km.) Under Implementation (Km.) Contracts Under Implementation (No.) Balance length for award (Km.)
NHDP GQ 5,846 5,846

(100.00%)

0 0 -
NS - EW

Ph. I & II

7,142 6,545 345 29 252
Port

Connectivity

435 379 56 6 -
NHDP Phase III 11,809 6,835 3,227 81 1,747
NHDP Phase IV 13,203 2,054 4,654 64 6,495
NHDP Phase V 6,500 2,359 761 22 3,380
NHDP Phase VI 1,000 - 165 8 835
NHDP Phase VII 700 22 19 1 659
NHDP Total 46,635 23,922 9,340 221 13,373
Others (Ph.-I, Ph.-II & Misc.) 1844 1614 230 11 -
SARDP -NE 110 105 5 1 -
Total by NHAI 48,589 25,641* 9,575 233 13,373
*Total 20,000 km was approved under NHDP Phase IV, out of which 14,799 km was assigned to NHAI and remaining Km with MoRTH.

Referencesసవరించు

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; nhai-estd అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. "R.P. Singh is new NHAI chief". 11 June 2012.
  3. "NHAI List of Board of Directors". NHAI. Archived from the original on 17 జనవరి 2016. Retrieved 9 January 2016.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-08-16. Retrieved 2018-05-22.

External linksసవరించు

మూస:Transport in India మూస:Indian Highways Network

Referencesసవరించు